రంగారెడ్డి

టీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 22: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అరాచక, అక్రమ పాలనకు చరమ గీతం పాడాలని.. అధికార పార్టీకి అసలైన ప్రత్యర్థి కాంగ్రెస్‌అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్ చేపట్టే రాష్టవ్య్రాప్త బస్సు యాత్రతో అధికారం చేపట్టడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. గురువారం రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లి బాబుల్‌రెడ్డినగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సబితారెడ్డి మాట్లాడుతూ గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చేవెళ్ల నుంచే పాదయాత్రను చేపట్టారని అన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పి ఎన్నికల్లో గెలుపొందారని అన్నారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 26న చేవెళ్ల నియోజకవర్గం నుంచి బస్సుయాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ని ఢీకొట్టలేకే కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కి ఎంతో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పారు.
కేసీఆర్ లాంటి నాయకులు కాంగ్రెస్‌ని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. బస్సుయాత్రకు రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచే సుమారు 30వేల మంది హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి పీ.కార్తీక్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్‌చార్జి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నాయకులు చెక్కల ఎల్లయ్య, సామ ఇంద్రపాల్ రెడ్డి, వేణుగౌడ్, శ్రీ్ధర్ రెడ్డి, సిద్ధేశ్వర్, రమేష్, ముదిరాజ్, సతీష్, కృష్ణారెడ్డి, అశోక్ యాదవ్, ముంగి జైపాల్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, సదాలక్ష్మి, కావటి వెంకటేష్ పాల్గొన్నారు.