రంగారెడ్డి

ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మార్చి10: అనుమానాస్పద స్థితిలో ఓ ఇంజనీరింగ్ విద్యార్ధిని అదృ శ్యం అయిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని ప్రిన్సిటన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం డీ.మంగమ్మ (20) ఈ నెల అయిదున వనపర్తి జిల్లా నాగమ్మతండాకు అనారోగ్యం కారణంగా వెళ్లి తిరిగి కళాశాల హస్టల్‌కు చేరుకుంది. అదే హాస్టల్‌లో ఉంటున్న వరుసకు సోదరి అయిన విద్యార్ధిని సునితకు తాను తెచ్చుకున్న దుస్తులను ఇచ్చి బయటకు వెళ్లినట్లు తెలిపారు. ఎంతకు తిరిగి రాక పోవటంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. తల్లిదండ్రులు బందు, మిత్రుల వద్ద వెదికినా పలితం లేక పోవటంతో ఘట్‌కేసర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అదృశ్యం అయిన యువతి ఫోను మోగుతున్న ఎంతటం లేదని చెప్పారు. యువతి తండ్రి జాను యిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్‌స్పెక్టర్ పీ.రఘువీర్ రెడ్డి తెలిపారు.

బావిలో పడి తల్ల్లీ,బిడ్డ మృతి

వికారాబాద్, మార్చి 10: అనుమానాస్పద స్థితిలో తల్లి, పది నెలల కొడుకు బావిలో పడి మృతిచెందిన సంఘటన వికారాబాద్ పోలిస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలలోకి వెళితే నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడి గ్రామానికి చెందిన వరాలు (23)కు వికారాబాద్ మండలం అత్వెల్లి గ్రామానికి చెందిన అశోక్‌తో మూడేళ్ళక్రితం వివాహం జరిగింది. వీరికి పది నెలల కొడుకు అఖిలేశ్ ఉన్నాడు. భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో తల్లి, కొడుకుతో సహా బావిలో పడి మృతిచెందిందని గ్రామంలో ప్రచారం జరుగుతుండగా, మతిస్థిమితం లేకనే బావిలో పడి మృతిచెందిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. మృతురాలి తల్లి మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్రాన్ని దోచుకోవడమే
కేసీఆర్ లక్ష్యం

మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శ

రాజేంద్రనగర్, మార్చి 10: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మెన్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డిలతో కలిసి హాజరయ్యారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ రాష్ట్రంలో అంతులేని అవినీతికి తెరలేపారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలే కనబడుతున్నాయన్నారు. కేసీఆర్ నిరుద్యోగులకు కనీసం ఉద్యోగాలు విఫలమయ్యారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు సోనియాగాంధీ వద్దకు వెళ్లి పార్టీని కాంగ్రెస్‌లో కలుపుతానని హామీ ఇచ్చి మాట తప్పిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సామ రాజ్‌పాల్‌రెడ్డి, నార్సింగ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ఈ ఎన్ అశోక్‌కుమార్, మాజీ కౌన్సిలర్ బాబురావ్ యాదవ్, దారమోని రమేష్ ముదిరాజ్, మస్న వెంకటేష్, ధనుంజయ, కావటి వెంకటేష్, రాజేష్ షిండే,రాజేష్ నాయుడు, సురేష్ ముదిరాజ్, నరేష్ పాల్గొన్నారు.
సందర్శకుల సందడే సందడి