వాసిలి వాకిలి

శని కూడా మనల్ని స్నేహించాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శని గ్రహంతో మనం స్నేహంగా ఉండాలనుకుంటున్నాం సరే... మరి శని గ్రహం కూడా మనతో స్నేహించాలని అనుకుంటుండాలి కదా! స్నేహానికి కావాల్సింది రెండువైపుల నుండి సమాన స్పందన. కాబట్టి స్నేహించాలని మనం అనుకుంటే సరిపోదు.. శని కూడా మనతో స్నేహించాలని అనుకోవాలి. సామాన్యంగా స్నేహానికి కావల్సిన లక్షణాలు మనలో కొన్ని ఉండాలి. శనిలోను కొన్ని ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్యా స్నేహం నెలకొంటుంది. ఇలా చూసినప్పుడు శని మన నుండి కోరుకుంటున్నదేమిటి?
స్నేహితుడనే వాడు మనకు స్థిరత్వాన్ని కల్పించాలి. కొంత రక్షణ కల్పించగలగాలి. సమాన అభివృద్ధికి తోడ్పడగలగాలి. అంటే మనల్ని ఒక మెట్టు అన్నా పైకి ఎక్కించగలిగేవాడితోనే స్నేహించాలనుకుంటాం. కొంత మనల్ని కంఫర్ట్ జోన్‌లో ఉంచగలిగే స్నేహితుడి కోసమే వెతుకుతుంటాం. మనం శనితో స్నేహించాలనుకునేది మనల్ని కంఫర్ట్ జోన్‌లోకి తీసుకెళ్లగలడనే! ఇటువంటి కొంత కంఫర్ట్ జోన్‌ను శని కూడా మన నుండి కోరుకుంటాడు. కాబట్టి శనితో స్నేహించటానికి ముందు మనల్ని మనం కొంత తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే మనం శనికి స్నేహపాత్రులం అవుతాం.
* మన దైనందిన జీవితం శనిని ఆకర్షిస్తుంది.
మనం పుట్టినప్పటి నుండి మన నిత్య వ్యవహార సరళిని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు శని. అంటే మనం రోజువారీ చేసే పనులను ఎంత సమర్థవంతంగా చేస్తున్నామా అన్నదాన్ని శని మనతో స్నేహించటానికి పూర్వం పరిగణనలోకి తీసుకుంటాడు. అంటే మన సమర్థతను మన దైనందిన జీవన కార్యక్రమాల నుండి బేరీజు వేయగల శక్తి శని సొంతం. పైగా శనికి కాలంతో పోటీ పడడం బాగా తెలుసు. అంటే కాలం విలువ తెలిసిన వాడు శని. ఒక్క క్షణాన్ని వృధాగా పోనివ్వటం ఇష్టపడని వాడు శని. అటువంటి శనికి మనం ఇష్టసఖులం కావాలంటే మనకీ కాలం విలువ తెలిసి ఉండాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం తెలిసి ఉండాలి. కాలయాపన చేయని వ్యక్తిత్వానికి శని చేరువ అవుతాడు. కాబట్టి శని మనతో స్నేహించాలి అనుకుంటున్నప్పుడు ముందుగా మనం మన దినచర్యను పకడ్బందీగా, ఏవిధంగానూ కాలం దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి.
* మనం కష్టపడితేనే శని కరచాలనం చేసేది
కష్ట్ఫేలే అన్నది శనికి ఇష్టమైన నినాదం. అంటే కష్టపడే వారిని శని ఇష్టపడతాడన్న మాట. శ్రామికులు, కర్షకులు, కర్మిష్ఠులు శనికి ప్రీతిపాత్రులు. చెమట బిందువును నమ్ముకున్న వారికి శని అన్యాయం చేయడు. పనిని ఇష్టంగా చేసిన వారిని శని కావాలనుకుంటాడు. పనులను పద్ధతిగా చేసే వారికి శని అనుకూలిస్తుంటాడు. ప్రణాళికా బద్ధంగా చేసేవారిపై తన చల్లని చూపు ప్రసరిస్తాడు. బద్ధకస్తులతోనూ ఆవులిస్తుంటాడు. మొత్తానికి పనులను ఆలోచించి చేసే వారికి, ఒకటికి పదిసార్లు సరిచూసుకుని చేసే వారికి శని స్నేహితుడే కాదు. ఆత్మీయుడు అవుతాడు. ఏ పని చేసినా జాగ్రత్తగా చేయగలిగితే శని మనకు తోడుగా ఉండి అనుకూల ఫలితాలనిస్తాడు. కాబట్టి మనం శనితో చేతులు కలపాలనుకుంటుంటే మనం చేసే పనిని ఇష్టపూర్వకంగా చేయటానికి సంసిద్ధం కావాలి.
* ఇతరులకు సహాయం
చేయగలిగితేనే శని సహకరించేది
మనకు ప్రతీది అవసరమే అనిపిస్తుంది. అంటే మనది స్వార్థపూరిత వ్యక్తిత్వమన్న మాట. చెట్టుకు కాసిన పళ్లన్నీ మనకే కావాలనుకోవటం దురాశే! పోనీ అన్నీ కోసుకుని ఇంటికి తీసుకెళ్లినా మనం తినగలిగేదీ కొనే్న... తక్కినవన్నీ కుళ్లి కంపుకొడతాయి. కాబట్టి అవసరమైనంత వరకే మనం కోరుకోవాలి. అవసరానికి మించి అందుతున్నప్పుడు వాటిని పదుగురికి పంచిపెట్టాలి. అలాగే సహాయం అర్థించటమే కాదు, సహాయం చేయటమూ మన వ్యక్తిత్వమై ఉండాలి. ఇలా పదుగురికి సహకరించే చోటనే శని సహకారమూ అందుతుంటుంది. ఆర్థికంగా ఆడుకుంటేనే మనం సహాయం చేసినట్లు కాదు. ఒక మాట సహాయం, ఒక చేత సహాయం, ఒక ఆలోచన పంచటం, ఒక సానుకూల భావాన్ని వ్యాపింపచేయటం... ఇవన్నీ కూడా సహకరించటాలే, సహాయాలే.
* ఉన్నంతలో కొంత
పంచటం శనికి ఇష్టం
పంచిన వ్యక్తిత్వం పెరుగుతుంటుంది. పంచిన జేబు పెద్దదవుతుంటుంది. శనికి పంచటం ఇష్టం. పంచిన వారిని పెంచటం ఇష్టం. సంపాదనలో కొంత పంచగలిగితే మన సంపాదన పెరిగేలా చేస్తుంటాడు శని. ఆర్థికంగానే కాదు హార్దికంగాను ఆదుకోవచ్చు. ఆహారాన్ని పంచవచ్చు. ఈ చేతలన్నీ శనిని మనకు దగ్గిర చేస్తాయి.
* బంధాలను లెక్క చేయని వ్యక్తిత్వం శనికి కావాలి
అంటే బాధ్యతలను కాదనుకోవటం కాదు... బాధ్యతగా వర్తిస్తూ బంధాలకు, భావోద్వేగాలకు దూరంగా ఉండటం అవసరం. అంటే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగిన వ్యక్తులతోనే శని తన స్నేహం కొనసాగిస్తాడు. అంటే శని విస్తృతమైన విశ్వహితాన్ని కాంక్షిస్తాడు. అంటే మన వ్యక్తిత్వం విస్తృతమైంది కావాలి. సంకుచితంగా ఆలోచిస్తామంటే కుదరదు... స్వార్థంగా ఉంటామంటే కుదరదు... ఆర్జన స్వంతానికే అంటే కుదరదు. అంటే స్వార్థపరులు కానివారికి, అహంభావులు కాని వారికి శని సన్నిహితమవుతుంటాడు.
* సాదాసీదా జీవనశైలి ఉన్న చోటనే శని చల్లని చూపు
ఉపవాసాలు శనికి ఇష్టం. అంటే మితంగా ఉండేవారికి శని మిత్రుడు. అతిగా ఉండేవారికి శని దూరంలో ఉంటాడు. ఆహారం విషయంలో నయినా, విహారం విషయంలో నయినా తగ్గి వర్తించటం అవసరం. ఉన్నప్పుడు విచ్చలవిడిగా, లేనప్పుడు బికారిగా ఉండటం శని ఇష్టపడడు. కాబట్టి ఒకే విధమైన జీవన విధానానికి అలవాటు పడటం ముఖ్యం. సాధ్యమైనంతవరకు సామాన్యంగా, సాధారణంగా ఉండగలిగితే చాలు శని మన స్నేహాన్ని హర్షిస్తాడు.
* మనసు మారాం చేస్తే శని సహించడు
మనసు మనం చెప్పినట్లు వినాలే తప్ప మనసు చెప్పినట్లు మనం వర్తించకూడదు. అంటే ఆలోచనలు, మన జీవితం మన చేతుల్లో, మన చేతల్లో ఉండాలి. కోరికలు గుర్రాలు కాకుండటం మనసు చేతిలో ఉన్న పని. కాబట్టి మనసు సరిగా వర్తించాలంటే ధ్యానం, యోగం ముఖ్యం. ప్రతీరోజు కొంత సమయాన్ని యోగ సాధనకు, ధ్యానానికి కేటాయించగలిగిన వారికి శని అందుబాటులో ఉంటూ సత్ఫలితాలనిస్తుంటాడు.
ఇలా మనం నిత్యజీవన విధానంలో, దైనందిన జీవితంలో ఈ ఏడడుగులు వేయగలిగితే చాలు శని మనతో స్నేహించటానికి సదా సంసిద్ధమయ్యే ఉంటాడు. శని అంటేనే సత్య ప్రతీక. కాబట్టి మనది అబద్ధపు నడత కాకుండా చూసుకోవాలి. మనం మాయామోహితులం కాకుంటే, భ్రతిమంత జీవితంలోకి అడుగిడకుంటే చాలు మన అడుగులు సత్యం వైపుగా పడతాయి... శని అడుగులు మనవైపు పడతాయి.
* యోగిక, ఆథ్యాత్మిక ప్రగతి కారకుడు శని
యోగ సాధకులకు, ధ్యాన మగ్నులకు శని అత్యంత ఆప్తుడు. కారణం బంధాలను, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం తెలిసిన వారు కాబట్టి వీరి యోగశక్తి కుండలినిలో ఉంటుంది. అది వీరి ఆథ్యాత్మిక సంపన్నత. అంతా దైవత్వమే. అసలు విశ్వమే మానవ దేహంలో సూక్ష్మ రూపంలో ఉంటుంది. అంటే స్థూలంగా ఉన్న విశ్వం సూక్ష్మ రూపంలో మన దేహంలో ఉంటుంది. విశ్వంలో జరిగే ప్రక్రియ అంతా దేహంలోను జరుగుతుంటుంది. అయితే ఈ విశ్వప్రక్రియను దేహంలో గమనించటం సాధ్యమయ్యేది ఒక్క యోగసాధకులకి, ధ్యానమగ్నులకి, విశ్వావలోకనమంతా కాల సంబంధి కాబట్టి శని ప్రమేయం అధికంగా ఉంటుంది. సూర్యుడు మనకి శక్తిని ఇస్తుంటే చంద్రుడు మన మనసును ప్రభావితం చేస్తుంటాడు. బుధుడు తెలివితేటలను ఇస్తుంటే గురువు జ్ఞాన ప్రదాత అవుతున్నాడు. శని ఆథ్యాత్మిక, మార్మిక, యోగిక సంపన్నతకు కారకుడవుతున్నాడు.
సాధారణంగా శనిని కష్టాలకు మూలపురుషుడిగా చెప్పుకుంటుంటాం. సామాన్యుల దృష్టిలో శని స్థానం ఇదే. అయితే సంఘర్షణ లేనిదే జీవితం రాణించదు అన్న వివేకం ఉన్న వారికి శని ఒక గొప్ప మార్గదర్శి. జీవితం విలువను ఎత్తి చూపేవాడు శని. బంధాల నుండి విముక్తి కలిగించి స్వేచ్ఛకున్న విస్తృతిని చూపేవాడు శని. అందుకే యోగసాధకులు తాము స్వేచ్ఛాజీవులమనుకుంటారు. అంటే భౌతిక బంధాలకు అతీతం కావటమే ఈ ఆలోచనకు ఆధారం. అంటే ఆత్మోన్నతికి అన్ని విధాలా సహకరించే వాడు శని.
ఒక విధంగా జీవితంలో సంప్రాప్తించే కష్టాలు మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి. ప్రశ్నలకు సమాధానాలను, సమస్యలకు పరిష్కారాలను మన జీవితం నుండే వెలికితీసేది శని. అంటే శని శాశ్వత పరిష్కారాలను చూపిస్తాడు. సంఘర్షణలకు షార్ట్ కట్ మార్గాలను చూపాడు. ఓపిగ్గా ఉండగలిగే వారికి, సహనంగా ఉండగలవారికి, సంయమనంతో ఉండగలవారికి శని మిత్రుడు. కలల ప్రపంచం నుండి వాస్తవ ప్రపంచానికి తీసుకొచ్చేవాడు శని.
* శని లేనిదే జీవితం లేదు
శని లేనిదే జీవితం లేదు... సంఘర్షణ లేని జీవితానికి విలువ లేదు. విలువ తెలియదు. మంచి జీవితం శని కనుసన్నలలో తీర్చిదిద్దబడుతుంది. అంటే శని మన జీవన మార్గదర్శి. వజ్రాన్ని ఎంతలా సానబెడితే అంతలా దాని విలువ పెరుగుతుంది. బంగారం ఆభరణంగా మారాలంటే అనేక స్థితులను దాటుకుంటూ రావలసిందే. అంటే పుటం పెడితేనే బంగారం మెరిసేటట్లుగా జీవితాన్ని కూడా పుటం పెట్టాల్సిందే. ఆ పుటం పెట్టే స్వర్ణకారుడు శని.
యోగ జీవితంలో మనం సాధించాలనుకునేది సంపూర్ణత్వాన్ని. ఇలా సంపూర్ణ పురుషులంగా పరిణమించాలంటే మన బాహ్య జీవితం సజావుగా సాగితే సరిపోదు... అంతర్యానంతో ఆత్మదర్శనం కలిగి ఆత్మా పరసీమలను చేరాల్సిందే. ఈ ఆత్మ జ్ఞానాన్ని కలిగించేవాడు శని.

-విశ్వర్షి 93939 33946