వారం వారం గోచారం

వారం వారం గోచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం వ్యాపారవేత్తల, సోదరుల సహకారం లభిస్తుంది. రచనారంగానికి ప్రోత్సాహం. ప్రయాణాలకు అవకాశం. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు లేకుండా చూసుకోవాలి. సోమ, మంగళవారాల్లో సౌకర్యాదులపై దృష్టి. ఆహార విహారాలు శ్రమతో సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త వహించాలి. అధికారుల ఒత్తిడులు, గృహ వాహనాది వ్యవహారాల్లో కొంత ఒత్తిడులుంటాయి. బుధ, గురువారాల్లో సంతాన వర్గంపై దృష్టి. మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. లాభాలున్నా ఆశించిన సంతృప్తి ఉండదు. శుక్ర,శనివారాల్లో వ్యాపార వ్యవహారాలు. పోటీలు అధికం. వ్యతిరేకతలు తప్పకపోవచ్చు. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. అనుకోని ఖర్చులుంటాయి. జాగ్రత్తగా మెలగాలి. పరామర్శలుంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం కుటుంబ ఆర్థికాంశాలపై దృష్టి, మాట విలువ పెరుగుతుంది. ఖర్చులు అధికం. అనుకోని ఇబ్బందులు, వ్యాపార, వ్యవహార నష్టాలుంటాయి. అనారోగ్య సూచన. సోమ, మంగళవారాల్లో ప్రయాణాలున్నా శ్రమ తప్పకపోవచ్చు. సోదర సోదరీమణులతో కలయిక. ఇతరుల సహకారం. కీర్తిప్రతిష్ఠలపై దృష్టి. ఆధ్యాత్మిక ప్రయాణాలు, కార్యక్రమాలపై ఆసక్తి. బుధ, గురువారాల్లో సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాలపై ఆసక్తి. గృహ వాహనాది వ్యవహారాలపై చర్చలు. సంతోషం కోసం ఖర్చులు చేస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త వహించాలి. శ్రమాధిక్యం. శుక్ర, శనివారాల్లో ఆలోచనలకు రూపకల్పన. నూతన వ్యాపారాలు ఫలిస్తాయి. సంతానవర్గంపై దృష్టి. వేరు వేరు రూపాల్లో లాభాలుంటాయి. అన్ని వ్యవహారాల్లో ప్రయోజనాలు, విజయం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆదివారం నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భాగస్వామ్యాలు విస్తరిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. సోమ, మంగళ వారాల్లో ఆర్థికాంశాల్లో ప్రాతినిధ్యం వహిస్తారు. కుటుంబంలో కొంత అశాంతి. మాటల్లో తొందరపాటు. అనుకోని ఇబ్బందులు. వ్యవహారాల్లో జాగ్రత్త. అన్ని వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. బుధ, గురువారాల్లో ప్రభుత్వ వర్గ సంబంధమైన తోడ్పాటు లభిస్తుంది. పెద్దల అనుకూలత. ప్రయాణాదులకు అవకాశం. ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి, గుర్తింపు లభిస్తుంది. శుక్ర శనివారాల్లో గృహ వాహనాది సౌకర్యాదులపై దృష్టి, ఆహార విహారాలపై ఆసక్తి. సామాజిక వ్యవహారాల్లో విజయం. వ్యాపారాల్లో అనుకూలత.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆదివారం ఖర్చులు, ప్రయాణాలు ప్రాధాన్యం వహిస్తాయి. వ్యాపార సంబంధమైన దూర ప్రయాణాలకు అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. సౌఖ్యం కోసం వెచ్చిస్తారు. సోమ, మంగళ వారాల్లో నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొంత భయంగా ఉంటుంది. భాగస్వామ్యాలకు అనుకూలం. స్నేహానుబంధాలు, వివాహానుబంధాలు బలపడతాయి. వ్యవహారాల్లో విజయం. బుధ, గురువారాల్లో కుటుంబ వ్యవహారాలు చర్చకు వస్తాయి. ఆర్థిక నిర్ణయాదుల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. అనుకోని సమస్యలుంటాయి. కాలం, ధనం, శ్రమ వ్యర్థమయ్యే సూచనలు. లక్ష్యాల సాధన కోసం ప్రయత్నం. వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించాలి. శుక్ర, శనివారాల్లో సహకారం లాభిస్తుంది. అన్ని పనుల్లో అనుకూలత. ప్రయాణావకాశాలు. వ్యవహారాల్లో అనుకూలత, కీర్తిప్రతిష్ఠలు. స్ఫురణశక్తితో కార్యనిర్వహణ. రచనలకు ప్రోత్సాహం. సంతృప్తి.్ఘ
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆదివారం లాభాలపై దృష్టి. అన్ని పనుల్లో ప్రయోజనాలున్నా జాగ్రత్త వహించాలి. అనుకోని సమస్యలు ఏవైనా రావచ్చు. వ్యాపార వ్యవహారాల్లో అప్రమత్తం. ఆరోగ్యం జాగ్రత్త. సోమ, మంగళవారాల్లో ఖర్చులు అధికం. ప్రయాణాలకు అవకాశం. ఆహార విహారాదుల కోసం బాగా వెచ్చిస్తారు. విహార యాత్రలకు అవకాశం. జల సంబంధమైన అంశాలపై దృష్టి. ఆసుపత్రులు, పరామర్శలకు అవకాశం. బుధ, గురువారాల్లో నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. అయినా అప్రమత్తంగా మెలగాలి. అనుకోని సమస్యలుంటాయి. అధికారులతో జాగ్రత్త. ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపులు ముందుగా చేయాలి. శుక్ర, శనివారాల్లో ఆర్థిక నిర్ణయాదులుంటాయి. అనుకోని సమస్యలు. వ్యాపార లోపాలుంటాయి. మాట విలువ తగ్గే సూచనలు. కుటుంబంలో కొంత అశాంతి, శ్రమలేని సంపాదనలపై దృష్టి. సౌఖ్య లోపాలకు అవకాశం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆదివారం వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక వ్యవహారాలుంటాయి. భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాలకు అనుకూలం. సోమ, మంగళ వారాల్లో అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. వ్యవహారాల్లో అనుకూలత, లక్ష్యాలను సాధిస్తారు. మాతృవర్గ సంబంధమైన నూతన కార్యక్రమాలపై దృష్టి. ఆహార విహారాలుంటాయి. బుధ, గురువారాల్లో అనవసర వ్యయం ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన చెల్లింపులు చేయాలి. భాగస్వామ్యాల్లో ఒత్తిడులు. పరిచయాల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. శుక్ర, శనివారాల్లో ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. ఆలోచనలకు రూపకల్పన. కార్యనిర్వహణ దక్షత. భాగస్వామ్యాల్లో అనుకూలత. స్నేహ, వ్యాపారానుబంధాలు విస్తరిస్తాయి.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆదివారం లక్ష్యాల సాధనపై దృష్టి. శ్రమ తప్పకపోవచ్చు. నూతన కార్యక్రమాల రూపకల్పన. కీర్తి ప్రతిష్ఠలుంటాయిఒ. వ్యతిరేకతలపై విజయం. వ్యవహారాల్లో అనుకూలత. సోమ, మంగళవారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారుల ఆదరణ. శ్రమాధిక్యం. సామాజికమైన గుర్తింపుకోసం ప్రయత్నం. స్ర్తిలవల్ల అనుకూలత. ఆహార విహారాలుంటాయి. గృహ వాహనాది సౌకర్యాలపై దృష్టి. బుధ గురువారాల్లో అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. ఆలోచనలకు రూపకల్పన. మనోభీష్టాలు నెరవేరుతాయి. పోటీలు, ఒత్తిడులున్నా విజయసాధన ఉంటుంది. సంతానవర్గ సంబంధమైన సమస్యలపై దృష్టి. శుక్ర, శనివారాల్లో ఖర్చులు, ప్రయాణాదులపై దృష్టి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులకు అవకాశం. శ్రమాధిక్యం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదివారం అనుకోని సమస్యలు. అనారోగ్య లోపాలకు అవకాశం. ఆకస్మిక ఇబ్బందులుంటాయి. కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్త. మాట విలువ తగ్గే సూచనలు. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. స్ఫురణశక్తి విస్తరిస్తుంది. సోమ, మంగళవారాల్లో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. దైవానుగ్రహం, సంతృప్తి, ప్రయాణావకాశాలు. సన్మానాలుంటాయి. ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం. బుధ, గురువారాల్లో సామాజికమైన గుర్తింపు. శ్రమ తప్పకపోవచ్చు. కొంత చికాకుగా ఉంటుంది. సౌకర్యాదులపై దృష్టి సారిస్తారు. ఆహార విహారాల్లో ఇబ్బందులుంటాయి. మానసికమైన ఒత్తిడులు. శుక్ర, శనివారాల్లో అన్ని పనుల్లో ప్రయోజనాలు. పెద్దల అనుకూలత. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతానవర్గ సంబంధమైన నూతన నిర్ణయాదులుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదివారం భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపార వ్యవహారాలపై దృష్టి. ఆహార విహారాల కోసం ఖర్చులుంటాయి. గృహ వాహనాదులుంటాయి. నిర్ణయాదుల్లో అనుకూలత. సోమ, మంగళ వారాల్లో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య లోపాలకు అవకాశం. అన్ని పనుల్లో జాగ్రత్త. కుటుంబ ఆర్థికాంశాల్లో ఒత్తిడులు. మాట విలువ తగ్గే సూచనలు. దైవారాధన తప్పకపోవచ్చు. బుధ, గురువారాల్లో అన్ని పనుల్లో అనుకూలత. లక్ష్యాల సాధన. కీర్తిప్రతిష్ఠలు పెరిగే అవకాశం. ప్రయాణావకాశాలు. సంతృప్తి లభిస్తుంది. సౌకర్యాలు శ్రమకు గురిచేసే అవకాశం. ఆహార విహారాల్లో జాగ్రత్త. శుక్ర, శని వారాల్లో వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. సౌకర్యాలు సంతృప్తినిస్తాయి. వ్యవహారాల్లో సంతోషం. శ్రమతో కార్యనిర్వహణ. గౌరవం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆదివారం వ్యతిరేకతలు పెరుగుతాయి. పోటీల్లో విజయం. వ్యర్థమైన ఖర్చులపై దృష్టి. వ్యాపార వ్యవహారాల్లో విజయసాధన. ప్రయాణాలుంటాయి. తొందరపాటు కూడదు. సోమ, మంగళవారాల్లో పరిచయాలు విస్తరిస్తాయి. సామాజిక అనుబంధాలకు అనుకూలం. నిర్ణయాదులు సంతృప్తినిస్తాయి. స్ర్తి వర్గ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. వ్యాపారాదుల్లో నూతన నిర్ణయాదులకు అవకాశం. బుధ, గురువారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. ప్రమాదాలు, ఆకస్మిక నష్టాలకు అవకాశం. మానసిక ఒత్తిడి. కుటుంబంలో అశాంతి. ప్రభుత్వ, పితృవర్గ వ్యవహారాల్లో అనుకూలత. శుక్ర, శనివారాల్లో అని పనుల్లో సంతృప్తి. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. విహార యాత్రలకు అనుకూలం. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి. మనోభీష్టాలు నెరవేరుతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. కుటుంబంలో సంతృప్తి. సోమ, మంగళవారాల్లో అన్ని పనుల్లో పోటీలుంటాయి. వ్యవహారాల్లో విజయం. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఖర్చులు, పెట్టుబడులు తప్పకపోవచ్చు. ప్రయాణావకాశాలు. ఆహార విహారాలపై దృష్టి. సౌఖ్యంగా గడుపుతారు. బుధ, గురువారాల్లో అధికారిక పరిచయాలుంటాయి. భాగస్వామ్యాల్లో జాగ్రత్త వహించాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో శ్రమ తప్పకపోవచ్చు. నిర్ణయాదుల్లో అనుకూలత. మాటల్లో తొందరపాటు కూడదు. శుక్ర, శని వారాల్లో అన్ని పనుల్లో జాగ్రత్త. అనుకోని సమస్యలు. అనారోగ్య లోపాలు. ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయాలి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం సౌకర్యాదులపై దృష్టి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. శ్రమ తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. ఒత్తిడులున్నా గుర్తింపు లభిస్తుంది. సామాజిక గౌరవం. నిర్ణయాదుల్లో అనుకూలత. సోమ, మంగళవారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతాన వర్గ అనుకూలత. నూతన కార్యక్రమాల రూపకల్పన. అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు. అనుకూలత. బుధ గురువారాల్లో అన్ని వ్యవహారాల్లో జాగ్రత్త. పోటీలు తప్పకపోవచ్చు. శ్రమతో విజయం. శారీరక ఒత్తిడులుంటాయి. నిర్ణయాదుల్లో జాగ్రత్త. ఖర్చులు, పెట్టుబడులు అత్యధికవౌతాయి. శుక్ర, శనివారాల్లో పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత. నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. స్నేహానుబంధాలు బలపడతాయి. విహారయాత్రలకు అనుకూలం.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 9704227744