వారం వారం గోచారం

వారం వారం గోచారం (9-9-2018 నుంచి 15-9-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం అభీష్టసిద్ధి. ఆలోచనలు ఫలిస్తాయి. పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత. అనుబంధాలు మెరుగుపడతాయి. సంతానవర్గ అనుకూలత. సోమవారం కొత్త పనులపై దృష్టి. వ్యతిరేకతలపై విజయం. పోటీ రంగంలో గెలుపునకు అవకాశం. పిల్లల విషయంలో చికాకు. మంగళవారం గుర్తింపు కోసం ప్రయత్నం. రుణాలను తీర్చుకుంటారు. వ్యతిరేకతలను అధిగమిస్తారు. సంతృప్తి. బుధవారం కార్యనిర్వహణలో తలమునకలవుతారు. బాధ్యతలు అధికం. భాగస్వామ్యాలపై దృష్టి. వృత్తిలో వత్తిడులు. గురువారం సౌకర్యాలు శ్రమకు గురి చేయవచ్చు. ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. భాగస్వామ్యాల్లో శ్రమ. శుక్రవారం అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాలు. పెద్దలతో చర్చలు చేస్తారు. సంతోషంగా గడుపుతారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం నిర్ణయాదులకు అనుకూలం. కొత్త పనులపై దృష్టి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. స్ర్తి జన సహకారం లభిస్తుంది. సంప్రదింపులుంటాయి. సోమవారం కార్యనిర్వహణ వల్ల ఒత్తిడి పెరిగే సూచనలు. శారీరక శ్రమ. అనారోగ్య భావనలు. జాగ్రత్త అవసరం. మంగళవారం కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనంపై దృష్టి. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. బుధవారం పోటీ రంగంలో జాగ్రత్తగా మెలగాలి. వ్యితిరేకతలున్నా విజయం సాధిస్తారు. కొంత శ్రమ తప్పదు. గురువారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. ప్రయాణాల్లో ఇబ్బందులు. ధనం కాలం వ్యర్థంగా కోల్పోయే అవకాశం. శుక్రవారం సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం అన్ని పనుల్లో లాభాలుంటాయి. ప్రయోజనాలు సంతృప్తి నిస్తాయి. విహార యాత్రలకు అవకాశం. విద్యా వ్యవహారాల్లో అనుకూలత. కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు. సోమవారం లక్ష్యాలను సాధించడంలో ఒత్తిడులుంటాయి. అధికారులతో అప్రమత్తంగా మెలగాలి. వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. మంగళవారం లాభాలు సంతృప్తినిస్తాయి. పెద్దల అనుకూలత. అనుకోని ఒత్తిడులు అధిగమిస్తారు. సామాజిక గౌరవం. బుధవారం కుటుంబ ఆర్థికాంశాల్లో సమస్యల వల్ల ఉద్యోగాదుల్లో ఇబ్బంది పడతారు. లాభాలలో లోపాలు. గురువారం అనుకోని సమస్యలుంటాయి. అన్ని పనుల్లో జాగ్రత్తగా మెలగాలి. ప్రయోజనాలు కోల్పోవచ్చు. శుక్రవారం అన్ని పనుల్లో అనుకూలత. గుర్తింపు, గౌరవాదులు విస్తరిస్తాయి. పెద్దల ఆశీస్సులు, అనుకూలత.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం సౌకర్యాలు సమకూర్చుకునే ప్రయత్నం. ఆహార విహారాలపై దృష్టి. పోటీలు, వత్తిడులు ఎదురౌతాయి. చికాకులున్నా విజయం సాధిస్తారు. సోమవారం ప్రయాణాదుల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. అప్రమత్తంగా మెలగాలి. మంగళవారం సంప్రదింపులకు అనుకూలం. సంతానవర్గ సంతృప్తి. కొత్త ఆలోచనలు. వ్యవహార విజయం. బుధవారం కీర్తి ప్రతిష్టలపై దృష్టి. దూర ప్రయాణ భావనలుంటాయి. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. శ్రమ. గురువారం భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు అనుబంధాలు విస్తరిస్తాయి. సంప్రదింపులలో జాగ్రత్త వహించాలి. శుక్రవారం పెద్దలతో వ్యతిరేకతలు కూడదు. గౌరవం తగ్గే అవకాశం. పోటీల్లో విజయం సాధిస్తారు. గుర్తింపు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విందులు విలాసాల కోసం హాయిగా వెచ్చిస్తారు. సౌఖ్యంగా గడుపుతారు. కుటుంబంలో అనుకూలత. విశ్రాంతి లభిస్తుంది. సోమవారం పరామర్శలకు అవకాశం. అధికారిక ప్రయాణాదులు. విశ్రాంతి లోపం. నిర్ణయాదుల్లో అనుకూలత. మంగళవారం నూతన కార్యక్రమాలపై దృష్టి. అనేక బాధ్యతలుంటాయి. శ్రమ ఉన్నా కార్యనిర్వహణలో గుర్తింపు. బుధవారం ఆలోచనల్లో వత్తిడులు. సంతానవర్గ వ్యవహారాల్లో తొందరపాటు కూడదు. నిర్ణయ లోపాలు. గురువారం లాభాలున్నా కొంత జాగ్రత్త వహించాలి. అనుకోని ఒత్తిడులు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. శ్రమాధిక్యం. శుక్రవారం మాట విలువ పెరుగుతుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో నూతన నిర్ణయాలు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం అన్ని పనుల్లో జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ఇబ్బందులుంటాయి. అనారోగ్య భావనలు. పనులను వాయిదా వేయడం మంచిది. స్నేహితుల వల్ల సమస్యలు, సోమవారం అధికారిక సమస్యలు. టాక్స్‌ల వంటివి ఇబ్బంది పెడతాయి. పితృవర్గ సమస్యలు. అప్రమత్తంగా మెలగాలి. మంగళవారం లక్ష్యాలను సాధించే భావనలు. సంతృప్తితో మెలగుతారు. ఉన్నత విద్యావకాశాలు. ప్రయాణాలు, గౌరవం, బుధవారం నిర్ణయాదుల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. ప్రయాణాదుల్లో ఇబ్బంది. ప్రవర్తనలో జాగ్రత్త అవసరం. గురువారం భాగస్వామితో జాగ్రత్త. పరిచయాలు, అనుబంధాలు ఇబ్బంది పెట్టే సూచనలు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. శుక్రవారం అధికారిక వ్యవహారాల్లో ఉన్నతి, గుర్తింపు. సామాజిక గౌరవం పెరిగే సూచనలు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం ఇతరుల సహకారం లభిస్తుంది. స్ర్తిలతో సంప్రదింపులుంటాయి. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ సంతృప్తి. అధికారిక వ్యవహారాలు. సోమవారం అధికారుల ఆదరణ. పెద్దల సహకారం. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. రచనలు వెలుగు చూస్తాయి. మంగళవారం ఇంటి వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు. సుఖంగా గడిపే ప్రయత్నం. విద్యారంగంలో గుర్తింపు. బుధవారం అనుకోని వత్తిడులు. చిన్న ప్రమాదాలకు అవకాశం. అందరితో జాగ్రత్తగా మెలగాలి. సౌకర్య లోపాలు. గురువారం మాట విలువ తగ్గే సూచనలు. తొందరపాటు పనికిరాదు. ఆలోచించి ప్రవర్తించాలి. సంతాన వర్గంపై దృష్టి. శుక్రవారం మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. కొత్త కార్యక్రమాల ప్రణాళికలుంటాయి. సంతోషం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం లాభాలు సంతృప్తినిస్తాయి. పెద్దల ఆశీస్సులు, అనుకూలత. సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయోజనాలు సంతృప్తినిస్తాయి. బాధ్యతలు సంతోషంగా నిర్వహిస్తారు. సోమవారం అధికారుల ఆదరణ. పెండింగ్ పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం. పెద్దలతో అనుకూలత. గౌరవం లభిస్తుంది. మంగళవారం ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత. విందులు విహారాలుంటాయి. విశ్రాంతి. సంతోషం. బుధవారం సౌకర్యాదుల్లో జాగ్రత్త. శ్రమాధిక్యం. ఆహార విహారాల్లో ఇబ్బందులు. పరామర్శలుంటాయి. గురువారం అనేక బాధ్యతలుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో శ్రమ ఉంటుంది. కార్య నిర్వహణ సమస్యలు. శుక్రవారం నిర్ణయాదుల్లో అనుకూలత. కొత్త పనులపై ఆసక్తి. శనివారం సహకార లోపాలుంటాయి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం పరిచయాలు అనుబంధాలు విస్తరిస్తాయి. లక్ష్యాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి. వ్యవహారాల్లో అనుకూలత. సోమవారం అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. అన్ని పనుల్లో మెలకువ పాటించాలి. భాగస్వామ్య ఒత్తిడులు. ఊహించని సంఘటనలు. కార్యక్రమాల వాయిదా మంచిది. బుధవారం వ్యర్థమైన ఖర్చులు. పరామర్శలకు అవకాశం. తొందరపాటు చర్యలుంటాయి. ప్రయాణాదుల్లో జాగ్రత్త. గురువారం వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాల్లో శుభ పరిణామాలుంటాయి. దూర ప్రయాణాదులుంటాయి. శుక్రవారం ధార్మిక కార్యక్రమాల నిర్వహణ. గుర్తింపు. కీర్తి ప్రతిష్టలుంటాయి. లక్ష్యాలను సాధిస్తారు. శనివారం లాభాలున్నా ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం కుటుంబ, ఆర్థికాంశాల్లో అనుకూలత. ఆహార విహారాలపై దృష్టి. సంతోషంగా గడుపుతారు. మాట విలువ పెరుగుతుంది. గృహ వాహనాది సౌకర్యాలు సంతృప్తినిస్తాయి. సోమవారం అధికారికమైన ధోరణి. మాట తీరును జాగ్రత్త పరచుకోవాలి. నిల్వధనం ఖర్చు కావచ్చు. సహకారం లభిస్తుంది. మంగళవారం నిర్ణయాదులకు అనుకూలం. ఇతరుల సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. సోదరానుకూలత. బుధవారం భాగస్వామ్యాలు, పరిచయాల్లో జాగ్రత్త వహించాలి. తొందరపాటు కూడదు. సౌకర్యాలపై దృష్టి. గురువారం నిర్ణయ లోపాలకు, తొందరపాటుకు అవకాశం. ఆచితూచి వ్యవహరించాలి. సౌఖ్యం కోసం అధిక ప్రయత్నం. శుక్రవారం ఆహార విహారాలకు అనుకూలం. శ్రమతో ఫలితాలు. విద్యారంగంలో గుర్తింపు, గౌరవాదులుంటాయి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అనేక రకాల ఖర్చులు తప్పకపోవచ్చు. విలాసాలు, విందులు, వినోదాలుంటాయి. సంతోషంగా గడిపే ప్రయత్నం. సోమవారం అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. అనేక కార్యక్రమాల బాధ్యతలు. పదోన్నతి ఉన్నా శ్రమ, సమస్యలుంటాయి. మంగళవారం అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు, అనుకూలత, వ్యవహార విజయం. బుధవారం సోదర వర్గంతో జాగ్రత్తగా మెలగాలి. సంప్రదింపుల్లో ఒత్తిడులుంటాయి. ప్రయాణాదుల కోసం ఖర్చులు అధికం. గురువారం దూర ప్రయాణాదులపై దృష్టి. ఉన్నత విద్య. పాశ్చాత్య పోకడలు ప్రభావితం చేస్తాయి. అసంతృప్తి. శుక్రవారం ధార్మికమైన ఖర్చులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణాదులకు అవకాశం.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం వ్యతిరేక ప్రభావాలను అధిగమించే ప్రయత్నం. శత్రువులపై విజయం. అనుకోని సమస్యలుంటాయి. ఇబ్బందులను అధిగమించాలి. పోటీ రంగంలో శ్రమతో గుర్తింపు. సోమవారం అధికారులతో వ్యతిరేకతలు ఏర్పడే అవకాశం. పితృవర్గంతో జాగ్రత్తగా మెలగాలి. మంగళవారం పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కొత్త పనుల నిర్వహణ. బుధవారం లాభాలున్నా అప్రమత్తంగా మెలగాలి. అన్ని పనుల్లోనూ చికాకులు, నిర్ణయాదులను వాయిదా వేయాలి. గురువారం ఆలోచనల్లో వత్తిడులు, నిర్ణయ శక్తిని కోల్పోయే అవకాశం. విద్యారంగంలో ఇబ్బందులుంటాయి. శుక్రవారం గౌరవ లోపాలకు అవకాశం. వ్యవహారాల్లో ఇబ్బంది. గురువులతో జాగ్రత్తగా మెలగాలి. దానధర్మాల వల్ల మేలు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744