వారం వారం గోచారం

వారం వారం గోచారం (21-4-2019 నుంచి 27-4-2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పనుల్లో ఆశించిన వేగం ఉండకపోవచ్చు. అప్రమత్తంగా మెలగాలి. నిర్ణయాల విషయంలో మరోసారి పరిశీలించుకోవడం మంచిది. కుటుంబ ఆర్థక వ్యవహారాల్లోనూ చికాకులకు అవకాశం. గౌరవ లోపాలుంటాయి. అసంతృప్తికి అవకాశం. వ్యాపారపరమైన పెట్టుబడులు, ఖర్చులు, విశ్రాంతి లోపాలకు అవకాశం. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాలు, విద్య, కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి. ప్రయాణాలు లాభిస్తాయి. వైజ్ఞానిక దృష్ట్టితో మెలగే అవకాశం. ఆధ్యాత్మిక, ధార్మిక భావనలు పెరుగుతాయి. కొంత అసంతృప్తి ఉంటుంది. విందులు, విలాసాదుల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. కార్యనిర్వహణ బాధ్యతలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. శ్రమతో కార్యక్రమాలు. గృహ వాహనాది వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. విద్యారంగంలోని వారికి అన్ని రకాల అనుకూలత. ప్రయాణాలు లాభిస్తాయి. సౌకర్యాదులు సమకూర్చుకుంటారు. సంతోషంగా గడుపుతారు. ఉన్నత వ్యవహారాలు వారం మధ్యమంలో నిర్ణయాదుల్లో సమస్యలుంటాయి. ఆలస్యం అధికవౌతుంది. నూతన కార్యక్రమాల నిర్వహణలో జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలుంటాయి. ఇబ్బందులను అధిగమించాలి. స్ర్తిలతో సమస్యలుంటాయి. వారాంతంలో వ్యతిరేకతలు అధికవౌతాయి. పోటీలు ఒత్తిడులు చికాకులను అధిగమిస్తారు. గుర్తింపు కోసం ప్రయత్నం. రుణాదులను అధిగమిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. ప్రయాణావకాశాలు. వ్యతిరేకతలపై విజయం. పోటీలు ఒత్తిడులను అధిగమించాల్సి వస్తుంది. విశ్రాంతి కోసం ప్రయత్నం. ఆశించినంతగా దొరకకపోవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణాదుల వల్ల మేలు కలుగుతుంది. దానధర్మాల వల్ల పుణ్యబలం పెంచుకుంటారు. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాస లోపాలు. అన్ని పనుల్లోనూ ఒత్తిడులు. కార్యనిర్వహణలో సమస్యలు. పనుల్లో ఆలస్యం. బాధ్యతలు బాగా పెరిగి ఇబ్బంది పెడతాయి. అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు నిర్ణయాలు కూడదు. సౌకర్యాల విషయంలోనూ కొంత శ్రమ ఉంటుంది. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో హాయిగా గడిపే ప్రయత్నం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరించే అవకాశం. పెద్దల సహవాసం ఆనందాన్నిస్తుంది. నిర్ణయాదుల్లో తొందరపాటు కూడదు. ప్రమాదావకాశాలుంటాయి. కొన్ని సమస్యలను శ్రమతో పరిష్కరించుకోవాలి. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలుంటాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. కార్యనిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. నిరాశగా ఉంటుంది. లాభాల విషయంలోనూ తొందరపాటు కూడదు. ప్రయోజనాలపై దృష్టి పెట్టకుండా పని చేయాలి. వారాంతంలో అన్ని శుభకార్యాలుంటాయి. అన్ని పనుల్లోనూ విజయం. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలత. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాదులకు అవకాశం. ఉన్నత లక్ష్యాలపై దృష్టి. వైజ్ఞానిక కార్యక్రమాలు ప్రభావితం చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రసంగాలు అలరిస్తాయి. మంచి వార్తలు వింటారు. కొంత శ్రమతో పనుల నిర్వహణ. భాగస్వామ్యాల్లో పూర్తి అనుకూలత. వారం మధ్యమంలో ఆహార విహారాల్లో సమస్యలు. విశ్రాంతి లోపం ఇబ్బంది పెడుతుంది. విద్యా వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రమతో ఫలితాలు సిద్ధిస్తాయి. నిరాశాజనకంగా ఉంటుంది. సౌకర్య లోపాలుంటాయి. పరిచయాలు స్నేహానుబంధాల్లో ఒత్తిడులకు అవకాశం. వారాంతంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. కొత్త పనుల రూపకల్పన.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో లాభాలపై ప్రత్యేక దృష్టి. ప్రయోజనాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల అనుకూలత, ఆశీస్సులు లభిస్తాయి. వ్యవహారాలన్నీ సంతోషాన్నిస్తాయి. ఆలోచనల్లో తొందరపాటు ఇబ్బంది పెడుతుంది. స్పందన తగ్గించుకోవాలి. ప్రమాదాలకు అవకాశం. సృజనాత్మకత లోపం. సంప్రదింపుల వల్ల మరిన్ని ప్రయోజనాలు పెరిగే అవకాశం. వారం మధ్యమంలో వ్యర్థమైన ఖర్చులుంటాయి. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. కార్యనిర్వహణలో ఇబ్బందులుంటాయి. ప్రయాణాదుల్లో లోపాలకు అవకాశం. విశ్రాంతి దొరకకపోవచ్చు. పరామర్శలకు అవకాశం. ధ్యాన సాధన బాగా పెంచుకోవాలి. దాన ధర్మాలవల్ల మాత్రమే మేలు కలుగుతుంది. వారాంతంలో ఆలోచనల్లో పూర్తి మార్పు. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. నూతన కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు స్వీకరిస్తారు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలు తప్పకపోవచ్చు. పనుల నిర్వహణలో శ్రమతో విజయం. పోటీలు ఒత్తిడులను అధిగమించాల్సి ఉంటుంది. రుణ రోగాదులను అధిగమించాలి. పెద్ద వారితో జాగ్రత్తగా మెలగాలి. భాగస్వామ్యాల్లో చికాకులు వచ్చే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. సామాజిక అనుబంధాల విషయంలో ఉన్నతి. వారం మధ్యమంలో పరిచయాలు స్నేహానుబంధాల్లో జాగ్రత్త. భాగస్వామ్య వ్యవహారాల్లో ఒత్తిడులుంటాయి. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తినిస్తాయి. అప్రమత్తంగా మెలగాలి. వృత్తిలో కొంత అనుకూలత. గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం. వారాంతంలో అన్ని పనుల్లోనూ సమస్యలు ఎదురుకావచ్చు. అనారోగ్య భావనలుంటాయి. కార్యనిర్వహణలో జాగ్రత్త.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ వ్యవహారాలపై దృష్టి. ఆర్థిక నిల్వల వల్ల సంతోషం. సంతృప్తి. మాట తీరులో గణనీయమైన మార్పు. గౌరవం పెంచుకుంటారు. బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. సేవక వర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాలి. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. పోటీ రంగంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యమంలో సంప్రదింపులు ఇబ్బంది పెట్టే అవకాశం. ప్రయాణాదుల్లో కొంత జాగ్రత్త పడాలి. ధార్మిక వ్యవహారాల వల్ల మాత్రమే మేలు కలుగుతుంది. పోటీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. వారాంతంలో సుఖంగా గడిపే ప్రయత్నం. విద్యా వ్యవహారాలపై దృష్టి. ప్రయాణాదుల్లో అనుకూలత. ఆహార సౌఖ్యం. సంతోషంగా గడుపుతారు. భాగస్వామితో కొంత జాగ్రత్తగా మెలగాలి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తిపరమైన గుర్తింపు లభిస్తుంది. అనేక బాధ్యతలు నిర్వహించక తప్పదు. సామాజిక గౌరవం పెంచుకుంటారు. పితృవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఆహార విహారాలపై దృష్టి ఉన్నా తొందరపాటు కూడదు. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ప్రయాణాదుల్లో ఒత్తిడులుంటాయి. వారం మధ్యమంలో లాభాలపై ప్రత్యేక దృష్టి. ప్రయోజన లోపాలు వేధిస్తాయి. ఆశించిన లాభాలు అందక సమస్యలకు గురి అవుతారు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. ఆలోచనల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. ప్రణాళికలు కొంతవరకు శ్రమతో ఫలిస్తాయి. సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. వారాంతంలో విశ్రాంతిగా గడుపుతారు. అన్ని పనుల్లోనూ అనుకూలత. ప్రయాణావకాశాలు. పెట్టుబడులున్నా సంతోషం ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకత. వ్యవహారాల్లో అనుకూలత. కొత్త పనులపై దృష్టి. సంతాన వ్యవహారాల్లో సంతోషం కలుగుతుంది. కార్యనిర్వహణలో సంతృప్తి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. గౌరవం పెంచుకునే ప్రయత్నం. అందరితో వ్యతిరేకతలు పెరిగే అవకాశం. వ్యాపారాదుల కోసం ప్రయాణాలు చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకునే ప్రయత్నం. ఉన్నత లక్ష్యాలపై దృష్టి. వారం మధ్యమంలో పోటీ రంగంలో ఇబ్బందులు. రుణాదులు సమస్యలకు గురి చేయవచ్చు. చికాకులను అధిగమించాలి. గుర్తింపు కోల్పోకుండా చూసుకోవాలి. కొంత నిరాశ. ధార్మిక ప్రయాణాదుల వల్ల మేలు కలుగుతుంది. వారాంతంలో భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాలు, స్నేహానుబంధాలు పెంచుకునే సూచనలు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదుల్లో అనుకూలత. బాధ్యతలు అధికమైనా సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. కార్యనిర్వహణ దక్షత. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. శ్రమాధిక్యం. అనేక కార్యక్రమాలలో పాల్గొనాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆలోచనలకు రూపకల్పన. అభీష్ట సిద్ధి. వ్యాపారపరమైన నూతన ప్రణాళికలుంటాయి. వారం మధ్యమంలో నిల్వధనం కోల్పోయే అవకాశం. మాట్లాడే ధోరణిలో జాగ్రత్త పడాలి. వౌనం సర్వశ్రేయం. తొందరపాటు స్పందనలు తగ్గించాలి. నిరాశాపూరితమైన భావనలను వదిలేయాలి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే ప్రయత్నం. వారాంతంలో సంప్రదింపులు సంతోషాన్నిస్తాయి. సహకార ప్రయోజనాలుంటాయి. దగ్గరి ప్రయాణాదులకు అవకాశం.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో ఉన్నతమైన ఆలోచనలు. కీర్తిప్రతిష్ఠలు పెంచుకునే దిశగా ప్రయత్నాలు. సమాజానికి మేలు దిశగా మనో పరిణామాలు. సుదూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక సాధనలు. వైజ్ఞానిక పరిశోధనలు, ఉన్నత విద్యలు ప్రభావితం చేస్తాయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. మాట విలువ పెంచుకుంటారు. చమత్కార ధోరణి. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో సమస్యలు. అధికారిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. సౌకర్య లోపాలుంటాయి. ఆహార విహారాల్లోనూ తొందరపాటు కూడదు. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. కార్యనిర్వహణలో శ్రమ అధికవౌతుంది. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. లాభాలు సంతృప్తినిస్తాయి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744