వారం వారం గోచారం

వారం వారం గోచారం (12-5-2019 నుంచి 18-5-2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. కొత్త ప్రణాళికలు ఫలిస్తాయి. సంతానవర్గంతో సంతోషంగా గడిపే అవకాశం. సృజనాత్మకత. అన్ని పనుల్లో ప్రయోజనాలు ఉంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలకు, ప్రయాణాలకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. విందులు విహారాల కోసం వెచ్చిస్తారు. బాధ్యతలను ఆనందంగా నిర్వర్తిస్తారు. వారం మధ్యమంలో పోటీలు ఒత్తిడులున్నా అధిగమిస్తారు. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాల్లో అనుకూలత. శ్రమ తప్పకపోవచ్చు. రుణాదులను అధిగమిస్తారు. శారీరక ఒత్తిడులుంటాయి. సౌకర్యాదులపై దృష్టి. సోదర వర్గ సహకారం లభిస్తుంది. సమాచార లోపాలు. వారాంతంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు పెంచుకునే అవకాశం. పాత మిత్రుల కలయిక.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. బాధ్యతలు అనేకం ఉంటాయి. కార్యనిర్వహణ దక్షత. వ్యవహార విజయం. శారీరక ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఆలోచనలు, సంతానం వల్ల కొంత నిరాశ ఏర్పడే అవకాశం. సుదూర ప్రయాణాదుల కోసం ప్రయత్నిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకుంటారు. పితృవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వారం మధ్యమంలో ఆర్థిక వ్యవహారాలు నిర్ణయాత్మక స్థితిని పోషిస్తాయి. కుటుంబంలో అనుకూలత. మాట తీరువల్ల అనేక ప్రయోజనాలు. ఖర్చులు పెట్టుబడులున్నా సంతోషంగా గడుపుతారు. లాభాలున్నా ఆశించిన సంతోషం కనిపించకపోవచ్చు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వారాంతంలో మంచి వార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తిప్రతిష్ఠలు పెంచుకునే ప్రయత్నం. దైవానుగ్రహం లభిస్తుంది. సుదూర ప్రయాణాల కోసం ప్రణాళికలు. విద్యారంగంలో ఉన్నతి. సంతోషంగా ప్రయాణాలు చేస్తారు. నిర్ణయాదులన్నీ ఫలించకపోవచ్చు. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో ఆనందంగా గడుపుతారు. కొత్త పనుల నిర్వహణ. క్రియేటివిటీ పెరుగుతుంది. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. వ్యాపార వ్యవహారాలకు అనుకూలత. సామాజిక గౌరవం పెంచుకుంటారు. శ్రమ ఉన్నా బాధ్యతల నిర్వహణలో సంతోషం. భాగస్వామితో కొంత జాగ్రత్త. అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. కొత్త కాంట్రాక్టు వ్యవహారాలకు అవకాశం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాదులపై దృష్టి. సౌకర్యాలు పెంచుకుంటారు. సౌఖ్యంగా గడుపుతారు. విందులు వినోదాలు ప్రభావితం చేస్తాయి. విద్యారంగంలో అనుకూలత. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. కొన్ని అనుకోని ఇబ్బందులు. కొన్ని విషయాల్లో నిరాశ. ఖర్చులు పెట్టుబడులు అధికం. విహారాలు, ప్రయాణాలకు అవకాశం. ప్రభుత్వ చెల్లింపుల విషయంలో ముందు జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. సంతాన వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు. క్రియేటివ్‌గా వ్యవహరిస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మానసికమైన ప్రశాంతత. లాభాలపై ప్రత్యేక దృష్టి. సంప్రదింపులకు అనుకూలం. మాటల్లో తొందరపాటు కూడదు. వారాంతంలో పోటీలలో విజయం సాధిస్తారు. వ్యతిరేకతలను అధిగమిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు తప్పకపోవచ్చు. పెట్టుబడులు వేరువేరు రూపాల్లో పెట్టాల్సి వస్తుంది. ప్రయాణాదులకు అవకాశం. విశ్రాంతి లోపం ఉంటుంది. వ్యవహారాల్లో అప్రమత్తం. పరామర్శలుంటాయి. సౌకర్య లోపాలు. ఆహార విహారాల్లో ఇబ్బందులు. అనుకోని సమస్యలు. మానసిక, శారీరక ఒత్తిడులుంటాయి. ప్రభుత్వ చెల్లింపులలోనూ ముందు జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అన్ని పనుల్లోనూ సంతోషం. సంతృప్తి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొత్త కార్యక్రమాలపై దృష్టి. నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. వ్యాపారాల్లో కొంత జాగ్రత్త. లాభాలపై మనసు కేంద్రీకరిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి ఉన్నా ఘర్షణాత్మక స్థితి తప్పకపోవచ్చు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో ఏవో ఇబ్బందులు అధికం. అధికారిక సమస్యలు కూడా ఉంటాయి. ప్రభుత్వ చెల్లింపులలోనూ ముందు జాగ్రత్త అవసరం. అనారోగ్య భావనలు. నిర్ణయాదుల్లో లోపాలు. వ్యర్థమైన ఖర్చులు, ప్రయాణాలు. ఆధ్యాత్మిక వ్యవహారాలకు, ప్రయాణాలకు అనుకూలం. సౌకర్యాదులు, సౌఖ్యంపై దృష్టి. ఆహార విహారాల్లో అనుకూలత ఉన్నా అప్రమత్తంగానే మెలగాలి. వారం మధ్యమంలో సమున్నతమైన భావనలుంటాయి. ఎన్నో కార్యక్రమాలను సులువుగా నిర్వహిస్తారు. దైవానుగ్రహం లభిస్తుంది. ప్రయాణాలకు అవకాశం. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకునే ప్రయత్నం. భాగస్వామ్యాల్లో అనుకూలత. వ్యతిరేకతలపై విజయం. వారాంతంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ప్రభావితం చేస్తాయి. పదోన్నతులకు అవకాశం. శ్రమ అధికం. గౌరవం పెంచుకుంటారు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. మంచి వార్తలు వింటారు. అధికారిక గుర్తింపు లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. అనేక రూపాల్లో ప్రయోజనాలు. ఇతరుల సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. భాగస్వామితో కొంత జాగ్రత్తగా మెలగాలి. నిరాశ చెందకూడదు. స్ర్తివర్గం వల్ల లాభాలు. పెద్దల ఆశీస్సులుంటాయి. వారం మధ్యమంలో విహారాలుంటాయి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. గృహ వాహనాదుల విషయంలో నూతన నిర్ణయాలుంటాయి. విద్యారంగంలోని వారికి అనుకూలత. శ్రమతో అనేక ప్రయోజనాలు. కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. మాటల్లో తొందరపాటుకు, దానివల్ల సమస్యలకు అవకాశం. జాగ్రత్త. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. సంతాన వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు. వ్యాపార వ్యవహారాలకు అనుకూలం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి. పెద్దల ఆశీస్సులు, అనుగ్రహం లభిస్తుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. ఆలోచనలు ఫలిస్తాయి. వేరు వేరు పనుల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తుంటారు. సహకారం ఆశించినంతగా లభించదు. కొంత నిరాశ. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. ప్రభుత్వ చెల్లింపుల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త పరిచయాలుంటాయి. వారం మధ్యమంలో వ్యాపార వ్యవహారాల కోసం పెట్టుబడులుంటాయి. విందులు వినోదాలకు అవకాశం. విహార యాత్రలు సంతోషాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాదులపై దృష్టి ఉంటుంది. సుదూర లక్ష్యాలున్నా అసంతృప్తి ఉంటుంది. వారాంతంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో పరిచయాలు పెంచుకుంటారు. భాగస్వామ్యాలన్నింటిలోనూ అనుకూలత. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణావకాశాలు. కొన్ని ఒత్తిడులు తప్పకపోవచ్చు. అధికారిక సంబంధమైన అంశాలను ఆలోచించాల్సి వస్తుంది. ఆశించిన లాభాలు అందకపోవచ్చు. కొంత నిరాశ ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలం. స్ర్తివర్గ సహకారం లభిస్తుంది. వారం మధ్యమంలో అనుకోని ఇబ్బందులుంటాయి. వ్యాపారాల్లో సహకారం లభించినా కొన్ని నష్టాలు తప్పవు. అప్రమత్తంగా మెలగాలి. దైవ కార్యక్రమాల వల్ల మాత్రమే మేలు. పోటీ రంగంలోనూ ఇబ్బందులు ఎదురౌతాయి. గుర్తింపు కోల్పోవచ్చు. ఆలోచనల్లో ఘర్షణ ఉంటుంది. వారాంతంలో ఉన్నత వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో మంచి నిర్ణయాలుంటాయి. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. మాటతీరు వల్ల అనేక సంతోషాలు పెరుగుతాయి. అనుకోని ఇబ్బందులున్నా అధిగమిస్తారు. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. కానీ అధికమైన శ్రమ, ఒత్తిడి ఉంటాయి. పోటీ రంగంలో కొంత జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి గుర్తింపునకు అవకాశం ఉంది. వారం మధ్యమంలో సంప్రదింపులుంటాయి. శుభవార్తా శ్రవణం. సోదరవర్గ సహకారం లభిస్తుంది. ప్రయాణాదులకు అవకాశం. నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతి లోపం. ఖర్చులు పెట్టుబడులు అత్యధికం అవుతాయి. వారాంతంలో గృహ వాహనాదులు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. శ్రమ ఉన్నా సౌఖ్యంగా గడిపేందుకు ప్రయత్నం. మాతృవర్గ బంధువుల ప్రభావాలుంటాయి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో వృత్తిలో ఉన్నతి. ఉద్యోగంలో పదోన్నతి. అధికారిక వ్యవహారాలు. గౌరవం పెంచుకునే ప్రయత్నం. సంతోషంగా గడుపుతారు. కార్యనిర్వహణ దక్షత. బాధ్యతలు అత్యధికం. కుటుంబ, ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త. మాటలో నైరాశ్యం. వ్యతిరేకతలపై విజయం. పోటీలు ఒత్తిడులున్నా అధిగమిస్తారు. అధికారులతో గడపవలసి ఉంటుంది. శ్రమతో వ్యవహారాలన్నింటిలోనూ విజయం సాధిస్తారు. వారం మధ్యమంలో ప్రయోజన దృష్టి. అన్ని పనుల్లోనూ లాభాలు ప్రభావితం చేస్తాయి. వ్యాపారాదుల్లో మరింత అనుకూలత. ఎప్పుడో చేసిన పనులకు ప్రస్తుతం ప్రయోజనం లభిస్తుంది. సంతానవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. సుదూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక భావనలు. కొన్ని అనుకోని నష్టాలు, ప్రమాదాలకు అవకాశం.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో పోటీ రంగంలో విజయం. గుర్తింపు కోసం ప్రయత్నం. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. పెద్దల సహకారం. రుణాలను అధిగమించే ప్రయత్నం. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు, బాధ్యతలు అత్యధికవౌతాయి. కుటుంబ, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. చమత్కార ధోరణి. వారం మధ్యమంలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారానుబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక నిల్వలను పెంచుకుంటారు. భాగస్వామితో సంతోషంగా గడిపే సమయం. ఆలోచనలకు రూపకల్పన. సౌకర్యాలపై దృష్టి ఉన్నా ఆశించిన సంతోషం ఉండదు. తొందరపాటు ఉంటుంది. వారాంతంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. అనుకోని సమస్యలు ఎదురుకావచ్చు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744