వారం వారం గోచారం

వారం వారం గోచారం (9-6-2019 నుంచి 15-6-2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో ప్లానింగ్ ఫలిస్తుంది. సంతానంతో సంతోషం. నూతన కార్యక్రమాలపై దృష్టి. క్రియేటివిటీ పెంచుకుంటారు. సంతోషంగా కార్యక్రమాల నిర్వహణ. కొత్త నిర్ణయాదులు తీసుకుంటారు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో అనుకూలత. కొంత అసంతృప్తి కూడా ఉంటుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాటల్లో అనుకూలత. చమత్కారం. వారం మధ్యమంలో వ్యతిరేకత ఇబ్బంది పెట్టే సూచనలు. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. సహకారం. సపోర్ట్ లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గుర్తింపు లభిస్తుంది. మాట తీరు కొంత మార్చుకోవాల్సి ఉంటుంది. సౌకర్యాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. సోదర వర్గం విషయంలో కొంత అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతల విస్తరణ. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. అధికారిక వ్యవహారాలపై దృష్టి. సామాజిక గౌరవం పెరుగుతుంది. శ్రమ తప్పకపోవచ్చు. ఆలోచనల్లో కొంత నిరాశ. కార్యనిర్వహణ దక్షత. వ్యవహారాల్లో విజయం. వారం మధ్యమంలో కుటుంబ వాతావరణంలో సంతోషం. బంధువర్గ వ్యవహారాల్లో పాల్గొనే అవకాశం. ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. నిల్వధనం పెంచుకుంటారు. మాటల్లో చమత్కార ధోరణి. అందరినీ ఆకట్టుకుంటారు. విశ్రాంతి లభిస్తుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. వారాంతంలో ఇతరులతో సంప్రదింపులుంటాయి. అనేక రకాలైన వార్తల వల్ల సంతృప్తి. మీడియా రంగంలోని వారికి అనుకూలత. సహకారం లభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. సుదూర ప్రయాణాలుంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో సుముఖత. దైవ, ధార్మిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. విద్యారంగంలో ఉన్నతి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. నిర్ణయాదుల్లో కొంత నిరాశ, వ్యతిరేకతలున్నా పోరాడి విజయం సాధిస్తారు. పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. శ్రమ అధికం. హార్మోన్ సమస్యలకు అవకాశం. స్ర్తి వర్గంతో జాగ్రత్త. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదులకు అనుకూలం. అధికారిక వ్యవహారాల్లో సంతృప్తి ఉంటుంది. భాగస్వామ్యాల్లోనే అతి జాగ్రత్తగా మెలగాలి. పరిచయాలు, వ్యాపార స్నేహానుబంధాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పొరపాట్లు దొర్లకుండా చూసుకోవాలి. అనౌచిత్యాలకు అవకాశం ఉంది. వారాంతంలో లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. సంతోషంగా గడుపుతారు. శ్రమ తప్పకపోవచ్చు. ప్రయాణాది సౌకర్యాల విషయంలో అనుకూలత. సౌఖ్యం కోసం ప్రయత్నం. శారీరకమైన వత్తిడి తప్పకపోవచ్చు. అనుకోని సమస్యలు. ఏదో ఒకటి పోగొట్టుకోవడం ఉంటుంది. దానధర్మాల వల్ల మేలు. కొన్ని నిర్ణయాలు సంతోషాన్నిస్తాయి. వారం మధ్యమంలో సంతానవర్గ వ్యవహారాలు చర్చలోకి వస్తాయి. అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. మాట తీరులో అనిశ్చితి ఉంటుంది. జాగ్రత్త అవసరం. నిర్ణయ శక్తి లోపిస్తుంది. వారాంతంలో వ్యతిరేకతలపై విజయం. పోటీ రంగంలో గుర్తింపు. శ్రమతో కార్యనిర్వహణ. రుణాలను తీర్చే ప్రయత్నం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు తప్పకపోవచ్చు. అనేక రూపాల్లో పెట్టుబడులుంటాయి. దూర ప్రయాణాదులకు అవకాశం. ప్రభుత్వపరమైన చెల్లింపులు ముందుగానే చెల్లించటం మంచిది. సౌకర్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం. ఉన్నత వ్యవహారాలు, కీర్తి ప్రతిష్టలపై దృష్టి. ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. విద్యారంగంలో ఉన్నతి ఉంటుంది. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. భాగస్వామితో సంతోషం. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులున్నా సంతోషం కలుగుతుంది. అధికారిక ప్రయోజనాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. సామాజిక గౌరవం పెంచుకునేందుకు కృషి చేస్తారు. వారాంతంల కుటుంబంలో, బంధుమిత్రులతో అనుకూలత.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలుంటాయి. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా అధికారిక అంశాల్లో అప్రమత్తంగా ఉండాలి. సంతాన సంబంధ వ్యవహారాల్లోనూ కొంత ఇబ్బందికి అవకాశం. విశ్రాంతి లోపం. అనారోగ్యాలకు అవకాశం ఉంటుంది. వారం మధ్యమంలో ఉన్నత కార్యక్రమాలు. బిజినెస్ వ్యవహారాల్లో అనుకూలత. వ్యతిరేక ప్రభావాలను అనుకూలంగా మలచుకుంటారు. పోటీ రంగంలో సమస్యలున్నా విజయసాధన. కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి. విద్యా పరిశోధన వ్యవహారాల్లో అనుకూలత. గౌరవం పెరుగుతుంది. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. వ్యాపారాల్లోనూ అనుకూలత. శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. అధికారిక వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఇతరుల సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ. పితృవర్గ వ్యవహారాల కోసం ఖర్చులుంటాయి. దగ్గరి ప్రయాణాలుంటాయి. సంప్రదింపులకు అనుకూలం. నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. పరిచయాలు ఇబ్బంది పెట్టే సూచనలు. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. విశ్రాంతి లోపాలకు అవకాశం. జాగ్రత్త. వారం మధ్యమంలో సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. విందులు వినోదాలుంటాయి. విద్యారంగంలోని వారికి అనుకూలత. మంచి ఫలితాలకు అవకాశం. కుటుంబ అనుబంధాలు మెరుగుపడతాయి. నిర్ణయాదుల్లో తొందరపాటు కూడదు. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. అన్ని పనుల్లోనూ క్రియేటివిటీ. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులకు అవకాశం. కొన్ని అనుకోని సమస్యలు కలిగే సూచనలు. సంప్రదింపుల్లోనూ జాగ్రత్త వహించాలి. కమ్యూనికేషన్స్ వల్ల కొంత నిరాశకు అవకాశం. స్ర్తి వర్గంతో అప్రమత్తంగా మెలగాలి. అధికారిక వ్యవహారాలు, ప్రభుత్వ చెల్లింపులు, పితృవర్గ వ్యవహారాలు, ఆరోగ్యాదుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో ఖర్చులు అధికం. వ్యాపారాల్లో పెట్టుబడులుంటాయి. దూర ప్రయాణాల కోసం వెచ్చిస్తారు. విహార యాత్రలకు, వ్యాపార యాత్రలకు అవకాశం. దానధర్మాల వల్ల మేలు. విశ్రాంతి లభిస్తుంది. సుఖపడే ప్రయత్నం. కీర్తి ప్రతిష్ఠల కోసం ప్రయత్నిస్తారు. వారాంతంలో అనేక రకాల బాధ్యతలుంటాయి. కార్యక్రమాల నిర్వహణలో ధైర్యం, దక్షత ఉంటుంది.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో పరిచయాలు విస్తరించే అవకాశం. అధికారిక అనుబంధాలు ప్రభావితం చేస్తాయి. పాతమిత్రులు గుర్తుకు వస్తారు. సౌకర్యాలు శ్రమకు గురి చేసే అవకాశం. కొన్ని లాభాలు చేజారే సూచనలు. ఆహార విహారాలపై దృష్టి. విందులు వినోదాల కోసం వెచ్చిస్తారు. శ్రమాధిక్యం. ప్రయాణాదుల్లో ముందు జాగ్రత్తల వల్ల ఇంకా మేలు కలుగుతుంది. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. వ్యాపార నష్టాలకు అవకాశం ఉంది. ముఖ్య నిర్ణయాదులు వాయిదా వేసుకోవడం శ్రేష్ఠం. సంతానవర్గ వ్యవహారాల్లో ఏదో తాపం వెంటాడుతుంది. మానసికమైన ఒత్తిడులు అధికవౌతాయి. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని అనుకోని సంఘటనలుంటాయి. వారాంతంలో ఉన్నత వ్యవహారాలు, కీర్తిప్రతిష్ఠలు విస్తరిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెంచుకుంటారు. ఆర్థిక నిల్వలపై ప్రత్యేక దృష్టి. బంధువర్గ వ్యవహారాల్లో పాల్గొంటారు. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టే సూచనలుంటాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. లాభాలు వేరువేరు రూపాల్లో అందుకునే అవకాశం. వారం మధ్యమంలో కమ్యూనికేషన్స్ వల్ల మేలు. కొత్త వార్తలు వినే అవకాశం. వ్యాపారాదుల్లో పెట్టుబడులు తప్పకపోవచ్చు. విశ్రాంతి కోసం ప్రయత్నం. దగ్గరి ప్రయాణాదులుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. కొనుగోలు, అమ్మకాలలో కొంత జాగ్రత్త అవసరం. వారాంతంలో విందులుంటాయి. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. సౌకర్యాలను పెంచుకునే సూచనలు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారిక వ్యవహారాలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. అన్ని పనుల్లోనూ చికాకు ఉంటుంది. అనుబంధాలు శ్రమకు గురి చేస్తాయి. పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మాటల్లోనూ నిరాశ ఉంటుంది. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. అనుకోని ఇబ్బందులుంటాయి. ప్రమాదాలకు అవకాశం. ఏ పనిలోనూ తొందరపాటు కూడదు. నిర్ణయాలలోనూ జాగ్రత్త అవసరం. పెద్దలతో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్స్ పెంచుకుంటారు. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. వారాంతంలో అనేక రూపాల్లో పెట్టుబడులుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో పోటీలు ఒత్తిడులు చికాకులకు అవకాశం. గుర్తింపు కోసం తాపత్రయం. అన్ని పనుల్లోనూ శ్రమ తప్పదు. కర్తవ్య నిర్వహణలో తలమునకలవుతారు. మొండితనం కూడదు. అధికారిక సంప్రదింపులుంటాయి. స్ర్తివర్గ సహకారం కూడా లభిస్తుంది. పితృవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ప్రయాణాదులకు అవకాశం. వారం మధ్యమంలో పరిచయాలు విస్తరిస్తాయి. ఆహార విహారాల విషయంలోనూ అప్రమత్తంగా మెలగాలి. విద్యారంగంలో శ్రమకు తగిన ఫలితాలు అందకపోవచ్చు. శ్రమ తప్పదు. భాగస్వామ్యాల్లో కొంత అనుకూలత. వ్యాపార భాగస్వామితో మంచి బిజినెస్ డీల్ ఏర్పడుతుంది. ప్రయాణాది సౌకర్యాలు శ్రమకు గురి చేయవచ్చు. వారాంతంలో అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744