వారం వారం గోచారం

వారం వారం గోచారం -- (26-8-2018 నుంచి 1-9-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆదివారం లాభాలపై దృష్టి. ప్రయోజనాలు కొంత వత్తిడులకు గురి చేయవచ్చు. వృత్తి ఉద్యోగ సంబంధ వ్యవహారాల్లో శ్రమ తప్పదు. శ్రమతో స్థాయిని పెంచుకుంటారు. గుర్తింపు. సోమవారం సౌకర్యాలు శ్రమకు గురిచేసే అవకాశం. ప్రయోజనాలున్నా సంతృప్తి తక్కువ. సౌఖ్యాలపై దృష్టి. మంగళవారం ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతి లభిస్తుంది. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. బుధవారం అసంతృప్తి. దూర ప్రయాణ భావన. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. కార్యాలలో ఆలస్యం. గురువారం ఆహార విహారాల కోసం కాలం ధనం వెచ్చించే అవకాశం. సంతోషంగా కాలం గడుపుతారు. ఖర్చులుంటాయి. శుక్రవారం నిర్ణయాదుల్లో కొంత నైరాశ్యం. ఆత్మవిశ్వాసం కొంత కోల్పోయే అవకాశం. సామాజిక గౌరవ లోపాలు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆదివారం వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. వ్యాపారాల్లో కొంత శ్రమ తప్పదు. సామాజిక గౌరవం పెరుగుతుంది. అసంతృప్తి అధికం. దూర ప్రయాణాదుల్లో జాగ్రత్త. సోమవారం సంప్రదింపుల్లో కొంత ఇబ్బంది. నూతన సమాచారం అందుతుంది. అధికార వ్యవహారాల్లో జాగ్రత్త. మంగళవారం వ్యతిరేకతలపై విజయం. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. లాభాలు అనుకూలంగా ఉంటాయి. సంతోషం. బుధవారం లాభాలు కోల్పోయే అవకాశం. అనుకోని సమస్యలు. కార్యాలలో ఆలస్యం, లోపాలు. అప్రమత్తంగా మెలగాలి. గురువారం సంప్రదింపుల్లో అనుకూలత. శుభ వర్తమానాలుంటాయి. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. ప్రయాణాలు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆదివారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. అనుకోని సమస్యలు. ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. తొందరపాటు కూడదు. దైవదర్శనం మంచిది. సోమవారం కుటుంబ ఆర్థికాంశాల్లో ఒత్తిడులుంటాయి. మాటల్లో ఇబ్బందులకు అవకాశం. దూర ప్రయాణాల్లో జాగ్రత్త. మంగళవారం అభీష్టాలు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అత్యున్నతి. పదోన్నతులకు అవకాశం. గౌరవం. బుధవారం భాగస్వామ్యాలలో జాగ్రత్త. సామాజిక గౌరవాదులు ఇబ్బంది పెట్టే అవకాశం. అధికారిక లోపాలు. శ్రమాధిక్యం. గురువారం మాటల్లో చమత్కారం. వ్యాపారాదుల్లో అత్యున్నతి. నూతన నిర్ణయాదులకు అవకాశం. శుక్రవారం లాభాలున్నా సంతృప్తి ఉండకపోవచ్చు. ఆశించిన ప్రయోజనాలు అందవు. అనుకోని సమస్యలు. నిరాశ.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆదివారం అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లో జాగ్రత్త. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాలి. భాగస్వామితో జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు కూడదు. సోమవారం నిర్ణయాదుల్లో ఇబ్బందులు. వేర్వేరు ప్రభావాలవల్ల ఇబ్బందులుంటాయి. దైవధ్యానం మేలు. మంగళవారం సౌకర్యాలు మెరుగుపరచుకుంటారు. సౌఖ్యంగా గడుపుతారు. ఆహార విహారాల్లో అనుకూలత. బుధవారం లక్ష్యాలను సాధించడంలో కొంత ఇబ్బంది. వ్యతిరేకతలుంటాయి. విజయంపై దృష్టి. అసంతృప్తి అధికం. గురువారం నిర్ణయాదుల్లో అనుకూలత. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. దూర ప్రయాణావకాశాలు. మంచి వ్యాపారం. శుక్రవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాలు. కొన్ని పరిచయాలవల్ల సమస్యలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆదివారం పరిచయాలు అనుబంధాలు విస్తరిస్తాయి. వ్యతిరేక ప్రభావాలను జాగ్రత్తగా అధిగమించాలి. స్నేహానుబంధాలు, భాగస్వామ్యాల కోసం శ్రమించక తప్పదు. శ్రమాధిక్యం. సోమవారం కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. పరామర్శలకు అవకాశం. అన్ని పనుల్లో అప్రమత్తం. వాయిదా మంచిది. మంగళవారం అనుకోని చికాకులు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. ఇతరుల సహకారం లభిస్తుంది. బుధవారం ఆలోచనల్లో ఒత్తిడులు. ఆందోళన తగ్గించుకోవాలి. పనుల్లో ఆలస్యం. సంతానంతో సమస్యలు. గురువారం వ్యాపారాదుల్లో పెట్టుబడులుంటాయి. కాలం ధనం వృథా కాకుండా ప్రయత్నించాలి. అప్రమత్తంగా మెలగాలి. శుక్రవారం లక్ష్యాలను సాధించడంలో కొంత శ్రమ. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆదివారం పోటీలు ఒత్తిడులు వ్యతిరేక ప్రభావాలు తప్పకపోవచ్చు. గుర్తింపు లభిస్తుంది. తొందరపాటు కూడదు. ఆందోళన తగ్గించుకోవాలి. నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. సోమవారం శ్రమలేని లాభాల కోసం ఆలోచనలు. ప్రయోజనాలు ఇబ్బందులకు గురి చేయవచ్చు. రుణం పెరుగుతుంది. మంగళవారం భాగస్వామ్యాల్లో అనుకూలత. కుటుంబంలో సంతోషం. మాటల్లో శుభ పరిణామాలు. బుధవారం సౌకర్య లోపాలుంటాయి. ఆహార విహారాల్లో ఇబ్బందులకు అవకాశం. భాగస్వామ్యాల్లో సమస్యలు. శ్రమ. గురువారం వ్యాపార లాభాలు అధికం. అనుకూలత ఉంటుంది. స్నేహానుబంధాలు విస్తరించే అవకాశం. శుక్రవారం అన్ని పనుల్లో జాగ్రత్త. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. ఆందోళన అధికం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆదివారం మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సౌకర్య లోపాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాలపై అధిక ఆసక్తి. కొంత జాగ్రత్త అవసరం. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులున్నా కార్యనిర్వహణ ఉంటుంది. బాధ్యతలు అధికం. శ్రమతో గుర్తింపు. మంగళవారం పోటీలు ఒత్తిడులు వ్యతిరేకతలు అధికం. నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. విజయ సాధన. నూతన కార్యాలు. బుధవారం సేవకవర్గ సహకారం లభిస్తుంది. సోదరులతో జాగ్రత్త అవసరం. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టవచ్చు. గురువారం అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. విజయ సాధనపై దృష్టి. పోటీ రంగం లాభించే అవకాశం. శుక్రవారం భాగస్వామ్యాలు ఇబ్బంది పెట్టవచ్చు. పరిచయాలు స్నేహానుబంధాల్లో జాగ్రత్త వహించాలి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదివారం సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపాటు కూడదు. గృహ వాహనాది వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలుండాలి. సోమవారం దూర ప్రయాణాలు. ఉన్నత విద్యలపై దృష్టి. శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. ఊహలు అధికవౌతాయి. మంగళవారం ధార్మికమైన కార్యక్రమాల కోసం వెచ్చిస్తారు. దానధర్మాల వల్ల మేలు. సంతానవర్గ అభివృద్ధి. బుధవారం సంప్రదింపుల్లో జాగ్రత్త. సహకార లోపాలకు అవకాశం. అభీష్టాలు నెరవేరుతాయి. ప్రయాణాదుల్లో సమస్యలు. గురువారం వ్యాపారాదుల్లో అనుకూలత. విద్యా వ్యవహారాల్లో మంచి నిర్ణయాలుంటాయి. దూర ప్రయాణాలు. శుక్రవారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. విజయం వరించినా కొంత జాగ్రత్త అవసరం. సమాచార లోపం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదివారం సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మాటల్లో తొందరపాటు కూడదు. కుటుంబంలో ఒత్తిడులుంటాయి. సోమవారం అనుకోని సమస్యలుంటాయి. ఒక వార్త ఇబ్బంది పెట్టవచ్చు. ఆందోళన తగ్గించుకోవాలి. సహకారం అందించే ప్రయత్నం. మంగళవారం ఆహార విహారాల్లో అనుకూలత. గృహాదుల్లో సంతోషం. పెద్దల ఆశీస్సులు. గౌరవం. బుధవారం అన్ని పనుల్లో ఆలస్యం. ఆహార విహారాలపై దృష్టి ఉన్నా ఆశించిన ప్రయోజనాలుండవు. నిర్ణయాల్లో జాగ్రత్త. గురువారం వ్యాపారాదుల్లో లోపాలకు అవకాశం. భాగస్వామ్యాలు, సామాజిక గౌరవాలు తగ్గే సూచనలు. సౌకర్య లోపాలు. శుక్రవారం ఆలోచనల్లో ఒత్తిడులు. కొంత నైరాశ్యం. సంతాన వర్గ వ్యవహారాలపై దృష్టి. దైవదర్శనం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆదివారం కుటుంబ, ఆర్థికాంశాల్లో అనుకూలత. తొందరపాటు కూడదు. ప్రమాదాలకు అవకాశం. అప్రమత్తంగా మెలగాలి. మాటల్లో చికాకులుంటాయి. సోమవారం పరిచయాలు భాగస్వామ్యాల వల్ల ఆర్థిక నిల్వలపై ప్రభావం. కాలం ధనం వ్యర్థంగా కోల్పోవచ్చు. మంగళవారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. గౌరవం లభిస్తుంది. అధికారిక వ్యవహారాలుంటాయి. సంప్రదింపులకు అనుకూలం. బుధవారం పరామర్శలకు అవకాశం. వ్యర్థంగా కాలం ధనం కోల్పోవచ్చు. ప్రయాణాదులుంటాయి. గురువారం వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. భాగస్వామ్యాల్లో అనుకూలత. ఇతరుల సహకారం లభిస్తుంది. కొత్త కార్యక్రమాలు. శుక్రవారం అన్ని పనుల్లో కొంత నైరాశ్యం. ఆశించిన సౌఖ్యం అందకపోవచ్చు. ఆహార విహార లోపాలుంటాయి.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆదివారం శారీరక ఒత్తిడులుంటాయి. బాధ్యతలు అధికం. కార్యనిర్వహణలో అలసట ఉంటుంది. ఖర్చులు పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. సోమవారం వ్యతిరేక ప్రభావాలు ఇబ్బంది పెట్టే అవకాశం. గుర్తింపు లభిస్తుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం అత్యున్నత లక్ష్యాలపై దృష్టి. ఆధ్యాత్మిక వ్యవహారాలుంటాయి. పరిశోధనల వల్ల ఆర్థిక లాభాలు. బుధవారం లాభాలు ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. అన్ని పనుల్లో ఆలస్యం. శ్రమలేని ప్రయోజనాలపై దృష్టి. గురువారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. అనుకోని సంఘటనలు. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త అవసరం. శుక్రవారం సంప్రదింపుల్లో జాగ్రత్త. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. వార్తల్లో లోపాలకు అవకాశం. శనివారం కమ్యూనికేషన్స్‌లో అనుకూలత.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదివారం విందులు విహారాలు విలాసాల కోసం ఖర్చులు చేసే అవకాశం. లాభాలున్నా ఆశించిన సంతోషం ఉండకపోవచ్చు. ప్రయాణాల్లో అనుకూలత. సోమవారం కొన్ని అపోహలకు అవకాశం. మానసిక వత్తిడి. ఖర్చులు శ్రమకు గురి చేస్తాయి. సంతానవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. మంగళవారం నిర్ణయాదులకు అనుకూలం. గౌరవ లోపాలుంటాయి. శ్రమాధిక్యం. వ్యవహారాల్లో జాగ్రత్త. బుధవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణలకు అవకాశం. బాధ్యతల నిర్వహణలో ఆలస్యం. అధికారులతో జాగ్రత్త అవసరం. గురువారం ఆలోచనలకు రూపకల్పన. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కార్యనిర్వహణపై దృష్టి. శుక్రవారం కుటుంబ, ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లాభాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ