వారం వారం గోచారం
వారం వారం గోచారం (26.1.2020 నుంచి 1.2.2020 వరకు)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఫలిస్తాయి. కొన్ని అనుకోని సమస్యలకు, నిర్ణయ లోపాలకు అవకాశం ఉంటుంది. సంప్రదింపులుంటాయి. ఇతరులకు సహకరించడం మంచిది. సోదర వర్గంతో జాగ్రత్తగా మెలగాలి. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మంచి వార్తలు వింటారు. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక యాత్రలకు అనుకూలం. వారం మధ్యమంలో ఖర్చులు, పెట్టుబడులు అధికవౌతాయి. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాలు ప్రయోజనకరవౌతాయి. వృత్తి ఉద్యోగాదులకు సంబంధించిన పెట్టుబడులుంటాయి. అధికారికమైన పనుల్లో శ్రమ తప్పకపోవచ్చు. పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నం. వ్యాపార సంబంధమైన సంప్రదింపులకు అవకాశం.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. భాగస్వామ్యాల్లో శ్రమ ఉంటుంది. ఖర్చులు, ప్రయాణాలుంటాయి. కుటుంబ, ఆర్థికాంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపడి మాట్లాడకూడదు. గౌరవ లోపాలకు అవకాశం. అప్రమత్తంగా ఉండాలి. ప్రయోజనాలు కోల్పోకుండా చూసుకోవాలి. వారం మధ్యమంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి ఉన్నా ఏదో ఒక ప్రయోజనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వృత్తిలోనూ శ్రమాధిక్యం. కీర్తి ప్రతిష్టలపై దృష్టి ఉంటుంది. బ్యాంకు వ్యవహారాల కోసం తిరిగే అవకాశం. సామాజిక హోదా కోసం ప్రయత్నం. బంధు వర్గంతో అనుకూలత. సంతాన సంబంధమైన సంతృప్తి. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులపై దృష్టి పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. సుదూర ప్రయాణ భావనలుంటాయి. విజ్ఞాన, వినోద, విహార యాత్రలపై దృష్టి. కాంట్రాక్టు వ్యవహారాలు లాభిస్తాయి. వ్యతిరేకతలపై విజయం. పోటీల్లో గుర్తింపునకు అవకాశం. ప్రయోజన దృష్టి. నిర్ణయాదుల్లో అప్రమత్తంగా మెలగాలి. ఆత్మవిశ్వాసం, అతివిశ్వాసంగా మారకూడదు. దురాశ ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. వారం మధ్యమంలో పనిచేసే ప్రదేశంలో గుర్తింపు కోసం ప్రయత్నం. అధికారిక వ్యవహారాలపై దృష్టి. సామాజిక గౌరవం పెంచుకుంటారు. కొన్ని అనుకోని సమస్యలు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు కలుగుతుంది. వ్యాపార వ్యవహార నిర్ణయాల్లో అతి జాగ్రత్త అవసరం.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. నిర్ణయాదులు వాయిదా వేసుకుంటే మంచిది. సంతాన సంబంధమైన ఒత్తిడులుంటాయి. వృత్తిలోనూ సమస్యలు. కాలం ధనం వ్యర్థమయ్యే అవకాశం. తొందరపాటు కూడదు. విశ్రాంతి లోపం. అనారోగ్య భావనలు. పోటీ రంగంలో గుర్తింపు ఉన్నా శ్రమ తప్పదు. సుదూర ప్రయాణ భావనలు వాయిదా పడే అవకాశం. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ అనుకూలత. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి. ఊహించని ప్రయోజనాలుంటాయి. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. సంప్రదింపులుంటాయి. భాగస్వామి సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. సౌకర్య లోపాలుంటాయి. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపాటు ఉంటుంది. వేరు వేరు రూపాల్లో లాభాలను ఆశిస్తారు. శ్రమ రహిత ప్రయోజనాల వైపు దృష్టి సారించవద్దు. దురాశ పెరిగే సమయం. సంతానవర్గ విషయంలో శుభ పరిణామాలు. క్రియేటివిటీ పెరుగుతుంది. కొన్ని అనూహ్య సంఘటనలుంటాయి. వారం మధ్యమంలో వ్యతిరేకతలు పెరుగుతాయి. అనుకోని ఇబ్బందులు, అనారోగ్య భావనలు. నిర్ణయాదులు వాయిదా వేసుకోవాలి. భాగస్వామ్యాల్లోనూ జాగ్రత్త అవసరం. వ్యాపార వ్యవహారాల్లోనూ తొందరపాటు కూడదు. లాభాలు కోల్పోవచ్చు. మాట విలువ తగ్గవచ్చు. వారాంతంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రమ తప్పకపోవచ్చు. పోటీ రంగంలో అనుకూలత. కాంట్రాక్టు వ్యవహారాల్లోనూ సంతృప్తి. సంప్రదింపుల్లో ఒత్తిడులుంటాయి. అనుకోని ఇబ్బందులకు కూడా అవకాశం. జాగ్రత్త. వృత్తి ఉద్యోగాదుల్లో అనేక బాధ్యతలు మోయాల్సి రావచ్చు. బాధ్యతలు చికాకు పెట్టవచ్చు. అధికారులతో జాగ్రత్త. సామాజిక గౌరవం తగ్గుతుంది. సౌకర్యాలు పెంచుకుంటారు. భాగస్వామితో అనుకూలంగా ఉన్నా కొంత ఒత్తిడి తప్పదు. వారం మధ్యమంలో పరిచయాలు విస్తరిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. రుణ రోగాదులపై విజయం సాధిస్తారు. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. క్రియేటివిటీ పెరుగుతుంది. నిర్ణయాదుల్లో అనుకూలత. వారాంతంలో అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో సంతోషం. క్రియేటివిటీ పెరుగుతుంది. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. మాటల్లో తొందరపాటు, అధికారిక ధోరణి కూడదు. భాగస్వామ్యాల్లో అనుకూలత. సుదూర ప్రయాణ లక్ష్యాలు నెరవేరుతాయి. సాంకేతిక, వైజ్ఞానిక విద్యలకు అనుకూలం. పెద్దలతో సంప్రదింపులుంటాయి. సోదరులతో సుహృద్భావం. అందరి సహకారం అందుతుంది. వారం మధ్యమంలో పోటీలు, ఒత్తిడులుంటాయి. గుర్తింపు కోసం ప్రయత్నం. వ్యతిరేకతలున్నా విజయ సాధన. ఆహార విహారాల్లో జాగ్రత్త. ఆలోచనలు శ్రమకు గురి చేస్తాయి. ప్రణాళికా లోపాలుంటాయి. ఖర్చులు పెట్టుబడులు అధికం. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులుంటాయి. వారాంతంలో భాగస్వామ్యాలపై దృష్టి.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. శ్రమాధిక్యం. నిర్ణయాదుల్లో తొందరపాటు కూడదు. ఆత్మవిశ్వాసం అతివిశ్వాసంగా మారకూడదు. వ్యతిరేకతలుంటాయి. కొన్ని అనుకోని సమస్యలుంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. నష్టాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. ఆలోచనలకు రూపకల్పన. వారం మధ్యమంలో సంతాన వ్యవహారాల్లో సంతృప్తి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. గృహ వాహనాదుల వైపు దృష్టి కేంద్రీకరిస్తారు. విద్యారంగంలోని వారికి అనుకూలత. వ్యాపార పరమైన సహకారం లభిస్తుంది. లాభాలుంటాయి. అనుకోని ప్రయోజనాలు. వారాంతంలో పోటీలు, ఒత్తిడులు తప్పకపోవచ్చు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. సంతానవర్గం కోసం పెట్టుబడులు. భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. తొందరపాటు కూడదు. నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. వారం మధ్యమంలో గృహ వాహనాదులపై దృష్టి. విద్యా రంగంలోని వారికి అనుకూలత. కుటుంబంలో ఒత్తిడులు అధిగమించాలి. సేవకవర్గ సహకారం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మాటల్లో చమత్కార ధోరణి. ఆర్థిక నిర్ణయాలు ఫలిస్తాయి. బ్యాంక్ వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది. వారాంతంలో మానసిక ఒత్తిడులుంటాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో శుభ పరిణామాలు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత. మాటల్లో చమత్కార ధోరణి. బంధువర్గంతో అనుకూలత. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. వ్యతిరేక ప్రభావాలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. శ్రమ ఉన్నా కార్యక్రమాల నిర్వహణ. ధార్మికమైన ఖర్చులుంటాయి. సోదర వర్గం కోసం కాలం ధనం వెచ్చించే అవకాశం. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం మధ్యమంలో సంప్రదింపులకు అవకాశం. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. నిర్ణయాల్లో కొంత ఆలస్యం, బద్ధకాలకు అవకాశం ఉంటుంది. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతంలో సౌకర్యాదులపై దృష్టి. ఆహార విహారాల్లో జాగ్రత్త.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో, ఆనందంగా గడుపుతారు. అనేక బాధ్యతలను నిర్వర్తిస్తారు. గుర్తింపు, గౌరవాదులు లభిస్తాయి. వృత్తిలో ఒత్తిడులు తప్పకపోవచ్చు. అధికారులతో జాగ్రత్త. ఆలోచనలు పరిపరి విధాల వెళ్తుంటాయి. ధ్యానమార్గం వల్ల స్పష్టత వస్తుంది. సంతాన వర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి అవసరం. అనేక రూపాల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వారం మధ్యమంలో ఆర్థిక నిర్ణయాలకు అనుకూలం. బ్యాంకు వ్యవహారాలు పూర్తి చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. కుటుంబం, బంధువర్గ వ్యవహారాల్లో ఒక సంతృప్తి. ఖర్చులు చేయాల్సి వస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు అనుకూలం. వారాంతంలో సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. ఇతరుల సహకారం కోసం ప్రయత్నిస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ఖర్చులుంటాయి. విశ్రాంతి లభిస్తుంది. వినోద, విహార యాత్రలకు అవకాశం. సౌఖ్యంగా, సంతోషంగా గడుపుతారు. ఉన్నత లక్ష్యాల నిర్వహణలో కొన్ని ఒత్తిడులు పొందే అవకాశం. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల కోసం వెచ్చించాలి. గృహ వాహనాదుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. సామాజిక గౌరవం పెరుగుతుంది. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. పితృవర్గ వ్యవహారాల్లో అనుకూలత. అనేక రూపాల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తారు. వ్యాపారాదుల్లో సంతృప్తి. పెట్టుబడులు లాభిస్తాయి. కొత్త పనులపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వారాంతంలో ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.