తెలంగాణ

అడుగడుగునా అప్రజాస్వామ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెసిఆర్ సర్కారుపై విరసం నేత వరవరరావు ధ్వజం

జనగామ , మార్చి 13: తెలంగాణలో అప్రజాస్వామిక విధానం రాజ్యమేలుతోందని విప్లవ రచయతల సంఘం (విరసం) నేత వరవరరావు విమర్శించారు. డిటిఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ జిల్లా జనగామలో జిల్లా స్థాయి విద్యాసదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వరవరరావు, నాగ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షోమాసేన్, హెచ్‌సియు ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ ఉపన్యసించారు. ‘తెలంగాణ-ప్రజాస్వామ్యం’ అనే అంశంపై వరవరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో రోజు రోజుకూ రాజ్యహింస పెరిగిపోతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నామని పాలకులు పదేపదే చెబుతున్నప్పటికీ వారు అప్రజాస్వామిక మార్గానే్న అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటే గ్రామ రాజ్యాలు ఆవిర్భవించాలని స్పష్టం చేశారు. మావోయిస్టుల ఏజెండానే తమ ఏజెండా అంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కెసిఆర్ బూటకపు ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులను ఎందుకు హత్య చేస్తున్నాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మా భూములు మాకు కావాలని పోరాడుతున్న ఆదివాసులను మావోయిస్టులుగా, హక్కుల కోసం పోరాడుతున్న ముస్లింలను టెర్రరిస్టులుగా ముద్రవేస్తూ కెసిఆర్ రాచరిక పాలన సాగిస్తున్నాడని నిప్పులు చెరిగారు.
‘మహిళలు-సమానత్వం’ అనే అంశంపై ప్రొఫెసర్ షోమాసేన్ మాట్లాడుతూ, సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు సమానత్వం కనుమరుగైందని, అందుకు పాలకుల విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. అనంతరం ‘విద్యారంగం-లౌకికత్వం’ అనే అంశంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, విద్యారంగంలో హిందూభావజాలాన్ని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు కుట్ర పన్నుతోందని, అంబేద్కర్, వామపక్ష భావజాలం గల విద్యార్థి సంఘాల నాయకులను జైళ్లపాలు చేస్తోందని విమర్శించారు.