అక్షరాలోచన

అపరిచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీకట్లో ఆకాశం
చుక్క చామంతులు పూసిన తోటవుతుంది
రాత్రంతా
వెనె్నల వనమాలి గస్తీ తిరుగుతూ వుండగా
కొబ్బరాకొకటి
సిరాబుడ్డీలో నానుతున్న పక్షి ఈకలా
గాలి వాక్యాలు పైకెగదోస్తున్నట్టు
అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది
నైటు డ్యూటీ లోయ తలుపులు తెరచి చూస్తానా!
దృశ్యం మారిపోతుంది.

ఎర్రచొక్కా తొడుక్కున్న రౌతు ఒకడు
తెల్లమబ్బు గుర్రాల్ని పడమటి యేటి నీళ్లకొదుల్తాడు
చెట్ల శిఖల్ని ఊపుతూ
నింగి కెగరిన కొంగల గుంపులా
అలా అలా కాలం కవిత్వంలా కదిలిపోయే
ఒకానొక సమయాన
ఉరుముల అడుగులేసుకుంటూ నడిచొచ్చిన నీలిమేఘం
వొళ్లంతా నీరుగారుతున్న నీళ్లబిందయ్యి
నేలపై వానరాగం వొలికి పడుతుంది
రంగస్థలంపై నాటకం ముగిసిందని
ఇంద్రచాపం తెరదించుతుంది.

చీకటి గొంగళి కప్పుకుని
విధుల వీధుల్లో కెక్కిన ఆకాశంలా
రాత్రి కొలువు గంతలు కట్టుకుంటాను.
వేకువ ఎర్రబస్సెక్కొచ్చిన నువ్వేమో
ఆఫీసు చెరసాలల పగటి బందీ అవుతావు.
మిత్రమా
నాకు రాత్రి...
నీకు పగలు.. అపరిచితమేగా!
*************

సం‘చలనం’ కోసమే..!
-నామాల రవీంద్రసూరి
9848 321079
చూసేవాళ్లకు
నాలుగు కాళ్ల కుర్చీలో
రెండు కాళ్లు నేలకేసి
గంటల తరబడి కూర్చున్నచోటే
ఉన్నట్టు కన్పిస్తూంటాను... నేను
... ...
కానీ
నేను తిరిగేది ఎక్కడో వెతికేది ఏంటో...
ఎవరికి కన్పించదు.
... ...
గాలిలో పరిగెడతాను
వానతో పాటు తడుస్తాను
రాత్రిపూట మొలిచే చంద్రుణ్ని
పలకరించీ.. పలవరించి
స్పేస్‌లో సాంతం స్పేస్ వదలకుండా
తిరుగుతానన్న సంగతి
మడత కుర్చీలో కూర్చున్న నాకు తప్ప
మరెవరికీ తెలియదు.
... ...
గింజ గిలగిలలాడుతూ
మొలకెత్తే ఆనందాన్ని
దగ్గరకెళ్లి చూస్తాను
చెట్టు ఉన్నచోటే ఉంటుందంటే
కదిలించడం కోసం కథనం చేస్తున్నట్టు
ఆకాశం భూమి సముద్రం
అక్కడే కూర్చుంటాయి నాలాగా
కూర్చుని ఉండడమంటే
చలనం ఆగినట్టా?
సం‘చలనం’ కోసమే! *
*************
తర‘గతి’ గది
-నాశబోయిన నరసింహ
9542236764

అప్పుడప్పుడు
విద్యాసుమ వనంలో
పసిమొగ్గల బాల్యం
భయం గుప్పిట్లో!

అక్షర నీరాజనం
అందుకునే ప్రాంగణం
చదువులమ్మ ఒడి
సంస్కారం
చిగురించే మడి
సంరక్షక గురుతర
బాధ్యత బందీగా!

అక్కడక్కడ...
గోముఖ వ్యాఘ్ర
కీచక ప్రవర్తనంతో
విద్యా విలువలు
సజీవ దహనమైతే
తర‘గతి’ గది
అధో గతీ!

విద్య ఓ తపస్సు
తమస్సును ఛేదించే శస్త్రం
విద్యార్థినీ
సృజనశీలిని
విజ్ఞాన గ్రాహిణీ, వివేకవర్థినీ
విద్యార్జన ఓ తపన
శాస్త్ర శోధనా పరిమళం

చదువుకు(కొ)నే పరంపరలో
మాయా వృక్ష క్రీనీడన
అటుఇటు ఎదగని
తళుకుబెళుకు రాళ్లతో
తస్మాత్ జాగ్రత్త!
ఎప్పుడైనా ఎక్కడైనా
ఆత్మరక్షణ దిశగా
యుద్ధ నైపుణ్య విద్యతో
ఓ బాలికా.. కావాలి అపరకాళిక

-జి.రామకృష్ణ 8977412795