అమృత వర్షిణి

విజయం సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో అద్భుతాలు సాధించాలంటే ‘టైమ్ మేనేజ్‌మెంట్’ నైపుణ్యం ఎంతో అవసరం. మీరు ఎంచుకున్న రంగంలో మీ గమ్యాన్ని చేరుకునేందుకు సహకరించే ఉత్పత్తి చర్యలను అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. టైమ్ అంటే టైమే. సమయాన్ని ఎవ్వరూ ఆపలేరు. లేదా సమయాన్ని కూడా పెంచలేరు. ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా చాకచక్యంగా సద్వినియోగం చేసుకోవాలి.
మనిషికి ఎదురయ్యే సవాల్ టైమ్ మేనేజ్‌మెంట్‌కన్నా తనను తాను మేనేజ్ చేసుకోవడమే. ఎందుకు పని చేయలేకపోతున్నారో కారణాలు, క్షమాపణలు చెప్పుకున్నంత సేపు మీరు ఏ పని జయప్రదంగా పూర్తి చేయలేరు.
పని ఎందుకు పూర్తి చేయలేక పోతున్నారో అసలు కారణాన్ని నిజాయితీగా గుర్తించగల్గడమే మీరు చేయాల్సినది. ఎంత చిన్న భవనమయినా సరే ఒక్కరోజులో ఎవ్వరూ నిర్మించలేరు. ఎంత గొప్ప వారయినా, ఉన్నత ఉద్యోగులయినా ఒక్కొక్క పని చేసుకుంటూ విజయాలు సాధించినవారే.
ఇచ్చిన సమయంలో లేదా అనుకున్న సమయంలో మీరు చేయాల్సిన పని పూర్తి చేసేందుకు ఆ సమయాన్ని ప్రణాళికాబద్ధంగా, సృజనాత్మకంగా నిర్వహణ బాధ్యతను స్వీకరించి తగిన విధంగా కార్యాచరణలో పెట్టగల్గాలి.
ఇలా సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకుని సద్వినియోగం చేయడానికి మీరు అభివృద్ధి పరచుకోవలసిన పది లక్షణాలు తెలుసుకుందాం.
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత
స్పీడ్‌గా గమ్యాన్ని చేరుకునేందుకు సహకరించేది మీ జ్ఞాపకశక్తి. దానిని బాగా అభివృద్ది పరచుకోవాలి. ప్రపంచమంతా దానికి ఎంతో విలువ ఇస్తుంది. జ్ఞాపకశక్తి బాగా వున్నవారు త్వరత్వరగా గుర్తింపు పొందుతారు. ఇది అభివృద్ధి చెందే మార్గాలకు అవసరమైతే కొంత శిక్షణ పొందడం మంచిది.
ఏకాగ్రత అంటే ఏ పనికి మీరు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారో ఆ పని పూర్తయ్యేందుకు మీలోని సర్వశక్తులను అటు మళ్లించుకోగల్గడం. ప్రతి వ్యక్తికి ఈ సామర్థ్యం ఉంటుంది. ఎవరికి వారే తమ అవసరాలను తీర్చుకునేందుకు దీనిని వినియోగించుకుంటూనే ఉంటారు.
పరీక్షల్లో ర్యాంకు సాధించే విద్యార్థి చదువు మీదనే దృష్టి సారించి తన సర్వశక్తులు అటు మళ్లించుకో గల్గుతాడు. నటన అంటే ప్రాధాన్యమిచ్చేవారు ఆ రంగం వైపు ఏకాగ్రతను ఏర్పరచుకుని పరీక్షల్లో అపజయం పాలవుతూ ఉండవచ్చు.
అందుకే - గమ్యంవైపు దృష్టిని కేంద్రీకరించి మీలోని శక్తులన్నింటిని రాత్రి పగలు లక్ష్యసాధనకు వినియోగిస్తే వేగంగా గమ్యాన్ని చేరుకోగల్గుతారు. ఏకాగ్రత అనేది మీలోనే ఉంటుంది. బయట నుండి మీకు రవాణా కాదు.
ఆత్మవిశ్వాసం, నిశ్చయం
ఆత్మవిశ్వాసం అనేది మనిషిలో అనుకూల దృక్పథాన్ని కలుగజేస్తుంది. ఆత్మవిశ్వాసం గలవారు పరిస్థితులను యధార్థ కోణంలో చూడగల్గుతారు. తమ సామర్థ్యం మీద తమకు నమ్మకం కల్గి ఉంటారు ఆత్మవిశ్వాసంగల వ్యక్తులు. ఒక్కొక్కప్పుడు ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా వారు అనుకున్నది సాధించలేక పోవచ్చు. అయినప్పటికీ వారి అనుకూల దృక్పథంలో మార్పు ఉండదు. మరొక ప్రయత్నం వైపు దృష్టిని సారిస్తారు.
కొన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లినా అన్ని రంగాల్లోనూ అదే ఆత్మవిశ్వాసంతో ఉండకపోవచ్చు. అయినా ఫరవాలేదు. వృత్తిపరమైన రంగాల్లో ఆత్మవిశ్వాసం మనిషికి ఎంతో అవసరం.
చిన్నపిల్లవాడు తనకు కావలసినది నిశ్చయముతో సాధించుకో గల్గుతాడు. ఏడుస్తాడు. వెంటనే వాడికి కావలసినది పెద్దలు సమకూరుస్తారు. పెద్దయిన తరువాత ఈ టెక్నిక్ పనిచేయదు. కావలసిన దానికోసం ఏడిస్తే ఎవ్వరూ పట్టించుకోరు. ఈ వయసులో దృఢ నిశ్చయంతో సాధన చేస్తే కావలసింది లభిస్తుంది.
వినడం, నిర్ణయం
ఇతరులతో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు ‘ఎదుటివారు చెప్పేది వినడం’ ఎంతో అవసరం. ఇతరుల భావాలు తెలుసుకునేందుకు ఈ నైపుణ్యం అభివృద్ధి చెందించుకోవాలి. ఇతరులతో ప్రతిభావంతంగా మీ భావాలు పంచుకునేందుకు ‘వినడం’ ఎంతగానో అవసరం.
అదే విధంగా నిర్ణయం చేయడమనేది నిరంతర జీవితంలో ప్రతిరోజూ అవసరమవుతూ ఉంటుంది. ఈ నిర్ణయాలు తరచు వైఫల్యాలను చవి చూపిస్తూ ఉంటాయి. తప్పుడు నిర్ణయాలు ప్రమాదాలను కూడా తెచ్చి పెడుతూ ఉంటాయి.
ముఖ్యంగా నిర్ణయానికి - సమయానికి బలమైన బంధం ఉంది. సమయాన్నిబట్టి తీసుకునే నిర్ణయాలు రకరకాలుగా ఫలితాలను ఇస్తాయి. అందుకే నిర్ణయం తీసుకునేటప్పుడు సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. నిర్ణయాలు చేయడం నాల్గు రకాలుగా ఉంటుంది.
* తప్పుడు నిర్ణయం తప్పుడు సమయంలో తీసుకోవడం.
* సరియైన సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకోవడం.
* సరియైన నిర్ణయం తప్పుడు సమయంలో తీసుకోవడం.
* సరియైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోవడం.
మీరు సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకున్నప్పుడు మిమ్మల్ని ఇతరులు మంచి నిర్ణయశక్తి గల వ్యక్తిగా గుర్తిస్తారు. మీ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి.
క్రమశిక్షణ - మానవ సంబంధాలు
క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం. ప్రతి చర్యలోని ప్రతి సందర్భంలోను క్రమశిక్షణ చాలా ముఖ్యమైనది. క్రమశిక్షణ అంటే కొన్ని నియమాలు, సూత్రాలు, పద్ధతులు లేదా మార్గాలు. ఒకసారి ఒక ‘ఒప్పందం’ కుదుర్చుకుంటే విధిగా ఒప్పందంలోని షరతులను పాటించాలి. పాటించకపోతే క్రమశిక్షణను ఉల్లంఘించినట్లే.

-సి.వి.సర్వేశ్వరశర్మ