తెలంగాణ

విఐపి వాహనాలతో ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం బృందం, ఫిబ్రవరి 19: మేడారం జాతరకు విచ్చేసిన భక్తులకు విఐపిలు, వివిఐపిల వాహనాలతో ఇక్కట్లు ఎదురయ్యాయి. విఐపిలు, వివిఐపిలు అంటూ కొంతమంది తమ వాహనాలను ప్రధాన ద్వారం వరకు తీసుకరావడంతో సామాన్య భక్తజనానికి తిప్పలు తప్పలేదు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి క్యూలైన్ల వద్ద చేరే భక్తులకు అడుగడుగునా వాహనాలు ఎదురుకావడంతో పిల్లాపాపలతో, నిలువెత్తు బంగారాలతో దర్శనానికి బయలుదేరిన భక్తులకు అసౌకర్యం ఏర్పడింది. ఓ దశలో గంటకుపైగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో అంబులెన్స్‌లకు కూడా దారిలేని పరిస్థితిలో అవిసైతం నిలిచిపోయాయి.