విశాఖపట్నం

ఏజెన్సీలో కుంభ వృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పిడుగుపాటుకు గిరిజన మహిళ మృతి * పాడేరులో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
పాడేరు, ఏప్రిల్ 20: విశాఖ ఏజెన్సీలో శుక్రవారం మధ్యాహ్నాం భారీ వర్షం కురిసింది. భీకరమైన గాలులతో కూడిన కుంభ వృష్టి కురవడంతో ఈ ప్రాంతీయులు తీవ్ర ఆందోళన చెందారు. హుదూద్ తుపానును తలపించే మాదిరిగా భయకరమైన గాలులు వీయడంతో ఏం జరుగుతుందోనని సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. పాడేరులో శుక్రవారం మధ్యాహ్నాం ఒంటి గంటన్నర సమయం వరకు విపరీతమైన ఎండ కాయడంతో ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరై ఉక్కపోతను ఎదుర్కొన్నారు. అయితే మధ్యాహ్నాం రెండు గంటల సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని ఆకాశం మేఘావృతం కావడం వర్షం ప్రారంభం కావడం క్షణాల్లో జరిగిపోయింది. దీంతో పెనుగాలులతో కూడిన వర్షం ప్రారంభమై దాదాపు 30 నిమిషాల పాటు కుంభ వృష్టి కురిసింది. భారీ వర్షానికి పాడేరు పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షంతో పాటు పెనుగాలులు వీయడంతో అనేక చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడిపోగా పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి పాక్షికంగా దెబ్బతిన్నాయి. పట్టణంలోని లోచలిపుట్టు కాలనీ ప్రాంతంలో రెండు విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వలన అనేక చోట్ల విద్యుత్ తీగలు తెగి పడిపోవడంతో పాడేరు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హుకుంపేట మండలం సంపెగిపుట్టు గ్రామంలో పిడుగుపడడంతో బోయ లక్ష్మి (38) అనే గిరిజన మహిళ దుర్మరణం పాలయ్యింది. తన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళుతుండగా అదే సమయంలో పనసచెట్టుపై పిడుగుపడడంతో చెట్టు సమీపాన ఉన్న లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. హుకుంపేటలో ఈ నెల 29వ తేది నుంచి ప్రారంభం కానున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర సందర్భంగా గ్రామంలో విద్యుత్ దీపాలంకరణ చేస్తుండగా పెనుగాలుల తాకిడికి చెట్ల కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్ సెట్టింగ్‌లు దెబ్బతిన్నాయి. ఏజెన్సీలోని పలు గ్రామాలలో కూడా భారీ వర్షాలకు అనేక ఇళ్లు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.