విశాఖపట్నం

దసరా తరువాత ఏరియా బేస్డ్ డవలప్‌మెంట్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 16: స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా ప్రతిపాదించిన ఏరియా బేస్డ్ డవలప్‌మెంట్ పనులను దసరా తరువాత ప్రారంభించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ అయికాం, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ షాపూర్ జీ అండ్ పల్లోంజీ ప్రతినిధులతో మంత్రి గంటా మంగళవారం స్థానిక సర్క్యూట్ హౌస్‌లో నగరంలో చేపట్టాల్సిన వివిధ పథకాలపై సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా 140 కోట్లతో ప్రతిపాదించిన ఏబీడీ పనులకు ముఖ్యమంత్రి ఇప్పటికే శంకుస్థాపన చేశారని చెప్పారు. అయితే, నేటి వరకూ ఈ పనులు ప్రారంభించకపోడానికి గల కారణాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దసరా వెళ్లిన వెంటనే ఈ పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 19.41 కిలో మీటర్ల మేర 20 రోడ్ల అభివృద్ధి పనులకు రూపొందించిన డిజైన్లు, ల్యాండ్ స్కేపింగ్, బ్యూటిఫికేషన్ పనుల నిర్వహణకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను మంత్రి సమగ్రంగా పరిశీలించారు. ఆయా పనులను మరంత మెరుగ్గా నిర్వహించేందుకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏరియా బేస్డ్ డవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలో అభివృద్ధి పరుస్తున్న 20 రోడ్లు, వాటి డిజైన్‌లు, బ్యూటిఫికేషన్, ల్యాండ్ స్కేపింగ్, జంక్షన్ల అభివృద్ధి తదితర వివరాలను జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ మంత్రికి వివరించారు.