విశాఖపట్నం

కనెక్టయ్యారు ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 23: ఏ రంగంలోనైనా కింది స్థాయి నుంచి ప్రోత్సాహం అందిస్తేనే ఉన్నత స్థానానికి ఎదిగేందుకు అవకాశం లభిస్తుంది. కళాశాల స్థాయిలోనే సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ, కొత్తకొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా వారిలో విద్యార్థుల్లో దాగిన సామర్ధ్యం ప్రపంచానికి ఉపకరిస్తుంది. ఈ ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో రెండో సారి నిర్వహిస్తున్న ఫిన్‌టెక్ ఫెస్టివల్ 2018 కోసం విద్యార్థుల నుంచి సరికొత్త ఆవిష్కరణలు ఆహ్వానిస్తూ ‘కాలేజ్ కనెక్ట్ స్టార్టప్ ప్రోగ్రాం’ పేరిట పోటీలు నిర్వహించారు. నెల రోజులుగా జరుగుతున్న ఈ ప్రక్రియలో 96 కళాశాల నుంచి విద్యార్థుల బృందాలు పాల్గొన్నాయి. సాంకేతిక కమిటీ వడపోత అనంతరం 10 కళాశాలల స్టార్టప్‌లను ఎంపిక చేసింది. వీటిలో మూడింటిని న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. గెలుపొందిన కళాశాలలు రూపొందించిన స్టార్టప్‌లకు రూ.75 వేలు (ప్రథమ), రూ.50వేలు (ద్వితీయ), రూ.25వేలు (తృతీయ) బహుమతులు ప్రకటించారు. నోవాటెల్‌లో మంగళవారం నాటి ఫిన్‌టెక్ ఫెస్టివల్ ప్రారంభలోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలు బహుమతులందుకున్నారు.
* హృద్రోగాహాన్ని ముందుగానే గుర్తించవచ్చు
ఎస్‌ఆర్‌ఎస్‌కే ఇంజనీరింగ్ కళాశాల (్భమవరం) విద్యార్థులు అద్భుతం చేసి ఆవిష్కరించారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న బీ మహేశ్వరి, డీ సాయిమధు, కే మనీష్‌రెడ్డి, ఎం రాజశేఖర్ బృందం ముందుగానే హృహుద్రోగాన్ని కనిపెట్టి హెచ్చరించే పరికరాన్ని కనుగొన్నారు. ‘స్మార్ట్ ఈయూడీ పేచ్’ పేరిట విద్యార్థులు రూపొందించిన పరికరం ద్వారా ముందుగానే ఈసీజీ, పల్స్ పనిచేస్తున్న తీరును తెలుసుకోవచ్చు. మన చేతిలో ఉండే స్మార్ట్ఫోన్‌లో యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని, ఈ యంత్రాన్ని మానిటరింగ్ చేసుకోవచ్చు. ఈసీజీ, పల్స్ పనితీరు ఫోన్‌లో తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. కేవలం రూ.1500కు లభించే ఈ పరికరంతో ఇంట్లో ఎవరైనా తమ గుండె పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. గుండె పనితీరుకు సంబంధించి మార్పులు గమినిస్తే తక్షణమే వైద్య సహాయం తీసుకునేందుకు అస్కారం ఉంటుంది. విద్యార్థులు రూపొందించిన ఈ నూతన ఆవిష్కరణకు ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో ప్రథమ మహుమతిగా రూ.75వేలు లభించింది. తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ బహుమతిని అందుకున్న విద్యార్థుల్లో సంతోషం తాండవించింది.
* పర్యావరణ హిత ఎరువుల పిచికారీ
ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయం ఉండేది. అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువుల వాడకం తప్పనిసరైంది. పంట పొలాలకు ఎరువులు జల్లే సందర్భాల్లో అవి గాలిని కలుషితం చేస్తూనే రైతు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. సరైన భద్రత ప్రమాణాలు పాటించకుండా రైతులు పొలాలకు ఎరువులు జల్లడం ద్వారా రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవడంతో పాటు పర్యావరణానికి మేలు చేసేలా సొలార్ బండి సహకారంతో ఎరువులు జల్లే యంత్రానికి రూపకల్పన చేశారు. ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. మెకానికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వై పృధ్వీరాజ్, వై కిరణ్, అయ్యప్ప కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మణ రావు నేతృత్వంలో ఈ పరికరాన్ని రూపొందించారు. కేవలం రూ. 7వేలు పెట్టుబడితో ఎరువులు జల్లే యంత్రం కొనుగోలు చేయవచ్చు. దీనికి పెద్దగా కూలీల అవసరం కూడా ఉండదు. ఒక వ్యక్తి రోజుకు దాదాపు ఐదు ఎకరాల వరకూ ఎరువులు సులభంగా జల్లవచ్చు. ఎరువులు గాలిలో కలవకుండా నేరుగా చేనుకే చేరడం వల్ల లాభంతో పాటు రైతులు చర్మ, ఊపిరితిత్తుల వ్యాధుల బారిపడకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో ఈ ఎరువులు జల్లే సోలార్ యంత్రం ద్వితీయ బహుమతినిగా రూ.50వేలు గెలుచుకున్నారు.
మహిళకు ఆత్మరక్షణ
కన్ను తెరిస్తే చాలు మహిళలపై అత్యాచారాలు, హత్యాయత్నాలు. లైంగిక, శారీరక వేధింపులు. ఒంటరిగా బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో మహిళలకు రక్షణగా సెల్ఫ్‌డిఫెన్స్ పరికరాన్ని భీమవరానికి చెందిన ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపమిచ్చారు. మహిళలపై దాడులకు పాల్పడే వారికి సరైన గుణపాఠం చెప్పే పరికరం కేవలం రూ.800కి అందుబాటులోకి తెచ్చారు. కేవీవీవీ సాయికిరణ్ బృందం మెకానికల్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. వీరు తయారు చేసిన పరికరం మూడు విధాలుగా పనిచేస్తుంది. తొలి దశలో ఫ్లేర్‌గా పనిచేస్తుంది. అగంతకులు ఒంటరి మహిళపై దాడికి తెగబడిన తరుణంలో తొలిదశలో పరికరం ఉపయోగించగానే గాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లి బాణాసంచా కాల్పుల్లా వెలుగులు విరజిమ్ముతుంది. రెండో దశలో టీజర్‌గా పనిచేస్తుంది. చివరి దశ బీపర్‌లో భారీ శబ్ధంతో అగంతకుల ఉనికి తెలిపేలా విద్యార్థులు ఈ రక్షణ పరికరాన్ని తీర్చిదిద్దారు. మహిళల ఆత్మ రక్షణ కోసం రూపొందించిన ఈ పరికరానికి ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో తృతీయ బహుమతిగా రూ.25వేలు దక్కింది.

ఆర్‌ఓఆర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్ధాపన
ఆనందపురం, అక్టోబర్ 23: మండలంలోని తర్లువాడ గ్రామంలో మంగళవారం ఆర్‌ఓఆర్ ప్లాంటు నిర్మాణానికి స్థానిక సర్పంచ్ మంజ్జి వెంకటరావు శంఖుస్తాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన బావి ప్రకాశం, కన్నయ్యలు తమ వంతు సహాయంగా రెండు సెంట్లు భూమిని ప్లాంటు నిర్మాణంకోసం ఇచ్చినట్లు తెలిపారు. టిఎస్‌ఆర్ నిధులు 14లక్షల రూపాయిలతో నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రామీణ నీటిపారుదల శాఖ ఎఇ దేపక్,సేవా పీఠం ఇన్‌చార్జి గిడుతూరి రమణ తదితరులు పాల్గొన్నారు.