విశాఖపట్నం

పారిశ్రామిక, విద్యారంగాలు కలిసి పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 23: సాంకేతిక విద్యను అభ్యసించి వచ్చే అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు లభించకపోవడానికి విద్యాసంస్థలు, పారిశ్రామిక రంగం మధ్య అంతరమే కారణమని చంద్రబాబు అన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల కిందట ఐటీ పట్ల విద్యార్థులకు ఏమాత్రం శ్రద్ధ ఉండేది కాదు., ఇప్పుడే అదే రంగం విద్యార్థులకు ఉపాధి చూపిస్తోందని అన్నారు. పారిశ్రాకవేత్తలు, యూనివర్శిటీలు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేదిశగా సమన్వయం కుదుర్చుకోవాలని ఆయన సూచించారు. కాలుష్య అద్భుతమైన డేటా ఇప్పుడు మనందరికీ అందుబాటులో ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎంతైనా సహకరిస్తుందని చంద్రబాబు చెప్పారు. కమ్యూనికేషన్స్ సమస్యకాదు. దాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలోనే సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. టెక్నాలజీని షేర్ చేయడం ద్వారా అద్భుతాలు సాధించవచ్చని ఆయన అన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్, ఐఓటీల్లో ఫిన్‌టెక్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను వదిలి ఇప్పుడు తమతమ స్వగ్రామాల్లో పనిచేసేందుకు చాలా మంది వెనక్కు రావడం ఆశ్ఛర్యకరంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు మళ్లీ ఊపందుకున్నాయని ఆయన చెప్పారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం చేయూతనందిస్తోందని ఆయన తెలియచేశారు. రాష్ట్రంలో 175 ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు.
ఐటీ శాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ నాల్గవ పారిశ్రామిక విప్లవంలో వస్తున్న అధునాతన టెక్నాలజీలను అమలు చేయడంలో అందరికన్నా ముందున్నామని అన్నారు. 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగాను, 2029 నాటికి దేశంలో నెంబర్ వన్ స్థానంలోను, 2050 నాటికి ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. ఫిన్‌టెక్, బ్లాక్ చైన్, డేటాఅనలటిక్స్ వంటి టెక్నాలజీలను అభివృద్ధి చేస్తూ, ఆయా రంగాల్లో యువతకు ఉద్యోగకల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని లోకేష్ చెప్పారు. రైతులకు క్రెడిట్ స్కోర్ ఇవ్వడం ద్వారా వారు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా పంటల బీమా, రుణాలు పొందే అవకాశం కల్పించామని అన్నారు. ప్రజాసాధికార సర్వే ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా రియల్‌టైం జనాభా లెక్కలు చేయగలిగామని అన్నారు. మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, ఫింటెక్ యాసిలేటర్ల సహకారంతో మరిన్ని ఫిన్‌టెక్ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
ముఖ్యమంత్రి ఐటీ సలహాదారు జేఏ చౌదరి మాట్లాడుతూ బెంగళూరు, గురుగావ్ నుంచి సాంకేతిక రంగంలో పనిచేస్తున్న చాలా మంది తిరిగి స్వస్థలాలకు వచ్చేస్తున్నారని అన్నారు. ఇజ్రాయిల్, హాంకాంగ్, సింగపూర్ దేశాల్లోని ఫిన్‌టెక్ విధానాన్ని ఏపీలో అమలు చేయనున్నామని ఆయన చెప్పారు. ఒకప్పుడు మన రాష్ట్రానికి వచ్చే స్టార్టప్ కంపెనీలు బిజినెస్ ఎలా ఉంటుందోనని భయపడేవారు. కానీ ఇప్పుడు వివిధ దేశాల నుంచి వారికి పెద్ద ఎత్తున బిజినెస్ వస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్, ట్రాయ్ చైర్మన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

అప్పన్నను దర్శించుకున్న ఐఏఎస్‌లు
సింహాచలం, అక్టోబర్ 23: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని ఇద్దరు ఐఏఎస్ అధికారులు మంగళవారం దర్శించుకున్నారు.రంపచోడవరం, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్‌లు వినోద్‌కుమార్, చంద్రకాంత్‌వర్మ స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయ అధికారులు వీరికి స్వాగతం పలికారు. కప్పస్తంభం అలింగనం చేసుకున్న అధికారులు అంతరాలయంలో సంప్రదాయ అర్చనలు చేయించుకున్నారు. అర్చకులు ఆశీర్వాదం స్వీకరించారు. అధికారులు వీరికి ప్రసాదాలు అందించారు.

చంద్రన్న బీమా అందజేత
సింహాచలం, అక్టోబర్ 23: జీవీఎంసీ 72వ వార్డు అడివివరం రాజవీధిలో నివాసముంటున్న ఎన్ని పైడిరాజు అనారోగ్యంతో మృతి చెందాడు.ఈ నేపథ్యంలో చంద్రన్న బీమా పధకం ద్వారా 5 వేల రూపాయలను మంగళవారం జన్మభూమి కమిటీ ప్రతినిధులు బాధిత కుటుంబానికి అందజేసారు. సేవామిత్ర సభ్యురాలు కే.లక్ష్మీ, 72వ వార్డు టీడీపీ అధ్యక్షుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు పిసిని వరహా నరసింహం బాధిత కుటుంబాన్ని పరామర్శించి బీమా సొమ్మును అందజేసారు. బీమా ద్వారా రావలసిన మిగిలిన లక్ష తొంభై అయిదు వేల రూపాయలను మృతుడు భార్య పద్మావతి ఖాతాలో ప్రభుత్వం జమ చేయనున్నదని వరహా నరసింహం తెలియజేసారు.