విశాఖపట్నం

ప్రయాణికుల భద్రతే లక్ష్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) విశాఖ రీజియన్ డ్రైవర్లకు ప్రమాద రహిత డ్రైవింగ్ నైపుణ్యత శిక్షణ తరగతులు ఏయూ జీఎంఆర్ స్మార్ట్ సెమినార్ హాల్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీకి ఉన్నతమైన స్థానం ఉందన్నారు. నిత్యం లక్షలాదిగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తుందని, ఇదే సందర్భంలో సురక్షిత ప్రయాణ సదుపాయం కల్పించాలన్నారు. క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్‌తో ప్రయాణీకుల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎస్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఆర్టీసీ కాలానుగుణంగా ట్రాఫిక్ వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డ్రైవింగ్ నైపుణ్యాన్ని పెంచుకుని ప్రయాణీకుల భత్రదను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఇదే సందర్భంలో ఆర్టీసీ కూడా బస్సుల ఫిట్‌నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్లు ఎప్పటికప్పుడు తమ పనితీరును మెరుగుపరచుకునేందుకు శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా ఉత్తర డ్రైవింగ్ విధానాలపై కొన్ని సూచనలు చేశారు. నగర ట్రాఫిక్ ఏసీపీ కింజరాపు ప్రభాకరరావు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా, నష్టాలు భరిస్తూ భద్రతతో కూడిన సౌకర్యవంతమైన రవాణా సదుపాయాన్ని ఆర్టీసీ కల్పిస్తోందని కొనియాడారు. అయితే ఆర్టీసీ డ్రైవర్లలో కొంతమంది ఇటీవల కాలంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని, ఇది మంది విధానం కాదన్నారు. డ్రైవర్లు బ్రేకింగ్ డిస్టెన్స్ పాటించడంతో పాటు స్పీడ్ కంట్రోలింగ్ కలిగి ఉండాలని సూచించారు. ఆర్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ ఎస్‌ఎ అన్సారీ శిక్షణ తరగతుల్లో భాగంగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. ప్రయాణీకుల భద్రతకు సంబంధించి పలు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ జీ సుధేష్ కుమార్ మాట్లాడుతూ రీజియన్ పరిధిలోని ఆన్ని డిపోల్లో ఇటువంటి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

క్రీడాకారులకు కలెక్టర్ అభినందనలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 18: ఇటీవల గుంటూరు ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్శిటీలో నిర్వహించిన సౌత్ జోన్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అభినందించారు. పోటీల్లో అండర్ 14, 16, 18, 20 కేటగిరీల్లో క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబరిచారన్నారు. అండర్ 14 బాలుర విభాగంలో ఎస్ లోహిత్, ఆర్ సాయి శ్రీనివాస్ అండర్ 14 బాలుర (లాంగ్ జంప్) వెండి పతకాలు సాధించారు. జీ ఆనంద్ కుమార్ అండర్ 16 బాలుర (షాట్‌పుట్) బంగారు పతకం, జీ మధుబాబు అండర్ 16 బాలుర (మిడ్‌లే రిలే)లో కాంస్య పతకం, ఎన్ గౌతం రెడ్డి అండర్ 20 బాలుర (48*100 మీటర్స్)లో కాంస్య పతకం సాధించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి జూన్ గాలియట్ సారధ్యంలో కలెక్టర్ కలిశారు.

గీతం ఫార్మశీ విద్యార్థికి అంతర్జాతీయ అవార్డు
విశాఖపట్నం, సెప్టెంబర్ 18: గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మశీలో ఎం ఫార్మశీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి టీ నాగసత్య యజ్ఞేష్‌కు ఉత్తమ పోస్టర్ అవార్డు లభించింది. ఇటీవల మలేషియాలో జరిగిన ‘్ఫర్మశీ-హెల్త్‌సైనె్సస్’ అంతర్జాతీయ సదస్సులో సత్య యజ్ఞేష్ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఔషధాలు సులువుగా సత్వర నొప్పి నివారణకు, ఉపశమనానికి ఏ విధంగా ఉపయోగపడగలవో సాంకేతిక వివరాలతో అంతర్జాతీయ వేదికపై గీతం విద్యార్థి సోదాహరంగా వివరించడం ద్వారా తన ప్రతిభ చాటుకున్నాడు. విద్యార్థి నాగసత్య యజ్ఞేష్ ప్రతిభను ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ గణపతి అభినందించారు.

కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఆందోళన
పాడేరు, సెప్టెంబర్ 18: తమ సమస్యలను పరిష్కరించాలని గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న కంట్రాక్టు ఉపాధ్యాయులు మంగళవారం పాడేరు పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించి స్థానిక సబ్ ట్రైజరీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమకు బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని, సంవత్సరాల తరబడి పనిచేస్తున్న తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ సి.ఆర్.టి.లు సమ్మె చేస్తూ స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయం ఎదుట నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆందోళన చేస్తున్నారు. సి.ఆర్.టి.లు చేస్తున్న ఆందోళనకు పలు సంఘాలు మద్దతు ప్రకటించగా, తమ ఆందోళనలో భాగంగా పట్టణంలో ర్యాలీ, ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేసారు. తమకు బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తూ స్థానిక సబ్ ట్రెజరీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కుడుముల కాంతారావు, సి.ఆర్.టి.ల సంఘం ప్రతినిధులు కె.వెంగలబాబు, టి.నూకరాజు, కె.్భనుమూర్తి, జి.గణేశ్వరరావు, పి.కాంతారావు తదితరులు పాల్గొన్నారు.