విశాఖపట్నం

కోమాలో ‘సిట్’ నివేదిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 20: విశాఖ భూ కుంభకోణాలపై దర్యాప్తు జరిపి, ఇచ్చిన నివేదిక కోమాలోకి వెళ్లిపోయిందని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖలో వేల కోట్ల ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులు తారుమారయ్యాయని, చాలా వరకూ భూమి అన్యాక్రాంతమైపోయిందని అన్నారు. ఇందులో అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసినా, ప్రభుత్వం సిట్‌తో సరిపెట్టిందని అన్నారు. సుమారు ఏడు నెలలపాటు ఇద్దరు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో దర్యాప్తు సాగిందని అన్నారు. సిట్‌కు 2875 ఫిర్యాదులు వస్తే, వీటిలో కేవలం 344 ఫిర్యాదులను మాత్రమే సిట్ పరిశీలించిందని అన్నారు. మిగిలిన 2531 దరఖాస్తులకు అతీగతీ లేకుండాపోయిందని దాడి అన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని సిట్‌కు తెలియచేస్తే, న్యాయం జరుగుతుందని బాధితులు దరఖాస్తులు ఇస్తే, వాటిలో 2531 దరఖ్తాలు పరిశీలించకుండా వదిలేయడం సరికాదని ఆయన అన్నారు. ఈ భూ కుంభకోణాల్లో 32 మంది ప్రైవైటు వ్యక్తులు రికార్డులను టాంపర్ చేశారని ఇందులో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారని సిట్ అధికారులు నివేదికను సమర్పించిన సమయంలో చెప్పారని వీరభద్రరావు చెప్పారు. అలాగే 30 మంది అధికారులు ఉన్నారని, 101 కేసులలో శాఖపరమైన విచారణ జరిపించాలని సిట్ అధికారులు పేర్కొన్నారని దాడి చెప్పారు. విశాఖ భూ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తహశీల్దార్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా, వారికి మరింత డిమాండ్ ఉన్న మండలాలకు బదిలీ చేశారిన ఆయన ఆరోపించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోడానికి ప్రయత్నిస్తున్న కలెక్టర్, జేసీపై కూడా అధికార పార్టీ నాయకులు వత్తిడి తెస్తున్నారని ఆయన అన్నారు.
సిట్ నివేదికను బయటపెట్టడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. అస్మదీయులను రక్షించడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? లేకుంటే, సిట్ నివేదికను టాంపర్ చేద్దామని చూస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో విలువైన భూమి ఉందకాబట్టి, భూ కబ్జాదారులంతా ఇక్కడికే వస్తున్నారని దాడి ఆరోపించారు.
ప్రభుత్వం మొదలుపెట్టిన ల్యాండ్ పూలింగ్ కూడా ఒక పెద్ద కుంభకోణమని అన్నారు. ల్యాండ్ పూలింగ్ అనేది చట్టంలో ఎక్కడా లేదని అన్నారు. అసైన్డ్ ల్యాండ్‌ను వుడాకు ఇచ్చి, దాన్ని అభివృద్ధి చేసి, దాంతో 60 శాతం అధికార పార్టీ వాళ్లు తీసుకుని, 40 శాతం భూమిని విక్రయిస్తున్నారని దాడి ఆరోపించారు. కొండవాలు ప్రాంతాల్లో భూమిని సైతం తెలుగుదేశం పార్టీ నాయకులు వదిలిపెట్టడం లేదని అన్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ ప్రభుత్వమై అవినీతి పాలన సాగించిందని భావించాం, తెలుగుదేశం ప్రభుత్వంలో దానికి మించిన అవినీతి జరుగుతోందని దాడి అన్నారు. విశాఖ భూ కుంభకోణాల అన్ని రాజకీయ పార్టీలతో కలిసి త్వరలోనే ఉద్యమిస్తామని దాడి చెప్పారు.