కృష్ణ

బీజేపీ ఓటమితో బలపడిన హోదా వాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవా: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే వాదన బలపడిందని, కర్నాటకలో బీజేపీని ఓడించటంలో తెలుగువారి తీర్పుతో ఇది అందరికీ అర్థమైందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం నగరంలో జరిగిన విజయోత్సవ ర్యాలీ ప్రారంభంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. కర్నాటక ఎన్నికల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని అక్కడ తెలుగు మాట్లాడేవారు రక్షించారని, ఇది తెలుగువారి విజయమన్నారు. కర్నాటక ఎన్నికలకు ముందు దాదాపు 20రోజులు ఏపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రేయింబవళ్లు తెలుగు మాట్లాడేవారి ప్రాంతాల్లో పర్యటించి, ప్రచారం చేశారని, వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కర్నాటకలో తెలుగు మాట్లాడేవారు దాదాపుగా 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంటే అందులో 27చోట్ల బీజేపీని తెలుగువారు ఓడించారన్నారు. ఈ 34 నియోజకవర్గాల్లో 13చోట్ల బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపించారనే దానికంటే బీజేపీని ఓడించారని, తెలుగువారు బీజేపీ మోసానికి పగ తీర్చుకున్నారన్నారు. అక్కడ మన పక్షాన నిలబడిన తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక హోదా వాదం బలపడిందనేది తిరుగులేని సత్యమన్నారు. కాలం చెల్లిందని చెప్పడానికి ఇక ఎవరూ సాహసించరని ఆయన పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటను కర్నాటకలో ఉన్న తెలుగువారంతా విశ్వసించారన్నారు. 2019లో రాహుల్‌గాంధీ ప్రధాని అయిన తరువాత మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైల్‌పై చేస్తారన్నారు. ఇక ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, అక్కడ పదిమంది తెలుగువారున్నా ప్రచారానికి వెళతామని, బీజేపీని ఓడిస్తూనే ఉంటామన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు విషయంలో బీజేపీ యూటర్న్ తీసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ ఒక అజెండాను సెట్ చేసిందన్నారు. ఆ అజెండానే ఈరోజు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు కావాలని పోరాడుతున్నారన్నారు. ఏరోజు కర్నాటకలో బీజేపీని బహిష్కరించారో అదేరోజు ఆంధ్ర రాష్ట్రంలోనూ బీజేపీ బహిష్కరణ మొదలైందన్నారు. కర్నాటకలోని పరిణామాలతో బీజేపీ పతనం స్పీడ్ అందుకుందని, ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పతనం తప్పదని రఘువీరాహెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని, రా జ్యాంగాన్ని, లౌకికవాదాన్ని వ్యతిరేకించే బీజేపీని నామరూపాలు లేకుం డా చేయాల్సిన అవసరం వుందని అన్ని పార్టీలకూ సూచించారు. ప్రజాస్వామ్య విజయోత్సవ ర్యాలీని పెద్దఎత్తున జరుపుకున్నామని, ఈ విజయోత్సవాల పరంపర 2019 వరకు కొనసాగుతుందని ప్రజలంతా సహకరించాలని రఘువీరారెడ్డి కోరారు.