కృష్ణ

నివాళి కోసం గంటల తరబడి నిరీక్షణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 4: ఆలస్యం అమృతం విషం.. అంటారు పెద్దలు. విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నివాళి అర్పించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలస్యంగా రావటం వివాదంగా మారింది. ఈవిషయంలో అధికార యంత్రాంగం అతి ప్రవర్తన రాజకీయ వివాదానికీ దారితీసింది. బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు తనదైన శైలిలో మన్యంలో విప్లవం రేపిన అల్లూరి సీతారామారాజు జయంతి వేడుకలు అధికార, విపక్షాల మధ్య చిచ్చు రేపాయి. గంటలకొద్దీ నిరీక్షింపచేసిన సిఎం చంద్రబాబు వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సీతారామరాజు 119 జయంతి ఉత్సవాలను ప్రభుత్వపరంగా ఘనంగా నివాళులు అర్పించేందుకు సోమవారం ఉదయం 53వ డివిజన్ బుడమేరు వంతెన సెంటర్‌లోని విగ్రహం వద్ద ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని నివాళులు అర్పిస్తారంటూ అధికారులు ప్రకటించగా అనివార్య కారణాలతో సిఎం సకాలంలో హాజరు కాలేకపోయారు. ఈవిషయం పక్కన పెడితే ఉదయం వేళల్లోనే చేపట్టాల్సిన నివాళి కార్యక్రమాలను సిఎం వచ్చేంతవరకూ ఇతరులెవ్వరినీ అనుమతించేది లేదంటూ అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించడంతో రేగిన దుమారం అధికారులు, విపక్షాల మధ్య వివాదం మరింత ముదిరి విపక్ష నేతలను పోలీస్ స్టేషన్‌కు తరలించేలా చేసింది. ఉదయం 9 గంటలకే సిఎం ప్రోగ్రాం ఫిక్స్ కాగా మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఆయన రాలేకపోయారు. రాజకీయాలకు అతీతంగా అల్లూరికి నివాళులు అర్పించడం ఆనవాయితీ కాగా, ఉదయం 11 గంటల సమయంలో సిపిఐ తరఫున నివాళులు అర్పించేందుకు రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, తదితరులు విగ్రహం వద్దకు చేరుకున్నారు. సిఎం గారు వచ్చి వెళ్లేంతవరకూ ఇతరులెవ్వరినీ అనుమతించేది లేందంటూ అధికారులు కరాఖండిగా తేల్చిచెప్పడంతో నివాళి కార్యక్రమంలో రాజకీయ వివాదం ఎందుకులే అని భావించిన వామపక్ష నేతలు సమన్వయంతో కొద్దిసమయం పాటు వేచిచూశారు. 9 గంటలకు వస్తానన్న సిఎం చంద్రబాబు ఎంతకీ రాకపోవడంతో నివాళి అర్పించేందుకు తమను అనుమతివ్వాలంటూ వామపక్ష నేతలు కోరినా అందుకు అధికారులు నిరాకరించారు. దీంతో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వామపక్ష నేతలు పోలీసులను తప్పించుకోబోయి విగ్రహం వద్దకు చేరుకోబోతున్న సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పెద్దఎత్తున వాగ్వాదం, పెనుగులాట చోటుచేసుకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న తరుణంలో సిపిఐ నేతలు రామకృష్ణ, శంకర్, మహిళా నేత పి దుర్గ్భావాని, నగర నేతలు శ్రీనివాస్, ఎ రాము, కెవి భాస్కరరావు, పంచదార్ల దుర్గాంబ, బొక్కా ప్రభాకర్, తదితరులను అదుపులోకి తీసుకొని నున్న పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవ్వగా టిడిపి నేతలు సైతం తప్పుపట్టారు. సామరస్యంగా, సమన్వయంగా వ్యవహరించాల్సిన పోలీసులు అల్లూరిని అవమానించేలా వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలావుండగా మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి బుడమేరు వంతెన సెంటర్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి క్షణాల్లో వెనుతిరిగి పోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.