కృష్ణ

అవకాశాల కోసం ఎదురు చూడకుండా.. చేదక్కించుకోండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జీవితంలో అన్నిటికన్నా సమయం విలువైనదని, యువత అవకాశాల కోసం ఎదురు చూడకుండా వచ్చిన అవకాశాలను చేదక్కించుకోవాలని మాజీ సిఐడి జాయింట్ డైరక్టర్, మహారాష్ట్ర, నాం దేడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివి లక్ష్మీనారాయణ సూచించారు. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ ఆధ్వర్యంలో జరిగిన ఇం పాక్ట్ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి అవకాశాలను ఎలా సద్వినియోగపరచుకోవాలి అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేనంత యువశక్తి మన దేశంలో వున్నదని, పుష్కలమైన అవకాశాలు వున్నాయని, వాటిని యు వత సద్వినియోగపరచుకునే విధంగా ఎదగాలన్నారు. లక్ష్యాన్ని చేదించేటప్పుడు ఎన్నో అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, మనస్సు పెట్టి పనిచేస్తే చేదించవచ్చు అన్నారు. కష్టకాలంలోనే నిజమైన నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయన్నారు. విభజన అనంతరం ఇక్కడి యువతకు ఎన్నో అవకాశాలు కోల్పోయామని నిరుత్సాహంతో ఉన్నారని, ప్రతి గంట విలువైనదిగా పరిగణించి కష్టపడితే అవకాశాలు అందిపుచ్చుకోవచ్చన్నారు. ప్రపంచంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో గణన పరిగణలోకి తీసుకుంటే వృద్ధుల సంఖ్య పెరుగుతుందన్నారు. కాని మనదేశంతో పోలిస్తే యువత పెరుగుతుందని, ఇది మనకు అందివచ్చే అవకాశం అన్నారు.