కృష్ణ

సమర్థవంతంగా విపత్తు నివారణ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 20: ప్రక్రితి వైపరీత్యాలే కాకుండా వివిధ తప్పిదాల వలన ఎదురయ్యే విపత్తు నష్ట నివారణను విజయవాడ నగరపాలక సంస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని విఎంసి కమిషనర్ వీరపాండియన్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలుసుకున్న ఐక్యరాజ్య సమితి అభివృద్ధి విభాగం (యుఎన్‌డిపి) ప్రతినిధి బృందానికి నగర విపత్తు నిర్వహణలో విఎంసి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. నగరంలో వరద ముంపు నివారణ, వర్షా కాలంలో విరిగిపడే కొండ చరియల విషయంలో తీసుకునే జాగ్రత్తలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా సంభవించే అగ్ని ప్రమాదాలపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా వీరపాండియన్ మాట్లాడుతూ నగరానికి మంజూరైన 461 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న స్ట్రామ్ వాటర్ ప్రాజెక్టు త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని దీనివలన వర్షం ముంపు నివారణతోపాటు ఎప్పటి నీరు అప్పుడే పారుదల అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగర వ్యాప్తంగా ఎల్‌ఇడి వీధి దీపాల వినియోగంతో యాభై శాతం ఇంధన వినియోగం, వ్యయాన్ని అరికడుతున్నామన్నారు. అంతేకాకుండా సూర్యకాంతితో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా తీసుకోవాల్సిన చర్యలపై యుఎన్‌డిపి బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు. ఈ సమావేశంలో ఎసిజి పి అరుణ్‌బాబు, యుఎన్‌డిపి ప్రతినిధులు పద్మనాభన్, అభామిత్ర, నాగేంద్ర బియానీ, విఎంసి ఎసిజి (ప్రాజెక్ట్స్) నరసింహమూర్తి, సిఎంహెచ్‌ఓ గోపినాయక్, తదితరులు పాల్గొన్నారు.