కృష్ణ

సందడిగా పింక్ రిబ్బన్ వాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 23: ఆంధ్ర హస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం నుండి వరల్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ డేను పురస్కరించుకుని ఆదివారం రెండు కిలోమీటర్ల పాటు పింక్ రిబ్బన్ వాక్ జరిగింది. ఈవాక్‌లో నగరంలోని వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్ధులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులతో పాటు సినీనటుడు సుమంత్ పాల్గొన్నారు. స్టేడియం నుండి సాగిన ఈవాక్ దాదాపు రెండు కిలోమీటర్లు పాటు సందడిగా ఎంతో ఉత్సాహంగా సాగింది. వాక్ ప్రారంభ కార్యక్రమంలో సుమంత్ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు గురించి తెలియజేశారు. ఈవాక్‌లో సుమారు 3000మంది విద్యార్ధులు, వివిధ సంస్థల ప్రతినిధులు, నగర పోలీస్ కమీషనర్ గౌతంసవాంగ్, డా రఘురాం, డా పివి రామారావు, డా పి పద్మ, తదితరులు పాల్గొన్నారు.