కృష్ణ

కృష్ణాలో 275 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 9: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యానికి 48 గంటల్లోపే చెల్లింపులు జరగాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో 275 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు పండించిన ధాన్యాన్ని ఈ కొనుగోలు కేంద్రాలు సేకరించి వారికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను అందించాలన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారం రోజులు అయినప్పటికీ ఇప్పటివరకు 24 కేంద్రాల సమాచారం మాత్రమే వెబ్‌సైట్‌లో పర్చేజ్ వివరాలు అనుసంధానించారని, మిగిలిన పర్చేజ్ కేంద్రాలు వెబ్‌సైట్ పర్చేజ్ సమాచారాన్ని ఎందుకు అప్‌లోడ్ చేయలేదో వివరించాలని హెచ్చరించారు. ప్రతిరోజు రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని అలాగే వెబ్‌సైట్‌లో కూడా డేటాను అప్‌లోడ్ చేయాలని కొనుగోలు కేంద్రాల అధికారులకు సూచించారు. రైతుల నుండి ఫిర్యాదులు వస్తే సహించేది లేదని ఇన్‌ఛార్జి కలెక్టర్ హెచ్చరించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందనే అంచనా వున్నప్పటికీ మరింత పెరిగే అవకాశం వుందని దానికి అనుగుణంగా కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు సిద్ధంగా వుండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2016-17 పంట కాలమునకు గాను నిర్ధిష్ట నాణ్యతా ప్రమాణాలు కలిగిన ధాన్యంకు కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలుకు 1470 రూపాయలు, ఎ.గ్రేడు రకము క్వింటాలుకు 1510 రూపాయలు ప్రకటించారని అదే విధంగా రైతులకు ధరను అందించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు 31, మార్చి 2017 వరకు పనిచేస్తాయని, రైతులు తమ ధాన్యం ఏరోజు తెచ్చేది ముందుగానే టోకెన్ తీసుకోవచ్చన్నారు. మరింత సమాచారం కొరకు పౌరసరఫరాల విభాగానికి చెందిన డిఎం ఆఫీసు 08662570626, డిఎస్‌ఓ ఆఫీసు నెం.08672-252493, ఎఎం (జనరల్) నెం.9963479156, మేనేజర్ క్యూ.సి.(రిటైర్డ్) ఓఎస్ నెం.9908565609కు సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ సలోని సిదాన, సివిల్ సప్లై జిల్లా మేనేజరు వరకుమార్, డిసిఓ ఎన్‌విఆర్ ఆనందబాబు, పర్చేజ్ కేంద్రాల అదికారులు, సిబ్బంది హాజరయ్యారు.