అక్షరాలోచన

ఓర్వలేనివారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాదిగా అందరిలో ఉంటూ
మంచివారిని మట్టుబెట్టేందుకు
పచ్చని పంటకు పట్టిన చీడలా
కడుపు నిండా కషాయం నింపుకొని
మెదడు నిండా దుర్బుద్ధి పెట్టుకొని
కరడు గట్టిన ఆలోచనలతో
కఠిన హృదయంతో
అబద్ధాలూ మాయలు వొలకబోస్తూ
నేరాల్లో మెలకువలు నేర్చుకొని
ఒళ్లంతా విషభరితమై
ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ
బాధించి ఆనందపడుతూ
నిరంతర అవకాశవాదులై
నక్క వినయాలు ప్రదర్శిస్తూ
కాపుకాస్తూ కాటేసేందుకు సిద్ధపడుతూ
అందితే జుట్టూ కాదంటే కాళ్లు అన్న ధోరణిలో
అవసరానికి అనుగుణంగా అడ్డదారులు తొక్కుతూ
పక్కా ప్రణాళికలతో పనులు నెరవేర్చుకుంటూ
వావివరసలు లేకుండా వంచన గావిస్తూ
ఎదుగుతుంటే ఏడుస్తూ
ప్రత్యర్థులను పీడిస్తూ సతాయిస్తూ
అన్నింటా అడ్డుపడుతూ పడదోస్తూ
అహర్నిశలూ ఒకరి ఉన్నతిని చూసి ఓర్వలేనివారు
నిజంగా అసలు సిసలయిన ఓర్వలేనివారు..!

*********************************

నూరేళ్లు

-భూత్‌పూర్ చంద్రశేఖర్
9640037003

మానవుని ఆయుష్షు
నిండు నూరేళ్లు
పేరుకు మాత్రమే
ఏ ముహూర్తాన
బ్రహ్మ లిఖించాడో
అరవై ఏళ్లకే హతోస్మి ప్రాణాలు
కల్తీ ఆహారంతో
కండలు కరిగి
ఆయుష్షు గీత
అపహాస్యం చేస్తూ
వికటాట్టహాసం చేస్తూ
మృత్యువుతో రాజీపడలేక
యమపాశానికి గురై యముడి వెంటెళ్లింది.

***************

అసంపూర్తి కల

-పుష్యమీ సాగర్
9032215609
ఎక్కడ మొదలెట్టాలో, మరెక్కడ ముగించాలో
లోతెంతో తెలియని చీకటి రాత్రుల గుండా
అస్పష్టపు ఆలోచన నుండి పుట్టిన బీజం..
తెరలు తెరలుగా విరిగిపడుతున్న
తెలియని నవ్వుల శకలాలు
భయం వొంటికి చుట్టిన పిరికితనపు
ముసుగులు, సన్నటి వణుకు
పగలంతా చుట్టచుట్టి నిద్రల్లో
కరిగిపోయే నిశాతనానికి
అక్షరాలు దారంగా కట్టడానికి
తొందరెందుకంటూ గగ్గోలు
కొన్ని ముఖాలు కళ్లలో
తచ్చాడుతూ తడుముతూ
పరిగెత్తి పరిగెత్తి అలసిపోతాయి
గబ్బిలంలా వేలాడుతూ
అసంపూర్తి కల, తెల్లవారేలోగా
దిక్కులు తెలియని తోవకి ఎగురుకుంటూ వెళ్లింది

***************
కవి సూర్యుడు
-మాధవీ సనారా 9440103134
కవి ఎన్నటికీ మాజీ కాడు
కవిత్వం వుందంటే
కవి వున్నట్టే.
ఎండ ఉందంటే
సూర్యుడు వున్నట్టే
కవికీ కవిత్వానికీ సంబంధం
ఎండకీ సూర్యుడికీ వున్న
సంబంధం లాంటిదే.

-డి.చాంద్‌బాష 9701030480