విశాఖపట్నం

సందర్శకులకు నిరాశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: నగరంలో మూడు రోజులుగా జరుగుతున్న ఇండియా, ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ముగింపు నిరాశకు గురిచేసింది. ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన సీ ఫుడ్ షో ముగింపు రోజు ఆదివారం ఎగ్జిబిషన్‌కు సందర్శకులను అనుమతిస్తామని నిర్వాహకులు ముందుగా ప్రకటించారు. ఎంపెడా, సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఈవెంట్‌ను సందర్శించేందుకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. ఒక పక్క జోరున వర్షం కురుస్తున్నప్పటికీ పిల్లలతో పాటు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఎగ్జిబిషన్‌లోకి సందర్శకులను అనుమతించినప్పటికీ ఎంట్రీ ఫీజు వసూలు చేయాలన్న నిర్వాహకుల నిర్ణయంపై సందర్శకులు నిరసన వ్యక్తం చేశారు. పెద్దలకు రూ.100, విద్యార్థులకు రూ.10 ఫీజుగా నిర్ణయించిన ఎంపెడా, వేదిక బయట కౌంటర్లను తెరిచి టికెట్టు విక్రయించింది. సందర్శకులను అనుమతిస్తామని రెండు రోజులుగా ఊదరగొట్టిన నిర్వాహకులు ఎంట్రీ ఫీజు వివరాలనుగానీ, విద్యార్థులు తమ కళాశాల, పాఠశాల గుర్తింపు కార్డును తెచ్చుకోవాలని ప్రకటించలేదు. దీంతో ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు వచ్చిన సందర్శకులు ఎంట్రీ ఫీజు వివరాలు తెలుసుకుని అవక్కయ్యారు. రూ.100 చెల్లించడానికి మనసు అంగీకరించక స్టేడియం నలుమూలలు కలియతిరిగి, ఫోటోలు తీసుకుని వెనుదిరిగారు.
నిర్వాహకులపై మండిపాటు
గత రెండు రోజులుగా పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో సీ ఫుడ్ షోపై విస్తృత కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో అట్టహాసంగా నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌ను తిలకించాలని ప్రజలు భావించారు. అయితే నిర్వాహకుల తీరుతో వీరంతా నిరాశగా వెనుదిరిగారు. సామాన్య ప్రజానీకం పలువురు ఎంట్రీ ఫీజు వసూలుపై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక రకంగా ఇది దోపిడీయేనంటూ మండిపడ్డారు.
సమన్వయ లోపం
మూడు రోజుల పాటు నిర్వహించిన సీ ఫుడ్ షోలో ఎంపెడా, సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కన్పించింది. ఎంపెడా అధికారులు స్వతంత్య్రంగా వ్యవహరించారు. తొలి రోజు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు హాజరు కావడంతో జిల్లా యంత్రాంగం మీడియా తదితరులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లింది. తర్వాత రెండు రోజులు వ్యవహారం మొత్తం ఎంపెడా అధికారులు తన చేతుల్లోకి తీసుకున్నారు. సీ ఫుడ్ అసోసియేషన్‌కు సైతం ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో పలువురు సముద్ర ఆహార ఉత్పత్తిదార్లు, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.