విశాఖపట్నం

పాచిన లడ్డూలు వద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: ప్రత్యేక హోదా ఇమ్మంటే రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ వాఖ్యలే ప్రాధాన్యంగా కరపత్ర పోరుకు జనసేన కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందు హోదా కోసం పట్టుపట్టిన వెంకయ్య నాయుడు తీరుపై ఇటీవల కాకినాడ సభలో నిప్పులు కురిపించిన పవన్ కల్యాణ్ హోదాపై పోరుకు జనసేనను సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా కాకినాడ సభలో పవన్ చేసిన వాఖ్యలే ప్రాధాన్యంగా కరపత్రాలతోప్రచారం చేయాలని ఆదివారం నాడిక్కడ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్ణయించారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు, ప్యాకేజీ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ జనసేన కరపత్రాలను ముద్రించింది. ప్రత్యేక హోదాతో పన్ను రాయితీలు లభిస్తాయని, నూరు శాతం ఆదాయపు పన్ను మినహాయింపు, కార్పొరేట్ పన్ను రాయితీ, నూరు శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు, కస్టమ్స్ పన్ను రాయితీ లభిస్తాయని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. దీనితో పాటు పలు రాయితీలు లభిస్తాయని పేర్కొన్నారు. ద్రవ్య నిర్వహణ చట్టం వెసులుబాటుతో రాష్ట్రం తీసుకునే విదేశీ, ప్రపంచ బ్యాంకు రుణాల చెల్లింపు పూర్తిగా కేంద్రమే భరించడం వల్ల ప్రాజెక్టుల నిర్మాణం చురుకుగా సాగుతాయని వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ పాచిపోయిన లడ్డూలు మాకొద్దు ప్రత్యేక హోదాయే ముద్దు అన్న ట్యాగ్‌లో ట్విట్టర్‌లో పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్టు తెలిపారు. అనంతరం హోదా అంశాలన్నింటితో రూపొందించిన కరపత్రాన్ని జనసేన ప్రతినిధులు సతీష్, శివప్రసాద్, నాని, ఫణి, రాఘవరావు తదితరులు విడుదల చేశారు. అంతకు ముందు ప్రత్యేక హోదా కోరుతూ నినాదాలు చేశారు.