విశాఖపట్నం

‘ఎన్‌కౌంటర్లపై జ్యుడీషియల్ విచారణ జరపాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఆక్టోబర్ 27: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో బూటకపు ఎన్‌కౌంటర్లు జరుపుతూ పోలీసులు మావోయిస్టులను హతమార్చడం అమానుషమైన చర్యగా సిపిఐ, సిపిఎం పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాల్సిందిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జె.స్టాలిన్, సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 32 మంది మృతి చెందినట్టు తెలుస్తుందని, ఒక్కసారే మావోయిస్టుల సమావేశంపై దాడిచేసి అదుపులోకి తీసుకుని ఎన్‌కౌంటర్ పేరుతో హతమారుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. పోలీసుల ఆధీనంలోనే మావోయిస్టుల అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తుందన్నారు. వీరందర్ని కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను శాంతి,్భద్రతల సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా పరిగణించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.