విశాఖపట్నం

రూ.500 కోట్లతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: స్టార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఇదే స్థాయిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసే కార్యక్రమంలో రూ.500 కోట్లతో ఏపీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో మల్కాపురం, గాజువాక ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు డిపిఆర్‌ను సిద్ధం చేస్తున్నట్టు కమిషనర్ హరినారాయణన్ తెలిపారు. సోమవారం జివిఎంసి ఆయన ఛాంబర్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని ఎన్‌ఏడి జంక్షన్ నుంచి మద్దిలపాలెం వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, హనుమంతవాక జంక్షన్ వద్ద రూ.75లక్షలతో ప్రత్యేక బ్రిడ్జిని నిర్మిస్తున్నామని, అలాగే నగర సుందరీకరణలో భాగంగా నూతన రహదారుల నిర్మాణాలు చేపట్టనున్నామన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని అందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చాలా సమస్యలు ఉన్నాయన్నారు. గతంలో 78 నగరాలు స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొనగా ప్రస్తుతం 400 నగరాలు పాల్గొంటున్నాయన్నారు. చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్‌కు సంబంధించి కమిషనర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసిందని, కాపులుప్పాడ వద్ద నిర్వహించనున్న ఈ విద్యుత్ ప్లాంట్‌కు స్థల సమస్య పరిష్కారం కాగానే నిర్మాణ పనులు చేపడతున్నట్టు చెప్పారు. స్మార్ట్‌సిటీ అభివృద్ధికి యుఎస్‌టిడిఐ సహకారం అందిస్తుందని, దీనిలోభాగంగానే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఆధారంగా పనిచేయడం జరుగుతుందన్నారు. బహిరంగ మలవిసర్జన నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు నగర పరిస్థితులపై క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రిపోర్ట్ చేశామని, ప్రస్తుతం ఇది అధ్యయనంలో ఉందన్నారు. ఈ నెలాఖరికి పూర్తిస్థాయి నివేదిక అందనుందన్నారు. అలాగే గత ఏడాది నవంబర్ నాటికి 11 కోట్ల మేర పన్నులు వసూళ్ళు కాగా, అదే ఇపుడు చూస్తే ఈ ఏడాది నవంబర్ 18వతేదీ నాటికే రూ.14.5 కోట్ల మేర ఆదాయాన్ని రాబట్టగలిగామన్నారు. నోట్ల రద్దుతో తొలి నాలుగు రోజుల్లో పది కోట్ల వరకు ఆదాయం వచ్చిందన్నారు. ప్రస్తుతం చెల్లించాల్సిన పన్నుల వసూళ్ళు జరుగుతుందని, అయితే అడ్వాన్సు రూపంలో ఎక్కడా స్వీకరించడంలేదన్నారు. త్వరలోనే బిఆర్‌టిఎస్ పనులు పూర్తిచేయడం జరుగుతుందన్నారు. సింహాచలం కారిడర్‌లో పలు సమస్యలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. యుజిడి పనులకు సంబంధించి సెంట్రల్ సిటీలో రెండు సమస్యలున్నాయని, త్వరలోనే వాటిని కూడా పూర్తిచేస్తామన్నారు. నగరంలో ఎల్‌ఇడి దీపాల వినియోగంపై ఆయన మాట్లాడుతూ 13వేల దీపాలకు సంబంధించి ఏడు వేలు దీపాలు అమర్చగా, మరో ఆరు వేల దీపాలు అమర్చాల్సి ఉందన్నారు. ఇంధన పొదుపులో భాగంగా నూతన సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. స్మార్ట్‌సిటీ అభివృద్ధికి సంబంధించి స్కిల్ డెవలెప్‌మెంట్, ట్రాన్స్‌పోర్టు విషయాలపై ప్రజలకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే స్మార్ట్‌సిటీ అభివృద్ధిపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించనున్నామన్నారు.
* ఇక స్మార్ట్ స్కూళ్ళు
స్మార్ట్ సిటీగా గుర్తించిన ఏరియా బేస్‌డ్ డెవలెప్‌మెంట్‌లో భాగంగా విశాఖలో ఉన్న పలు పాఠశాలలను స్మార్ట్ స్కూళ్ళగా అభివృద్ధి చేసేందుకు ఈ నెల 22, 23 తేదీల్లో ఆయా పాఠశాలల్లోనే స్టేక్ హోల్డర్ల సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. అలాగే ‘కంప్లీట్ స్ట్రీట్’ పేరుతో స్టార్ట్‌సిటీగా గుర్తించిన ప్రాంతాల్లో బస్ స్టాప్‌లు, సైక్లింగ్, తదితర కార్యక్రమాలను చేపట్టనున్నామని, దీనికి సంబంధించి ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నామని, వచ్చేనెలకి పూర్తిచేస్తామన్నారు.
* పురుషోత్తపురం కెనాల్ ద్వారా
నగరానికి నీళ్ళు
పురుషోత్తపురం కెనాల్ ద్వారా కూడా నగరానికి సరిపడే తాగునీటిని అందించేందుకు ప్రస్తుతం ఉన్న కెనాల్‌ను వినియోగ సాధ్యాసాధ్యాలపై విస్కో ఆధ్వర్యంలో సర్వే జరుగుతుందని, విశాఖ-చెన్నై కారిడర్ కింద రూ.340 కోట్లతో నాన్ రెవెన్యూ వాటర్‌లో భాగంగా వౌలిక వసతుల కల్పన జరుగుతుందన్నారు. డిపిఆర్ సిద్ధం చేస్తున్న అమృత్ పథకం కింద రూ.150 కోట్లతో కెనాల్ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నామన్నారు.