విశాఖపట్నం

వేదిక శాశ్వతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: విశాఖ నగరం శాశ్వత వేదికగా జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్‌ను ప్రతి ఏడాది నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడలు, యువజన అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్ర యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, రాష్ట్రంలో యువత ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో మంచి క్రీడాకారులుగా రాణించాలన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు కమిటీల అధ్యక్షులు, ప్రతినిధులతో ఆయన సమావేశమై అథ్లెటిక్స్ నిర్వహణకు నగరంలో చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వర కు సుమారు 300 జిల్లాల నుండి 3,400 మంది అథ్లెటిక్స్ వస్తున్నట్టు ఖరారు అయ్యిందన్నారు. దేశంలోని మరికొన్ని జిల్లాల నుండి మరికొంతమంది అథ్లెటిక్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. విమానాశ్రయం, రైల్వే, బస్టాండ్‌ల్లో రిసెప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేసి వివి ధ రాష్ట్రాల నుండి వచ్చే అథ్లెటిక్స్‌కు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రేమాను,రాగాలతో వారిని ఆదరించాలని, విశాఖలో క్రీడలు అంటే ఎంతో ఉత్సాహంతో వచ్చేలా చేయాలన్నారు. రాష్ట్రాల వారీగా క్రీడాకారులకు ఒకే చోట వసతి, భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. ఆయా రాష్ట్రాల్లో వారీగా క్రీడాకారులకు ఒకేచోట వసతి, భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. ఆయా రాష్ట్రా ల్లో అనుసరించే ఆచార, వ్యవహారాలు, సాంప్రదాయాలకనుగుణంగా భోజన వసతి సౌకర్యా లు కల్పించాలన్నారు. నగరంలోని ఎనిమిది ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల వసతి గృహాల్లో వసతి కల్పించామని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆయన దృష్టికి తెచ్చారు. ఆయా వసతి గృహాల్లో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అథ్లెటిక్స్‌కు మంచి వసతి కల్పించాలన్నారు. వసతి గృహాల వారీగా నియమించిన ఇన్‌చార్జిలు ఈ విషయం లో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రత్యేకించి తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని, అవసరమైతే ఆయా వసతి గృహాల వద్ద మొబైల్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయాలని జీవిఎంసి అధికారులను ఆదేశించారు. అన్ని వసతి గృహాలు, క్రీడా ప్రాంగణం వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటుచేయాలని, దగ్గర్లోని ఆసుపత్రుల్లో ప్రత్యేక రెండు బెడ్లు క్రీడాకారులకు సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారిణిని ఆదేశించారు. స్టీల్‌ప్లాంట్ ఉక్కు నగరంలోని కల్నల్ సికె నాయుడు స్టేడియంలో ఈ క్రీడలు ఏర్పాటు చేస్తున్నందున ఆయా స్టేడియా న్ని అందంగా తీర్చిదిద్దాలని, క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నగరానికి చాలా దూరంగా స్టేడియం ఉన్నందున, వసతి గృహాలకు, స్టేడియానికి ఎంతో దూరం ఉన్నందున అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు. క్రీడాకారుల వాహనాలు వెళ్ళే మార్గా లు, వసతిగృహాలు, స్టేడియం వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. క్రీడల ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అథ్లెటిక్స్ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లు, అందుకు రూపొందించిన కమిటీల వివరాలు, వాటి ఇన్‌చార్జీలు, వసతిగృహాల వారీగా పలు పనులు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన బృందాలను స్పెషల్ చీఫ్ సెక్రటరీకి వివరించారు. జెసి-2 డి.వెంకటరెడ్డి, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండి యా కార్యదర్శి సికె వెల్సన్, ట్రెజరర్ కె.శ్రీవత్సవ్, పిఓలు నితిన్ ఆర్యా, చేతన్ గులాటి, ఎన్‌ఇటి స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ డైరెక్టర్ నాగరాజ్ అడిగా తదితరులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.