విశాఖపట్నం

మత్స్యకారులు ఎస్టీ జాబితాలోకి...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21:మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సంప్రదాయ మత్స్యకారులు చేపల వేట కొనసాగించేందుకు అవసరమైన వలలు, మోటారు బోట్లు,కిట్‌లు ప్రభుత్వం అందజేస్తోందన్నారు. వయసు పైబడిన మత్స్యకారులు, జీవనోపాధి సాగించేందుకు గాను 55 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ సదుపాయం కల్పించేందుకు అవసరమైతే ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకారులు తెచ్చే చేపలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు వాటిని ఆధునిక పద్ధతుల్లో ఎండబెట్టేందుకు సోలాల్ హీటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చేపల వేట విరామం సమయంలో మత్స్యకారులకు అందిస్తున్న సహాయా న్ని ప్రభుత్వ పరంగా అందిస్తున్నామన్నారు. మత్స్యకారుల పిల్లల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగ విశాఖలో మత్స్యకార బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ మత్స్యకారులను ఏస్టీల్లో చేర్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో మత్స్యకారులు ఎస్టీలుగా గుర్తింపు పొందారని,మన రాష్ట్రంలో అటువంటి అవకాశం కల్పించాలన్నారు. ఇదే విషయాన్ని తాను ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించినట్టు ఎమ్మెల్యే వాసుపల్లి వెల్లడించారు. అలాగే మత్స్యకార వర్గాలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది మత్స్యకార కుటుంబాలు చేపలవేటపైనే జీవనాధారం సాగిస్తున్నాయని, వీరిని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. దేశం మొత్తంగా సాలీనా రూ.20 వేల కోట్ల మత్స్య సంపద ఎగుమతవుతుండగా, దీనిలో అత్యధికంగా మన రాష్ట్రం నుంచి ఎగుమతులు ఉన్నాయని గుర్తు చేశారు. సమావేశంలో పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ లాలం భవానీ, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న చేతుల మీదుగా మత్స్యకారులకు ఉపకరణాలు పంపిణీ చేశారు.