విశాఖపట్నం

ఇక నగదు లేకుండానే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: రోడ్డు రవాణా కార్యాలయంలో అందజేసే అన్ని రకాల సేవలకు ఇకపై నగదురహిత లావాదేవీలనే జరపాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.సోమవారం మర్రిపాలెంలోని ఆర్‌టిఓ కార్యాలయంలో ఇ-పోస్ మిషన్‌ను ప్రారంభించి నగదు రహిత లావాదేవీలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో ఉత్పన్నమైన చిల్లర సమస్యకు ముగింపు పలికేందుకు జిల్లావ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు రవాణాశాఖకు సంబంధించి రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖపట్నం రోడ్డు రవాణా కార్యాలయంలోనే నగదురహిత లావాదేవీలకు శ్రీకారం చుట్ట డం జరిగిందన్నారు. ఆర్‌టిఓ కార్యాల యం ద్వారా సుమారు 16 సేవలను ప్రజలకు అందజేయడం జరుగుతుందని, ఇకపై ఆయా సేవలన్నింటికీ నగదురహిత లావాదేవీలనే జరుపనున్నట్టు ఆయన తెలిపారు. జిల్లాలో అన్ని ప్రభు త్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల్లో నగదు రహిత లావాదేవీలు జరిపేందు కు అవసరమైన ఇ-పోస్ మిషన్లను ఇండెంట్‌ను బట్టి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు వచ్చిన డిమాండ్‌నుబట్టి సుమారుమూడు వేల ఇ-పాస్ మిషన్లు కావాలని ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టామని, అవి త్వరలో జిల్లాకు రానున్నాయన్నారు. ఉప రవాణా కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ఆర్‌టిఓ, కార్యాలయం వినియోగానికి సుమారు 90 ఇ-పాస్ అవసరం ఉందని, ఇప్పటి వరకు 40 మిషన్లను అందజేయడం జరిగిందని, మిగిలినవి కూడా త్వరలో పంపిణీ చేయాలన్నారు. ఎస్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆజోయ్‌కుమార్ పండిట్, సహాయ జనరల్ మేనేజర్ మధుసూధన్ పాత్రో, చీఫ్ మేనేజర్ మంగరాజు, మురళీనగర్ బ్రాంచ్ మేనేజర్ సిహెచ్‌బివిపి రాము తదితరులు పాల్గొన్నారు.