విశాఖపట్నం

యువకుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరాపల్లి, డిసెంబర్ 3: పని చూసుకుని అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళే సమయంలో విశాఖ డెయిరీలో పశువుల ఎక్స్‌టెన్షన్ వర్కర్‌ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దేవరాపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చోడవరం మండల గవరవరం గ్రామానికి చెందిన రాము (28) గత కొంత కాలంగా విశాఖ డెయిరీలో పశువుల ఎక్స్‌టెన్షన్ వర్కర్‌గా పని చేస్త్తున్నాడు. గత ఏడాది క్రితం విజయనగరం జిల్లా ముసిరాం గ్రామంలో పని చేసిన ఇతడు బదిలీ ఇక్కడి వచ్చి కాశీపురం గ్రామంలోని నూకాలమ్మ గుడికి ఎదురుగా ఉన్న సిసిరోడ్డు చివరివీధిలో అద్దెకు ఉంటున్నాడు. అయితే శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో మారేపల్లి నుంచి పశువులకు వైద్యం చేయాలని ఫోన్ వచ్చింది. దీంతో ఆ ఇంటి పక్కన ఉన్న రంగశింగి కిరణ్‌కుమార్ అనే యువకుడ్ని సాయంతో మారేపల్లి వెళ్లారు. తిరిగి 10 గంటల సమయంలో కిరణ్‌కుమార్‌ను ఇంటి వద్ద దించి తన ఇంటి పక్కన ద్విచక్ర వాహనం ఉంచి ఇంటి ముందుకు వెళ్లే సరికి వెనుకనుంచి కత్తులతో ఆయనపై దాడి చేసి పరారయ్యారు. తలపై తీవ్ర గాయాలు తగిలి మూలుగుతుండగా పక్కనే ఉన్న ఉపాధ్యాయుడు ఎర్రయ్యదొర, మరో ఇంటి పక్కన ఉన్న రైతు అతని భార్యను లేపి మీ ఇంటి ముందు పెద్ద శబ్దం వచ్చిందని చెప్పడంతో వెంటనే ఆమె లైట్లు వేసి చూశారు. అప్పటికే రక్తపు మడుగులో కొన ఊపిరితో తన భర్త రాము కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే కె.కోటపాడు ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రమాద పరిస్థితిలో ఉందని వైద్యులు చెప్పడంతో అక్కడ నుంచి చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకువెళ్లారు. అప్పటికే రాము మృతి చెంది ఉన్నాడు. వెంటనే అనకాపల్లి డిఎస్‌పి ఎ.పురుషోత్తం, చోడవరం సిఐ వై.మురళీరావు, క్యూస్ టీం, పోలీసుల జాగిలాలతో సంఘటనా స్థలం చుట్టుపక్కల వారిని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. రాముకు గత మూడేళ్ల క్రితం రాంబిల్లి మండలం అప్పన్నపాలెంకు చెందిన రమాదేవితో వివాహం జరిగింది. ఏడాది వయస్సు కలిగిన కార్తీక్ అనే బాబు ఉన్నాడు. ఈ విచారణలో దేవరాపల్లి ఇన్‌చార్జి ఎస్‌ఐ పి.నరిశింహమూర్తి, సిబ్బంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పోలీసులు దర్యాప్తులో ఈ విచారణ తేలాల్సి ఉంది.

కడుపుకోత!
ఆనారోగ్యంతో ఇద్దరు చిన్నారులు మృతి
మరోకరికి తీవ్ర అస్వస్థత
మృతులు అన్నదమ్ములు
విషాదంలో బలియగుడ గిరిజన గ్రామం
డుంబ్రిగుడ, డిసెంబర్ 3: మండలంలోని కిల్లోగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో ఉన్న బలియగుడ ఆదిమజాతి గిరి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన పాంగి సోమేశ్వరరావు అనే గిరిజనుడికి ఐదుగురు సంతానం కాగా వీరిలో నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో పాంగి సత్తిబాబు (9), పాంగి శేఖర్ (12), పాంగి సింహాద్రి (4) అనే ముగ్గురు అన్నదమ్ములకు ఈ నెల 2వ తేదీన వాంతులు, పొట్టవాపు రావడాన్ని గమనించి పలు సపర్యలు చేశారు. ఇంతలో తీవ్ర అస్వస్థతకు గురైన సత్తిబాబు మృత్యువాతపడగా బోరున విలపించిన తల్లిదండ్రు లు అదే రోజు దహన సంస్కారాలు ముగించుకుని ఇంటికి చేరుకోగానే సాయంత్రం పాంగి శేఖర్‌కూడా మృతి చెందడంతో తల్లిదండ్రుల ఆర్తనాధానాలతో బలియగుడ గ్రామమంతా కన్నీటి సద్రంలో మునిగిపోయింది. కాగా, నాలుగు ఏళ్ల పాంగి సింహాద్రి తీవ్ర అస్వస్తతతో కొట్టమిట్టాడుతుండడాన్ని తెలుసుకున్న ఆ గ్రామ సామాజిక ఆరోగ్య కార్యకర్త సమీప కిలోగుడ పి.హెచ్.సి. వైద్యులకు సమాచారాన్ని అందించడంతో స్పందించిన వైద్యులు గ్రామాన్ని సందర్శించి వైద్య చికిత్సలపై విశాఖ కె.జి.హెచ్.కు తరలించారు. కె.జి.హెచ్.లో వైద్య సేవలు పొందుతున్న సింహాద్రికి పొట్టవాపు తీవ్రమవుతుందని తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఇలా ఒకే కుటుంబంలో ఇటువంటి సంఘటన చేసుకోవడం ఎంతో బాధాకరమని గ్రామస్థులు ఆవేదన వెలిబుచ్చారు. వాంతులు, పొట్టవాపు రావడానికి గల కారణాలను వైద్యులు నిర్థారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్థులు అంటున్నారు.
ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి
ఒకేరోజు ఇద్దరు అన్నదమ్ములు మృతి చెంది తీవ్ర శోకాన్ని మిగిల్చిన తల్లిదండ్రులు ఆర్థికసాయం అందించాలని, కె.జి.హెచ్.లో చికిత్స పొందుతున్న సింహాద్రికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మండల గిరిజన సంఘం అధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ అధికారులను కోరారు.

నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించండి
* విసిల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి గంటా
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 3: రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో విద్యార్థులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలని మానవవనరులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుంచి అన్ని యూనివర్శిటీల వైస్ ఛాన్స్‌లర్‌లతో శనివారం అయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో నగదు రహిత లావాదేవీల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరగడం ద్వారా నగదు కొరతను అధిగమించవచ్చన్నారు. ముఖ్యంగా విద్యార్థుల ద్వారా ఈ అంశానికి విశేష ప్రాధాన్యత కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అన్ని ప్రాంతాల్లో ఈ అంశంపై విద్యార్థులతో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని ప్రతి యూనివర్శిటీలోను నోడల్ అధికారులను నియమించాలన్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించి, అవగాహన పెంచాలన్నారు. యూనివర్శిటీలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని నగదు రహిత లావాదేవీలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాలు, ఉపాధి కూలీలు మొబైల్ వాడకం, డెబిట్ కార్డుల నివియోగంలో శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ల సమన్వయంతో విద్యార్థులు గ్రామాల్లో పర్యటించాలన్నారు. ఎయు విసి జి నాగేశ్వరరావు మాట్లాడుతూ నోడల్ అధికారిగా డాక్టర్ హరిప్రకాష్‌ను నియమించామన్నారు. డిసెంబర్ 1 నుంచి అన్ని కళాశాలల్లో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయం
అన్ని పాఠశాలల్లో సహిత క్లబ్‌లు
అంతరాలు తగ్గించేందుకు
సహకరించాలి
మంత్రి గంటా శ్రీనివాసరావు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 3: దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, సాధారణ వ్యక్తులతో వారికీ సమాన అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా అంతరాన్ని తగ్గిస్తున్నట్టు మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారంజరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం లో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్టు గుర్తించామన్నారు. ప్రభుత్వ పరంగా వీరిని ఆదుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 244 భవిత, 446 నాన్ భవిత కేంద్రాలను ఏర్పాటు చేసి, వారి అవసరాలకు అనుగుణంగా శిక్షణ, విద్యా బోధన చేస్తున్నట్టు వివరించారు. సాధారణ, దివ్యాంగుల పిల్లల మధ్య అంతరాలు తగ్గించేలా చేయడంతో పాటు దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రతి పాఠశాలలోను సహిత క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి గంటా ప్రకటించారు. కనీసం ముగ్గురు దివ్యాంగులు, మరో ముగ్గురు సాధారణ విద్యార్థులు ఈ క్లబ్‌లలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాధారణ పిల్లలు క్లబ్‌లో సభ్యులుగా ఉండటం వల్ల వారిని ప్రోత్సహించాలన్నది లక్ష్యమన్నారు. దివ్యాంగులను ఆర్థికంగా ఆదుకునే క్రమంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నెలా రూ.1,500 పింఛన్ అందజేస్తున్నామని, దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచినట్టు తెలిపారు.
బడి రుణం తీర్చుకోండి
చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సహకరిస్తూ ప్రతి ఒక్కరూ బడి రుణాన్ని తీర్చుకోవాలని మంత్రి గంటా విజ్ఞప్తి చేశారు. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్న ‘బడి రుణం తీర్చుకోండి’ పోస్టర్‌ను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రాష్ట్రంలో 5వేల డిజిటల్ తరగతులను ప్రారంభించాలనే లక్ష్యంతో తాము చేపట్టిన కార్యక్రమానికి ప్రవాస భారతీయుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు ముందుకు వచ్చి ఇతోధికంగా విరాళాలు అందజేస్తున్నారని తెలిపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తాము చదువుకున్న బడి రుణం తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంధ సంస్థలు కూడా ముందుకు రావడం అభినందనీయమన్నారు. దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వారికి దక్కేలా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్ ప్రత్యేక ప్రాజెక్టు డైరెక్టర్ జి శ్రీనివాస్ మాట్లాడుతూ బడి రుణం తీర్చుకోండి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటి వరకూ రూ.20 లక్షలు విరాళాలుగా అందాయని, మరో రూ.3 కోట్లు అందజేసేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారన్నారు. కోరమాండల్ కర్మాగారం ఆర్థిక సహకారంతో దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను ఈ సందర్భంగా మంత్రి గంటా చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోరమాండల్ జిఎం రవి కిరణ్, జిల్లా వికలాంగ సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు విద్యార్థులు పాల్గొన్నారు.

గిరిజనాభివృద్ధికి కృషి
గిరిజన సంక్షేమ మంత్రి రావెల
విశాఖపట్నం, డిసెంబర్ 3: గిరిజనుల ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం తో పాటు వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నా రు.నగర పరిధిలోని మేహాద్రిగెడ్డ ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌లో రూ.5.22 కోట్లతో నిర్మించిన భవన సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైబల్ సబ్‌ప్లాన్ నిధులతో గిరిజన ప్రాంతాల్లో విద్య,వైద్య సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు. షెడ్యూల్ కులాలు, తెగల విద్యార్థులకు వసతి గృహాల్లో సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వారి తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు రూ.80 కోట్లతో భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. అనంతరం మంత్రి రావెల పెందుర్తి మండలం వేపగుంటలో రూ.3 కోట్ల ఐఎపి నిధులతో నిర్మించిన గిరిజన యువత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 28 యువత ఉపాధి కేంద్రాలను ఒక్కొక్కటి రూ.4 కోట్ల నిధులతో నిర్మించామన్నారు. త్వరలోనే మరో 12 భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదించామన్నారు. గిరిజనులకు చదువుతో పాటు శిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇంత వరకూ ఫైబర్ ఆప్టికల్స్ ద్వారా 30 పాఠశాలలకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పించామని, త్వరలోనే గిరిజన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 200 మంది గిరిజన విద్యార్థులు విదేశీ చదువుల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లారని గుర్తు చేశారు. వీరికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందన్నారు. మాజీ మంత్రి, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం టిడిపి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అన్నారు. అనంతరం మంత్రి రావెల చేతుల మీదుగా 804 మంది అర్హులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రవి పట్టన్ శెట్టి, ఇ ఆదినారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రమణమూర్తి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి మహాలక్ష్మి, మేహాద్రిగెడ్డ కళాశాల ప్రిన్సిపల్ ఉమా మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

నర్సరీల అభివృద్ధికి రూ. 15 కోట్లు
సబ్బవరం, డిసెంబర్ 3: జిల్లాలో సామాజిక అడవుల పెంపకానికి అవసరమైన నర్సరీలను తయారు చేసేందుకు సుమారు 15 కోట్ల రూపాయల ఉపాధి నిధులు ఖర్చుచేస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి సిహెచ్ సూర్యనారాయణపడాల్ అన్నారు. శనివారం ఇక్కడికి వచ్చిన ఆయన స్థానిక విలేఖర్లతోమాట్లాడారు. వనం- మనం శీర్షికన జిల్లాలో ప్రతీ శనివారం ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని, ప్రతీ నాల్గవ శనివారం మొక్క ల పెంపకంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.అలాగే విద్యాశాఖా పరంగా డిఇవో విద్యార్థుల విజ్ఞాన యాత్రలు(9వ తరగతి విద్యార్థులు) 35వేల రూపాయల చొప్పున ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. అలాగే తమశాఖ తరపున కూడా విజ్ఞాన యాత్రలు నిర్వహిస్తామన్నారు. ప్రభు త్వ పాఠశాలలకు ప్రహరీ లేని సుమా రు 126 చోట్ల బయోఫెన్సింగ్‌లు గత యేడాది నిర్మించామన్నారు.ఇప్పటి వర కు జిల్లాలో 88 లక్షల మొక్కలు నాట డం జరిగిందన్నారు. దీనికి ఎన్‌ఆర్‌ఇజిఎస్, డిఆర్‌డిఎ, డ్వామా పిడిలు సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ యేడాది మరో 148 లక్షల మొక్కలు నా టేందుకు లక్ష్యంగానిర్ణయించామన్నా రు. సుమారు 100 కిలోమీటర్ల పొడవున రోడ్లకిరువైపుల మొక్కలు పెంపకం చేపట్టామన్నారు. 2017-2018 నాటికి 1.48 కోట్ల మొక్కలను నర్సరీల్లో పెంచుతామన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో కాజలీనా, జీడిమామిడి, బాదం,గంగరావి చెట్లు పెంచుతున్నామనితెలిపారు.