విశాఖపట్నం

పేదల ఆరోగ్యంతో చెలగాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 9: నిరపేదల ఆరోగ్యంతో టిడిపి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆరోగ్య శ్రీ (ఎన్‌టిఆర్ వైద్య సేవ)ని నిర్వీర్యం చేస్తున్న టిడిపి తీరుపై పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అన్ని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఏటా కోటిన్నర కుటుంబాలు ఈ పథకం కింద వైద్య సేవలు పొందేవని గుర్తు చేశారు. కార్పొరేట్ వైద్యం కోసం లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే నిరుపేదలు నేరుగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందేవారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన అనంతరం ఆరోగ్య శ్రీకి ఎన్‌టిఆర్ పేరుపెట్టుకుందని, అయితే సామాన్యులకు మాత్రం వైద్యం అందట్లేదని ఆరోపించారు. కావాలనే ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. వైద్య సేవలందించిన ఆసుపత్రులకు నిధులు విడుదల చేయకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని, పాత బకాయిలు వసూలు కాకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు సేవలందించేందుకు ఇష్టపడట్లేదని అన్నారు. గత తొమ్మిది నెలలుగా ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగు పరచకుండా, వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అండ్‌కో రాష్ట్రాన్ని దోచుకుంటోందని మంత్రులు అవినీతికి పాల్పడుతూ కోట్లు కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు. తన రాజకీయ వారసునిగా లోకేష్‌ను తెరపైకి తెచ్చేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. కూడబెట్టిన కోట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్నది వ్యూహంగా పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యసేవలందించేందుకు విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (విమ్స్)ను నిర్మిస్తే ప్రస్తుతం ప్రభుత్వం దాన్ని ప్రైవేటు పరం చేసే దిశగా టిడిపి యత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందుకు ఇచ్చిన హామీలను అమలు చేయుకుండా టిడిపి ప్రభుత్వం ప్రజలను మోసగించిందన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.2000 భృతి కల్పిస్తామని హామీ ఇచ్చిందని ఎంతమందికి చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు పాలించే అర్హత లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, పార్టీ నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, కొయ్య ప్రసాదరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పసుపులేటి ఉషాకిరణ్ తదితరులు పాల్గొన్నారు.