విశాఖపట్నం

వివిధ బ్యాంకుల నుండి నకిలీ బంగారం పెట్టి రూ.15కోట్లు స్వాహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 9: నకిలీ బంగారు ఆభరణాలు తనఖా పెట్టి బ్యాంక్ నుండి రూ.ఐదు కోట్లు కాజేసిన కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతుంది. ఇందుకు సంబంధించి 12మందిని ఎమ్‌విపిజోన్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
నగరంలోని ఎమ్‌విపి డబల్‌రోడ్డు జంక్షన్ వద్ద గల కోటక్ మహేంద్ర బ్యాంక్ నుండి నీలం మాధవశశి నకిలీ బంగారు ఆభరణాలను తనఖా పెట్టి రూ.ఐదు కోట్లు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బ్యాంక్ మేనేజర్ లక్ష్మిశ్రీనివాస్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మాధవశశితో పాటు మరో పదకొండు మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే వీరంతా ఒక్క కొటక్ మహేంద్ర బ్యాంక్ నుండే కాకుండా ఇతర బ్యాంక్‌లకు కూడ ఇదే విధంగా టోపి పెట్టినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించినట్టు తెలిసింది. మొత్తంగా బ్యాంక్‌లకు వీరు కుచ్చుటోపి పెట్టింది సుమారుగా రూ.పదిహేను కోట్లకు పైగా ఉండడంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు నివ్వెరపోయినట్టు తెలిసింది. బంగారాన్ని బ్యాంక్‌లో తనఖా పెట్టినప్పుడు బంగారం నకిలీదా, అసలుదా అనేది బంగారం దుకాణంలో పని చేస్తున్న వ్యక్తి పరిశీలించి నిర్ధారిస్తారు. మద్దిలపాలెంలోని ఓ ధియేటర్ యజమానికి చెందిన బంగారు దుకాణంలో పని చేస్తున్న వ్యక్తి నిందితులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను తప్పుడుగా పరిశీలించడంతో సదరు వ్యక్తిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఈ వ్యక్తిని కేసు నుండి తప్పించాలని పోలీసులపై సదరు ధియేటర్ యజమాని రాజకీయ నాయకుల పలుకుబడితో ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు తెలిసింది. అంతే కాకుండా బిజెపి పార్టీ లోగోలతో ఉన్న రెండు కార్లను పోలీసులు ఈ కేసులో శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కేసులోని నిందితుల్లో కొంతమందిని తప్పించడానికి కొంతమంది ప్రముఖులు పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఏది ఏమైనా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను శనివారం మీడియాకు తెలియజేసి, అనంతరం నిందితులను కోర్టు ద్వారా జైలుకు తరలించడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.