విశాఖపట్నం

యంత్రాంగం అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 10: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్తా తుపాను శనివారం సాయంత్రానికి పెను తుపానుగా మారడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై పెద్దగా ఉండనప్పటికీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలుగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. తుపాను చెన్నై సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసినప్పటికీ తీరం వెంబడి గాలులు ఉద్ధృతంగా వీస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తూర్పునౌకాదళానికి చెందిన 20 బోట్లను అత్యవసర సేవల నిమిత్తం అందుబాటులో ఉంచారు. తీర ప్రాంత మండలాల్లో ఎమ్మార్వోలు, ఎంపిడిఓలు, గ్రామాధికారులను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు.