విశాఖపట్నం

వుడా చేతికి మరో భారీ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 11: సుమారు 13,500 కోట్ల వ్యయంతో 42.5కిలోమీటర్ల మేర విశాఖ మెట్రోరైల్ నిర్మించాలని, అందుకు అనుగుణంగా ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి) ఆధ్వర్యంలో సమగ్ర పథక నివేదిక (డిపిఆర్) రూపొందించారు. మూడు కారిడార్లుగా 35 స్టేషన్లతో మెట్రోరైల్ ప్రాజెక్టు డిపిఆర్ కేంద్ర ఆమోదాన్ని పొందింది. మొదటి కారిడార్ కొమ్మాది నుంచి గాజువాక వరకూ 30.38 కి.మీగాను, రెండో కారిడార్ గురుద్వార నుంచి పాతపోస్ట్ఫాసుకు 5.2 కిమీగాను, మూడో కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరుకు 6.9 కిమీగాను నిర్ణయించారు. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను పక్కన పెడితే దాదాపు రూ.12వేల కోట్లు భరించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించేందుకు తొలుత జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) విశాఖ మెట్రోలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే ప్రాజెక్టు నిర్వహణ లాభ,నష్టాల అంచనాలు పరిశీలించి జైకా నిరాకరించడంతో జర్మనీకి చెందిన ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థను ప్రభుత్వం సంప్రదించింది. ఇక్కడ కూడా సానుకూల స్పందన కన్పించకపోవడంతో ఇక ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును ఏదోవిధంగా చేపట్టేందుకు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగానే వుడాకు ఈ భారీ ప్రాజెక్టును కట్టబెట్టే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. వేల కోట్ల ఖర్చయ్యే ప్రాజెక్టును వుడా చేపట్టగలదా అన్న సందేహాలు తలెత్తుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించుకుని ప్రాజెక్టుకయ్యే మొత్తాన్ని సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. గతంలో ప్రభుత్వ భూములను విక్రయించి బడ్జెటరీ సపోర్టుగా నిధులను సమకూర్చిన వుడా అదే తరహాలో మెట్రో ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది అంత సులభంగా జరిగే వ్యవహారం కాదు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకు నిధులు సమకూర్చుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదన్నది నిపుణుల అనుమానం. ఇప్పటికే పలు ప్రాజెక్టులను పూర్తి చేయలేక, చేతులెత్తేస్తున్న వుడాకు మెట్రోరైల్ ప్రాజెక్టు తలకుమించిన భారమే అవుతుందని వీరు భావిస్తున్నారు.