విశాఖపట్నం

17న నగరానికి సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 11: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న విశాఖ నగరంలో పర్యటించనున్నారు. 17న ఉదయం ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకునే ముఖ్యమంత్రి రాత్రి 9 గంటలకు తిరిగి వెళ్తారు. 12 గంటల వ్యవధిలో చంద్రబాబు ఆరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నిర్మించిన చిల్డ్రన్స్ ఎరీనాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ప్రారంభించి, అనంతరం కొద్దిసేపు చిల్డ్రన్స్ థియేటర్‌లో చిత్ర ప్రదర్శన తిలకిస్తారు. అక్కడ నుంచి 10.30 గంటలకు ఎయు ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌కు చేరుకుని 68వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొంటారు. అక్కడ నుంచి నేరుగా రుషికొండ ఐటి సెజ్‌కు చేరుకుంటారు. ఇక్కడ ఫిన్‌టెక్ వ్యాలీని ప్రారంభించి, ఐటి సిఇఓలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా పలు ఐటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం పూర్తి చేస్తారు. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు పోర్టు కళావాణి ఆడిటోరియంకు చేరుకుని, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో సుప్రీం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కలిసి పాల్గొంటారు. అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఎయు గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విండ్ ఫెస్టివల్ (సంగీత ఉత్సవం) ప్రారంభిస్తారు. కొద్ది సేపు ఇక్కడ కార్యక్రమాలను తిలకించిన అనంతరం ఎయు పూర్వ విద్యార్థుల సమ్మేళనం (అలూమిన)లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 9 గంటలకు విజయవాడ తిరిగి వెళ్తారు. 12 గంటల కాల వ్యవధిలో సిఎం చంద్రబాబు 6 కార్యక్రమాల్లో పాల్గొననున్న దృష్ట్యా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సిఎం చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సుప్రీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అదే రోజు నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో భద్రతా పరంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.