విశాఖపట్నం

క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 11: ఉరుకుల పరుగుల జీవితంలో క్రీడలను మనిషి దూరం చేసుకుని, ఆరోగ్య సమస్యలతో ప్రశాంతతను కోల్పోయి సమస్యలకు దగ్గర అవుతున్నాడని ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడిసిఎల్) చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ అన్నారు. ఆదివారం పోర్టు కళావాణి స్టేడియం వేదికగా నిర్వహించిన ఏపీ విద్యుత్ సంస్థల క్రీడాసమితి ఆధ్వర్యంలో 9వ తేదీన ప్రారంభమైన వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు వత్తిడి ఇనుండి ఉపశమనం కలిగిస్తాయని, అధిక వత్తిడిలో పనిచేసే విద్యుత్ సిబ్బందికి క్రీడలు మరింత అవసరమన్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు మనిషిని వ్యక్తిగత జీవితం నుండి అన్నివిధాలుగా దూరం చేస్తున్నాయన్నారు. ఆరోగ్యికరమనైన జీవితం కావాలంటే క్రీడలకు మనలో భాగం చేసుకోవాలన్నారు. గతంలో తాను విజయనగరం కలెక్టర్‌గా ఉన్నపుడు విజ్జి స్టేడియం అభివృద్ధికి కృషిచేసినట్టు తెలిపారు. అక్కడ వెయిట్‌లిప్ట్‌లో శిక్షణ పొందిన కొండవెలగాడక చెందిన మత్స సంతోషి అంతర్జాతీయ స్థాయిలో వెండి పథకం చేజిక్కించుకుందన్నారు. మంచి ఆరోగ్యం, ఆహ్లాదకర వాతావరణం ఉండాలంటే క్రీడలను జీవితంలో భాగం చేయాలన్నారు. మన పిల్లలకు, తరువాత తరాలవారికి క్రీడలపై ఆసక్తి పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఏపీఇపీడిసిఎల్, ఏపీఎస్‌పిడిసిఎల్, ఏపిట్రాన్స్‌కో, ఏపీజెన్‌కో విద్యుత్ సంస్థలి తరపున టోర్నమెంట్‌లి పాల్గొన్న 14 బృందాలు మంచి ప్రతిభ కనబరిచాయన్నారు. గెలుపు, ఓటమిలలేని ముఖ్యంకాదన్నారు. క్రీడాస్ఫూర్తిద్వారా బృంద సహకారం, ఆత్మవిశ్వాసం సొంతమవుతున్నాయన్నారు. రాష్టస్థ్రాయి క్రీడలను ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందించారు. డైరెక్టర్ (ఆపరేషన్స్) బొడ్డు శేషుకుమార్ మాట్లాడుతూ టోర్నమెంట్‌లో పాల్గొన్న ప్రతి బృందం అద్భుతమైన ప్రతిభ కనబరిచారన్నారు. క్రీడలు ఆరోగ్యమే కాకుండా సంపదని అందిస్తాయన్నారు. క్రీడలో ఉన్నత స్థాయిలో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్రీడలను ఇటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించినందుకు అందర్ని అభినందించారు. క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించాలన్నారు. విశాఖపట్నం సర్కిల్ ఎస్‌ఇ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విశాఖపట్నం వేదికగా రాష్టస్థ్రాయి పోటీలు నిర్వహించడంపై ఆనందం వ్యక్తంచేశారు. ఎప్పటినుంచో ప్రయత్నిస్తే ఈ అవకాశం దొరికిందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడా నిర్వహణ జరిగిందన్నారు. అనంతరం క్రీడల నిర్వహణలో పూర్తి సహకారం అందించి, లోటుపాట్లు లేకుండా చూసుకున్న విశాఖపట్నం సర్కిల్ ఎస్‌ఇ సత్యనారాయణిమూర్తికి సిఎండి ఎమ్‌ఎమ్ నాయక్ చేతులమీదుగా సన్మానించారు. అనంతరం విజేతలైనట్టు వంటి డాక్టర్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ (ఎన్‌టిపిసి) బృందం, విజయవాడ వారికి ప్రథమ బహుమతి, రాయలసీమ థర్మల్ పవర్ బృందం (ఆర్‌టిపిసి), కడప ద్వితీయ బహుమతి, ఏపీఈపీడిసిఎల్ రాజమండ్రి సర్కిల్ తృతీయ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోర్టుక్రీడా అధికారి మాణిక్యం, ముఖ్య ఎంపికి రమణ, క్రీడా సమితి నిర్వాహకులు వడివేలు, టివిఎస్‌ఎన్ మూర్తి, డిఇలు, ఏడిఇలు, ఇతర అధికారులు 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.