విశాఖపట్నం

మహాలక్ష్మీ నమోస్తుతే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 15: విశాఖవాసుల ఆరాధ్యదైవం, ఉత్తరాంధ్ర ప్రజానీకం ఇలవేల్పు, పాత నగరం బురుజుపేటలో కొలువుతీరిన శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవంలో భాగంగా మూడో గురువారం అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించిన అమ్మవారి పూజలు గురువారం విశేష పంచామృతాభిషేకసేవ, సహస్రనామార్చన పూజ, స్వర్ణ్భారణ అలంకరణ నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారికి రాజభోగం చేపట్టారు. సాయంత్రం కుంకుమపూజలు అనంతరం విశేష పూజలు చేశారు. అలాగే ఆలయ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్ని అలరించాయి. దేవాలయ పరిసరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఆలయ ఇవో ఎస్‌జె మాధవి అన్ని ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలించారు. క్యూ లైన్‌లో ఉన్న భక్తులకు మజ్జిగ ఆహార పదార్ధాలను అందజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు క్యూలైన్‌లో ఉండి అమ్మవారిని దర్శించుకోవడంతో కొత్త వరకు ట్రాఫిక్ స్తంభించింది.