విశాఖపట్నం

లాటరీ పద్ధతే ఉత్తమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 29: లాటరీ ద్వారా ప్రభుత్వ భూములు కేటాయిస్తే సామాన్యులకు ప్రయోజనకరంగా ఉంటుందని విశాఖ పార్లమెంటు సభ్యులు డాక్టర్ కంబంపాటి హరిబాబు అన్నారు. బిజెపి విశాఖ మహానగర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య ప్రసంగం చేస్తూ విశాఖపట్నం నరగాభివృద్ధి సంస్థ, విశాఖ నగర, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడమైందన్నారు. ప్రణాళికాబద్ధంగా, విశాఖ నగరంలో కొత్త రోడ్లు నిర్మాణం చేపట్టి, కొత్త ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలు కల్పించడానికి, గృహ నిర్మాణ స్థలాలను అందరికీ అందుబాటులో కల్పించేందుకు 1978 లో ఏర్పడిందన్నారు. ఇందులోభాగంగా ఎంవిపి కాల నీ, మధురవాడ మిథిలాపురికాలనీ, కూర్మన్నపాలెం రాజీవ్‌నగర్ వంటి ప్రాంతాలు అభివృద్ధి జరిగాయన్నారు. ఇటీవలకాలంలో నగరంలో వుడా వారు వేసిన వేలం వలన రియల్‌ఎస్టేట్ వ్యాపారం పెరిగి భూముల ధఱలు సామాన్యునికి అందుబాటులో లేని విధంగా పెరిగాయన్నారు. కేవలం వ్యాపార దోరణిలో భూములను సేకరించి ప్లాట్లుగా వేసి వాటిని వేలం ద్వారా ఎక్కువ ధరలకు అమ్ముకొని ప్రభుత్వానికి రాబడి చూపే సంస్థగా మారి ఈ మధ్యకాలంలో ఎన్నో విమర్శలకు ప్రజల ఆగ్రహానికి గురికావడం జరిగిందన్నారు. బిజెపి గతంలో కూడా వేలంపాటను వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేపట్టడం, ఆందోళన చేయడం అరెస్టులు కావడం వంటి విషయాలు తెలిసిందేనన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సామా న్య ప్రజానీకానికి వచ్చ 2022 ఏడాదికి దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలని కృషి చేస్తున్న సందర్భంలో వుడా వ్యాపార ధోరణి మానుకొని ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలని ప్రభుత్వభూములు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సామాన్య ప్రజలకు చిల్లర వర్తకులకు ప్రభుత్వ, ప్రైవేటురంగంలో పనిచేసే కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా, విశాఖ నగరం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను సేకరించి వాటిని అభివృద్ధిపరిచి అర్హత ఆర్థిక పరిస్థితిని దృష్టిలోపెట్టుకుని సరసమైన ధరను నిర్ణయించి కేవలం లాటరీ ద్వారా కేటాయిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఈ విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.