విశాఖపట్నం

బాక్సుల్లో భవితవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 10: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవనర్గానికి గురువారం జరిగిన ఓటింగ్‌లో మొత్తం 69.8 శాతం ఓట్లు పోలయ్యాయి. విశాఖ జిల్లాలో 68.5 శాతం, విజయనగరం జిల్లాలో 70.46 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 72.70 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరి భవితవ్యం 492 బ్యాలెట్స్ విశాఖలోని స్వర్ణ్భారతి స్టేడియంలోని స్ట్రాంగ్ రూంలోకి చేరుకున్నాయి. విశాఖ జిల్లా నుంచి 278 బాక్స్‌లు, విజయనగరం జిల్లా నుంచి 102 బాక్స్‌లు, శ్రీకాకుళం జిల్లా నుంచి 112 బాక్స్‌లు ఇక్కడికి చేరుకున్నాయి. వీటిని భద్రపరిచిన గదుల వద్ద ఎనిమిది సిసి కెమేరాలను ఏర్పాటు చేశారు. అలాగే సెంట్రల్ ఆర్మ్‌డ్ సిబ్బంది, స్థానిక పోలీసులు 24 గంటలు నిఘాతో పహారా కాస్తున్నారు. ఈ మూడు జిల్లాలో పోలింగ్ సరళిని ఒక్కసారి పరిశీలిస్తే.. ఈ ఎన్నికలో 1,55,993 ఓట్లు ఉండగా, లక్షా ఎనిమిది వేల 874 ఓట్లు వినియోగించుకున్నారు. వీరిలో 74 వేల 895 మంది పురుషులు కాగా, 33 వేల 979 మంది మహిళలు ఉన్నారు. విశాఖ జిల్లాలో 61 వేల 657 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 40 వేల 83 మంది పురుషులు, 21 వేల 574 మంది మహిళలు. విజయనగరం జిల్లాలో 24 వేల 404 మంది ఓటు వేశారు. వీరిలో 17 వేల 592 మంది పురుషులు, ఆరు వేల 812 మంది మహిళలు. శ్రీకాకుళం జిల్లాలో 22 వేల 813 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 17 వేనల 220 మంది పురుషులు కాగా, ఐదు వేల 593 మంది మహిళలు. 20వ తేదీన ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి శిక్షణ ముమ్మరంగా జరుగుతోంది. కాగా, 162 పోస్టల్ బ్యాలెట్‌లను జారీ చేశారు. ఈ బ్యాలెట్‌లను సిబ్బంది 20వ తేదీ ఉదయం ఆరు గంటల్లోగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద బాక్స్‌ల్లో గానీ, కౌంటింగ్ సెంటర్ వద్ద ఉంచిన బాక్స్‌లో గానీ వేయాలని జిల్లా కలెక్టర్ తెలియచేశారు.