విశాఖపట్నం

ఫోన్ కొట్టు పన్ను కట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 24: ఇంటిపన్ను, నీటి పన్ను ఏది కట్టాలన్నా సులభతరమైన మార్గం అందుబాటులోకి రానుంది. ఒక ఫోన్ కాల్ చేస్తే సిబ్బంది నేరుగా మీ ఇంటికి వచ్చి పన్నులు వసూలు చేసి రశీదు ఇచ్చి వెళతారు. దీనికోసం ఎపి ఇపిడిసిఎల్‌తో మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) ఒప్పందం కుదుర్చుకుంది. ఇపిడిసిఎల్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎనీ ఇఎంఐ సంస్థ దీనికి వేదిక కానుంది. డిజిటల్ విధానంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న ఈ విధానం ద్వారా ఇక మీదట ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు సులభతరం అవుతాయని జివిఎంసి అదనపు కమిషనర్ (ఫైనాన్స్) ఎస్‌ఎస్ వర్మ తెలిపారు. రెండు ఫోన్ నెంబర్లను ఇందుకు కేటాయించామన్నారు. ఎవరైనా పన్ను చెల్లించ దలచిన వారు 8008615500 లేదా 80086 12200 నెంబర్లకు ఫోన్ చేస్తే ఇపిడిసిఎల్ సిబ్బంది డిజిటల్ విధానంలో సేవలందిస్తారన్నారు. ఇపిడిసిఎల్ సిబ్బంది యూనిఫాంతో పాటు సంస్థ జారీ చేసే గుర్తింపు కార్డుతో మీ ఇంటికి వచ్చి బిల్లు మొత్తాన్ని తీసుకుని రశీదు ఇస్తారని తెలిపారు. చెల్లించిన పన్ను వివరాలు యజమాని సెల్‌ఫోన్‌కు ఎసెమ్మెస్ రూపంలో సమాచారం వస్తుందన్నారు. వేగవంతమైన, సులభతరమైన, సురక్షితమైన ఈ అవకాశాన్ని జివిఎంసి పరిధిలోని ఆస్తిపన్ను దారులు వినియోగించుకోవాలని సూచించారు.
ప్రస్తుతం జివిఎంసికి రెండో అర్ధసంవత్సరం ఆస్తిపన్ను చెల్లించాల్సిన గృహ యజమానులు ఈ విధానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎటువంటి శ్రమ లేకుండా మీ ఇంటి వద్దే పన్ను చెల్లించే వెసులు బాటు జివిఎంసి కల్పిస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.