విశాఖపట్నం

చండ ప్రచండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/అనకాపల్లి, ఏప్రిల్ 30: భానుడు భగ్గుమంటున్నాడు...నగరంలో నిప్పులు రాలుతున్నాయి...ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు...మరోపక్క వేడిగాలులు...విశాఖ నగరంలో ఆదివారం 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణం కంటే ఏకంగా ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికమని విశాఖప ట్నం వాతావరణ హె చ్చరిక కేంద్రం పే ర్కొంది. దీంతో ప్రజ లు విలవిల్లాడుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే వేడిగాలులు, ఎండ తీవ్రతతో రోడ్డెక్కేందుకు జనం భయపడాల్సి వచ్చింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఇళ్ళ నుంచి బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఎండల తీవ్ర త పెరగడంతో మాంసం దుకాణాలు, వాణిజ్య సముదాయాలు బోసిపోతూ కనిపించాయి. రోజురోజుకీ పెరుగుతు న్న ఎండల తీవ్రతతో వ్యాపారాలు పడిపోతున్నాయి.నిర్మాణ రంగాల్లో పనిచేసే కూలీలు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పనులు చేయాల్సి వస్తోంది.
* రోగులతో నిండిపోతున్న క్లినిక్‌లు...
ఎండల తీవ్రతతో నీరసించిన, సాధారణ జ్వరాలు, కీళ్ళనొప్పులతో బాధపడే అనేకమంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రులకు చేరుతున్నారు. గత రెండు రోజులుగా నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ఇదే పరిస్థితి. అనారోగ్య పరిస్థితులతో బాధపడే మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎక్కువ శాతం మంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. మరోపక్క ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఎండలు ప్రాణసంకటంగా మారుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు నరకం చూడాల్సి వస్తోంది.
* సాగరంలో సేదతీరిన జనం...
ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఏమాత్రం తగ్గని భానుడు ప్రతాపంతో నగరవాసులు, శివారుప్రాంతాలకు చెందిన వారు విలవిల్లాడుతున్నారు. దీంతో కాస్తంత సేదతీరేందుకు ఆదివారం సెలవు దినం అయ్యినందున వీరంతా సాగరతీరానికి చేరుకున్నారు. దీంతో భీమునిపట్నం నుంచి ఎర్రమట్టిదిబ్బలు, రుషికొండ, సాగర్‌నగర్, వుడాపార్కు, వైఎంసిఏ, ఆర్‌కె బీచ్, కోస్టల్ బ్యాటరీ సాగరతీర ప్రదేశాల్లో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది. కాస్తంత సేరడం, స్నానాల చేయడం, బీచ్ వద్ద కొద్దిసేపు గడుపుతూ ఉల్లాసాన్ని పొందే పర్యాటకులు, సందర్శకులతో ఈ ప్రాంతం కిటకిటలాడుతోంది. యువకులు, మహిళలు మధ్యాహ్నం నుంచే సాగరతీరానికి చేరుకోవడం ప్రత్యేకమైంది.