విశాఖపట్నం

పంచగ్రామాల భూ సమస్యపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మే 15, పంచగ్రామాల ప్రజలకు, సింహాచలం దేవస్థానానికి ఏళ్ళ తరబడి నలుగుతున్న భూ సమస్య పరిష్కారం కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్ స్పష్టం చేసారు. సింహగిరి పై ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడారు. భూ సమస్యకు సంబంధించి పెందుర్తి నియోజక వర్గం పరిధిలోని ఆధిక శాతం బాధితులు ఉన్నారని ఆయన అన్నారు. భూ సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చి టిడిపి అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. ఆరునెలల్లో సమస్య పరిష్కారం కాకపోతే పదవులకు రాజీనామాలు చేస్తామని శాసన సభ్యులు హామీలిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేసారు. మూడేళ్ళయినా ప్రభుత్వం పరిష్కార మార్గం చూపలేదని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసిపి పెందుర్తి నియోజక వర్గం సమన్వయ కర్త అదిప్‌రాజు భూసమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవదిక నిరాహార దీక్ష చేస్తున్నారని ఇందులో భాగంగానే సింహాచలేశుని ఆశీస్సులు తీసుకున్నామని ఆయన చెప్పారు. భీమిలి నియోజక వర్గానికి అదనపు ఇన్‌చార్జి నియామకం పై విలేఖరులడిగిన ప్రశ్నకి స్పందించిన అమర్‌నాధ్ అధిష్టానం ఆదేశాలు ఎవరైన శిరసా వహించాల్సిందేనని అన్నారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా అధినాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆ విషయం సీతారాం కూడా స్వాగతించారని ఆయన చెప్పారు. నియోజక వర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నవారే రానున్న ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉంటారనుకోవడానికి వీల్లేదని నాయకత్వ లక్షణాలు, పార్టీని నడిపించే విధానాన్ని అనుసరించే అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని అమర్‌నాధ్ తెలియజేసారు. నియోజ వర్గాల పునర్విభజన అంశాన్ని చట్టంలో పెట్టినప్పటికీ అనేక సార్లు మంత్రులు, ఎంపిలు ఇచ్చిన ప్రకటనలు పరిశీలిస్తే ఇప్పటిలో ఇ వ్యవహరం తేలేది కాదన్న విషయం అర్థమవుతోందని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన తనయుడు మంత్రి లోకేశ్ చేస్తున్న ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టేవిగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
* జాడలేని స్థానిక నేతలుః వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నేతలెవ్వరూ సోమవారం జిల్లా అధ్యక్షుడి వెంట కానరాలేదు. భీమిలి నియోజక వర్గానికి అదనపు ఇన్‌చార్జిగా వేరొకరిని నియమించడంతో తమ పదవులకు రాజీనామాలు చేసిన వైసిపి నాయకులు ఇంకా అలకలు వీడలేదు. అమర్‌నాధ్ ఎప్పుడొచ్చిన కచ్చితంగా కలిసే స్థానిక నాయకులు రాకపోవడం చర్చనీయాంశమైంది. అమర్‌నాధ్ మాత్రం అధిష్టానం నిర్ణయాన్ని సీతారాం స్వాగతించారని ప్రకటించడం విశేషం కాగా అదే నిజమైతే స్థానిక నాయకులు వెంటుండాలి కదా అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు.
స.హ చట్టంపై అవగాహన అవసరం

విశాఖపట్నం, మే 15: సమాచార హక్కు చట్టంలో నిబంధనలు, సవరణలు, కమిషన్ల తీర్పులపై జిల్లా అధికారులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్‌లో స.హ చట్టం అమలు తీరుపై జిల్లా అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. సమాచార కమిషన్లు, న్యాయ స్థానాలు ఇస్తున్న తీర్పులను ఆయా శాఖలు అమలు జరిగేలా చూడాలని సూచించారు. సహ చట్టం జిల్లా కమిటీ సభ్యుడు కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్గించేందుకు ప్రతి సమీక్షా సమావేశం అజెండాలోను ఈ అంశాన్ని చేర్చాలన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ తదుపరి సమావేశాల్లో దీనిపై అజెండాలో చోటుకల్పిస్తామన్నారు. సహ చట్టం అమల్లో పిఐఓలకు శిక్షణ ఇప్పించనున్నట్టు హామీ ఇచ్చారు. జివిఎంసి, వుడా కార్యాలయాల్లో సహ చట్టంపై అవగాహన కలిగేలా నినాదాలు రాస్తున్నారని, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇదే విధంగా అమలు చేయాలని సూచించారు.
సహ చట్టంలోని పలు సెక్షన్ల వివరాలు తెలిపేలా ప్రచారం చేయాలని మంత్రి శ్యాంప్రసాద్ సూచించగా, అవసరమైన చర్యలు తీసుకోవాలని డిఆర్‌ఓ చంద్రశేఖరరెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సిఇఓ జయప్రకాష్ నారాయణ, డిఎస్‌ఓ నిర్మలా భాయి, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.