విశాఖపట్నం

గందరగోళ బదిలీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, మే 15: రాష్ట్ర ప్రభుత్వం అన్నిశాఖల్లో సాధారణ బదిలీలు చేపట్టాలని ప్రత్యేక జీవో జారీ చేసింది. అయితే కొన్ని శాఖలకు ఆయా విభాగాల్లో ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వడంతో బదిలీల ప్రక్రియ అయోమయంగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వైద్య,ఆరోగ్యశాఖ ఇచ్చిన ప్రత్యేక మార్గదర్శకాలకు సంబంధం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టాలంటే జీవో నెంబరు 64ను విడుదల చేసింది. అయితే ఈ జివోలో చేపట్టాల్సిన నియమ,నిబంధనలు కౌనె్సలింగ్ తేదీలు ఎప్పటిలోపు చేపట్టాలనే అంశాలను పేర్కొంది. ఇంతవరకు బాగానే ఉన్నా వైద్య,ఆరోగ్యశాఖ ఈ నెల ఆరో తేదీన ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందిస్తూ జీవో నెంబర్ 318ని విడుదలచేసింది. ఈ జివోలో గతంలో విడుదల చేసిన జీవో నెంబరు 64ను అనుసరిస్తూ ప్రత్యేక షెడ్యూల్డును హెచ్‌ఓడిలంతా పాటించాలంటూ పేర్కొంది. వీటితోపాటు ఆరోగ్యశాఖకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విజయవాడ మరో ఉత్తర్వులు రీషెడ్యూల్డు చేస్తూ జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో 9వ తేదీ నుంచి 11వ తేదీలోపు బదిలీల జాబితాను సిద్ధం చేయాలని, 12వ తేదీన 14లోపు ఉద్యోగులు, బదిలీల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుచేసుకోవాలని, 15,16 తేదీల్లో వినతుల పరిశీలన, 17న మెరిట్ లిస్టు, 18న కౌనె్సలింగ్‌కు హాజరయ్యే ప్రధాన జాబితా, 19న బదిలీల గ్రీవెన్సు, 20, 22, 23తేదీల్లో జోనల్ కేడర్ల వారీగా బదిలీల ప్రక్రియ నిర్వహించాలని పేర్కొంది. అయితే ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో బదిలీల జాబితా ఎంటర్ కాకపోవడమేకాకుండా సంబంధిత వెబ్‌సైట్ నేటికి తెరుచుకోలేదు.
* వెబ్‌సైట్ కోసం నిరీక్షణ...
వైద్య,ఆరోగ్యశాఖ ఆన్‌లైన్ బదిలీలు చేపట్టే కార్యక్రమంలోభాగంగా ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్ వాస్తవానికి ఈ నెల 12వ తేదీ నుంచి అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ కేవలం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉద్యోగుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం కారణంగా ఆయా శాఖలు రూపొందించిన రీ షెడ్యూల్డు తేదీలు సైతం దాటిపోవడం గమనార్హం. వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తే బదిలీల ఉద్యోగుల జాబితాను ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు డిఎంహెచ్‌ఓ కార్యాలయం ఉద్యోగులతోపాటు ఆర్డీ కార్యాలయ సిబ్బంది ఎదురుచూస్తున్నారు. బదిలీలు జరుగుతాయనే ఆశతో కొంతమంది ఉద్యోగులంతా ఆన్‌లైన ప్రక్రియ చేపట్టేందుకు వెబ్‌సైట్ ఎపుడు తెరుచుకుంటుందంటూ ఆయా కార్యాలయ ఉద్యోగులను ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జాబితా సిద్ధం చేస్తున్న ఉద్యోగులు వెబ్‌సైట్ కోసం నిరీక్షించడంతోపాటు మార్గదర్శకాల్లో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉండటంతోనే జాప్యం జరుగుతుందని భావిస్తున్నారు.
* ఏజెన్సీ అభ్యర్థులకు దక్కని ప్రాధాన్యత
ఏజెన్సీలో చాలాకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఈసారి బదిలీల్లో చోటుదక్కే అవకాశం లేకపోవడం విస్మయపరుస్తోంది. ఏజెన్సీ ఐటిడిఏ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు సరైన సౌకర్యం కల్పించకపోవడం తీవ్ర నిరాశపరుస్తుందని ఆయాశాఖల వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఆన్‌లైన్ ప్రక్రియలో సీనియార్టీ ఉద్యోగులంతా మూడు బదిలీల స్థానాలు అవకాశం కల్పించడం కొంతమంది ఉద్యోగులకే న్యాయం జరుగుతుందని, మిగిలిన వారికి న్యాయం జరిగే అవకాశం లేదని సంకేతాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఏజెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగులకు పాయింట్లు, లేదా వెయిటేజీలు అవకాశం కల్పించి వారికి సైతం తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
* బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్
సాధారణ బదిలీల్లో భాగంగా అన్ని శాఖల్లో బదిలీలను జీవోల్లో పొందుపరుస్తున్న విధివిధానాలకు లోబడి పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బదిలీల ప్రక్రియ ఈ నెల 24వ తేదీతో ముగియనున్నందున తిరిగి 25నుంచి నిషేధం అమలవుతుందన్నారు. అన్ని డిపార్టుమెంట్లలో ఈ నెల 21వ తేదీల్లోపు కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టి అర్హులైన వారందరి జాబితాను తయారుచేసి సమర్పించాలన్నారు. ఏజెన్సీ మండలాల్లో ఖాళీలను భర్తీ చేయాలని 50 ఏళ్ళ పైబడిన వారికి ఏజెన్సీకి బదిలీ చేయరాదని ఏజెన్సీలో రెండేళ్ళు పైబడి పనిచేస్తున్నవారికి తప్పనిసరిగా మైదాన ప్రాంతాలకు బదిలీ చేయాలన్నారు. మార్చి - 2018లోపు పదవీవిరమణ చేసే ఉద్యోగులకు బదిలీలు చేయరాదన్నారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను తక్షణమే కార్యాలయానికి పంపాలని కలెక్టర్ ఆదేశించారు.