విశాఖపట్నం

గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: విశాఖ ఏజెన్సీలో గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపాలని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ సిబ్బందిని ఆదేశించారు. నెలవారీ నేర సమీక్షను డిఐజి శ్రీకాంత్, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి కేసులలో మూలాలను వదిలిపెట్టకుండా, రవాణాను ప్రోత్సహిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ముఖ్యమైన నేర పరిశోధనలో డిఎస్పీ స్థాయి అధికారులు స్వయంగా పర్యవేక్షించినప్పుడే కింది స్థాయి అధికారులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తారని ఎస్పీ చెప్పారు. ఎపిజివి బ్యాంక్ దొంగతనాన్ని తక్కువ సమయంలో చేధించి, నేరస్తులను అరెస్ట్ చేశామని, ఇందులో డిఎస్పీ స్థాయి అధికారులు చొరవ చూపడం వలనే సాధ్యమైందని ఆయన తెలియచేశారు. ఈ కేసును చేధించిన అధికారులు క్రైం అదనపు ఎస్పీ ఎన్.జె.రాజ్‌కుమార్, అనకాపల్లి డిఎస్పీ కె.వి.రమణ, సిసిఎస్ డిఎస్పీ ఎలియాసాగర్, అనకాపల్లి ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్, పి.కోటేశ్వరరావు, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుల్ ప్రదీప్‌కుమార్, క్లూస్ టీం ఎస్.లక్ష్మీనరసింహరావు, ఐ.టి.కోర్ టీం ఆర్.శ్రీ్థర్‌కు ఎస్పీ నగదు పురస్కారాన్ని అందించారు. అలాగే ప్రత్యేక ప్రోత్సాహకాల కింద ప్రతిభ కనబరిచిన ఎస్.బి.ఎక్స్ ఎ.వెంకటరావు, ఇన్‌స్పెక్టర్‌ను డిఐజి అభినందించి, నగదు పురస్కారాన్ని అందించారు. అలాగే జాతీయ స్థాయి ఈత పోటీల్లో 4వ మాస్టర్స్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్, నాందేడ్, మహారాష్టల్ల్రో పోటీల్లో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్స్ సిహెచ్.శ్రీనివాసరావు, జి.మధుబాబు, ఎం.నవీన్‌కుమార్‌లను డిఐజి సిహెచ్.శ్రీకాంత్ నగదు పురస్కారాన్ని అందించారు.

గీతం విద్యార్థుల డిజిథాన్

విశాఖపట్నం, నవంబర్ 21: గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ నెల 24,25 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి సన్నాహకంగా గీతం కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు డిజిథాన్ నిర్వహించారు. గీతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో స్థానిక ఆర్కే బీచ్ వద్ద మంగళవారం వాక్‌థాన్ నిర్వహించారు. గీతంతో పాటు నగరంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యక్రమాన్ని గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే లక్ష్మీప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఎ స్టెప్ టూ వర్డ్స్ డిజిటలైజేషన్’ పేరిట జరిగే సీఐఎస్ రాష్ట్ర స్థాయి సమావేశాలు విద్యార్థులకు కొత్త దిశానిర్ధేశం చేయగలవన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పీవీ నాగేశ్వర రావు, సీఎస్‌ఐ విద్యార్థి విభాగం ఫ్యాకల్టీ సలహాదారు ప్రొఫెసర్ ఆర్ శిరీష, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ప్రోఫెసర్ కే నీలిమ, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ జీ వీరేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు. డిజిటలైజేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను విరించే ఫ్లకార్డులను విద్యార్థులు వాక్‌థాన్‌లో ప్రదర్శించారు.