విశాఖపట్నం

కేకే లైన్ సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 10: కేకే లైన్ సిద్ధం కావడంతో ఈ మార్గంలో నిత్యం తిరిగే ప్రయాణికులు, రైల్వే ఉద్యోగుల ఇబ్బందులు తప్పుతున్నాయి. కోరాపుట్- కిరండూల్ (కెకె) మార్గంలో ఎట్టకేలకు రైళ్ళపోకలకు మార్గం సుగమం అయింది. ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరు డివిజన్ పరిధిలోకి వచ్చే కోరాపుట్-కిరండూల్ (కెకె) రైల్వేలైనులో బొర్రాగుహలు-చిమిడిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య కొండ చరియలు విరిగిపడి బ్రిడ్జి స్తంభం దెబ్బతింది. అక్టోబర్ 6న జరిగిన సంఘటనతో ఈ మార్గంలో నడిచే గూడ్స్ రైళ్ళకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే ప్రధానమైన విస్టాడూమ్ అరకు అద్దాల రైలును నిలిపివేయాల్సి వచ్చింది. దీనివల్ల రూ.300 కోట్లకు పైగానే నష్టం వాటిల్లినట్టు డివిజన్ అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం నుంచి 90 కిలోమీటర్లు, ఒడిశా కోరాపుట్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశానికి రాకపోకలు సాగించడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. సంఘటన జరిగిన రోజు నుంచి యుద్ధప్రాతిపదికన చేపట్టిన పనులతో ఈ మార్గాన్ని అందుబాటులోకి తీసుకురాగలిగారు. దీనికి 34 టన్నుల రాక్ బ్రేకర్లు, మరో 300 టన్నుల సామర్ధ్యం కలిగి ఉండే ఎక్సకావేటర్, 200 టన్నుల సామర్ధ్యం కలిగిన ఎక్స్‌కావేటర్, 75 టన్నుల సామర్ధ్యం కలిగిన ఎక్సాకావేటర్లను ఉపయోగించారు. పంపింగ్ విధానం ద్వారా కాంక్రిట్‌తో దీనిని నిర్మించారు. అక్టోబర్ ఆరో తేదీన జరిగిన సంఘటనతో దీనిని మెరుగుపరిచేందుకు ప్రారంభమైన పునరుద్ధరణ పనుల కోసం ఏడు కోట్ల రూపాయల మేర వెచ్చించాల్సి వచ్చింది. అలాగే 58 రోజులపాటు నిర్వహించిన పనుల్లో 400 మంది కార్మికులు పాల్గొన్నారు. బ్రిడ్జిపనులు రికార్డుస్థాయిలో తక్కువ కాలంలో పూర్తిచేయగలిగినట్టు వాల్తేరుడివిజన్ అధికారులు చెబుతున్నారు. దీంతో కెకె లైన్ మార్గం రైళ్ళరాకపోకలకు మార్గం సుగమం అయింది. విశాఖపట్నం-జగదల్‌పూర్-విశాఖపట్నం (08511/08512) ఎక్స్‌ప్రెస్ యదావిధిగా సాధారణ మార్గంలోనే నడుస్తుంది. ఆదివారం నుంచి అరకు మీదుగా దీనిని నిర్వహిస్తున్నారు. అలాగే విశాఖపట్నం-కిరూండల్-విశాఖపట్నం (58501/58502) పాసింజర్ ఈ నెల 11వ తేదీ నుంచి అరకు మీదుగా యదావిధిగా నిర్వహిస్తున్నట్టు సంబంధితాధికారి పేర్కొన్నారు.